ప్రధాన మంత్రి కార్యాలయం

లఖ్ నవూ విశ్వవిద్యాలయం శతాబ్ది స్థాపన దిన వేడుక ను  ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

స్థానిక ఉత్పత్తులకు విశ్వవిద్యాలయం మద్దతును ఇవ్వాలి : ప్రధాన మంత్రి

ఆలోచనలలో సకారాత్మకత ను, దృష్టికోణంలో అవకాశాలను ఎల్లప్పుడూ సజీవంగా ఉంచుకోవాలి : ప్రధాన మంత్రి


జాతీయ విద్య విధానం సరళత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రోత్సహిస్తుంది : ప్రధాన మంత్రి


గడచిన ఆరు సంవత్సరాల లోని ఖాదీ విక్రయాలు అంతకు పూర్వం ఇరవై సంవత్సరాల కంటే  ఎక్కువ గా ఉన్నాయి : ప్రధాన మంత్రి
 

Posted On: 25 NOV 2020 7:14PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా లఖ్ నవూ విశ్వవిద్యాలయం శతాబ్ది స్థాపన దిన వేడుకలను ఉద్దేశించి  ప్రసంగించారు.  ఈ సందర్భం లో ప్రధాన మంత్రి విశ్వవిద్యాలయ శతాబ్ది స్మారక నాణేన్ని ఆవిష్కరించారు.  భారతీయ తపాలా జారీ చేసిన ప్రత్యేక స్మారక తపాలా బిళ్ళ ను, దాని ప్రత్యేక కవరు ‌ను కూడా ఆయన విడుదల చేశారు.  ఈ కార్యక్రమం లో కేంద్ర రక్షణ మంత్రి, లఖ్ నవూ పార్లమెంటు సభ్యుడు శ్రీ రాజ్ నాథ్ సింహ్ తో పాటు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు.

స్థానిక కళలు, ఉత్పత్తులపై కోర్సులను అందించాలంటూ ప్రధాన మంత్రి విశ్వవిద్యాలయాన్ని ప్రోత్సహించారు.  అదేవిధంగా, ఈ స్థానిక ఉత్పత్తులకు అదనపు విలువ ను జోడించడానికి అవసరమైన పరిశోధన చేయవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు.  లఖ్ నవూ ‘చికన్ కారీ’, మొరాదాబాద్ ఇత్తడి సామానులు, అలీగఢ్ తాళాలు, భదోహీ తివాచీల వంటి ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేలా చేసేందుకు అవసరమైన నిర్వహణ, బ్రాండింగ్, వ్యూహం అంశాలను,  విశ్వవిద్యాలయంలో అందించే కోర్సులలో భాగంగా ఉండాలని ఆయన సూచన చేశారు.  ఇది ‘ఒక జిల్లా- ఒక ఉత్పత్తి’ భావన ను సాకారం చేయడం లో సాయపడుతుందన్నారు.  కళలు, సంస్కృతి,  ఆధ్యాత్మికత వంటి అంశాలతో అనుబంధాన్ని కొనసాగించాలని, వాటికి ప్రపంచం అంతటా వ్యాప్తి లభించేటట్టు చూడాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.

సామర్థ్యాలను గుర్తించవలసిన అవసరాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, రాయ్ బరేలీ రైలు పెట్టెల కర్మాగారాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. ఆ కర్మాగారంలో పెట్టిన పెట్టుబడి ని చాలా కాలం పాటు చిన్న చిన్న ఉత్పత్తులకు,  కపూర్ థలా లో తయారయ్యే కోచ్‌ లకు ఏవో అమరికల కోసం తప్ప పెద్దగా ఉపయోగించనే లేదని ఆయన అన్నారు.  ఈ కర్మాగారానికి కోచ్‌లను తయారు చేసే సామర్థ్యం  ఉన్నప్పటికీ దానిని పూర్తి స్థాయి లో ఎన్నడూ వినియోగించుకోలేదు అని ఆయన అన్నారు.  ఈ విధంగా సామర్ధ్యం కంటే తక్కువ వినియోగించుకొనే పరిస్థితి 2014 వ సంవత్సరం లో మారిపోయింది. ఫ్యాక్టరీ పూర్తి సామర్థ్యాలను వినియోగంలోకి తీసుకురావడం జరిగింది.  ఫలితంగా ఈ రోజు న ఈ కర్మాగారం వందల కొద్దీ బోగీలను ఉత్పత్తి చేస్తోంది.  సామర్థ్యాలకు సమానంగా సంకల్ప శక్తి, ఉద్దేశ్యం ముఖ్యం అని శ్రీ మోదీ అన్నారు.  ఈ సందర్భంలో ప్రధాన మంత్రి అనేక ఇతర ఉదాహరణలను ప్రస్తావిస్తూ, ‘ఆలోచన లో సకారాత్మకత, దృష్టికోణంలో అవకాశాలను ఎల్లప్పుడూ సజీవంగా ఉంచుకోవాలి’ అన్నారు.

గుజరాత్‌ లోని విద్యార్థుల సహాయంతో గాంధీ జయంతి కి పోర్ బందర్ ‌లో జరిగిన ఒక ఫ్యాశన్ శో మాధ్యమం ద్వారా ఖాదీ ని లోకప్రియత్వాన్ని అందించిన తన అనుభవాన్ని గురించి శ్రీ నరేంద్ర మోదీ వివరించారు.  దీనితో ఖాదీ  'ఫ్యాశనబుల్' గా మారిపోయిందన్నారు.  గత ఆరేళ్లలో ఖాదీ అమ్మకాలు, అంతకు పూర్వం 20 సంవత్సరాలలో అయిన మొత్తం విక్రయాల కంటే  ఎక్కువ గా ఉన్నాయని ప్రధాన మంత్రి తెలిపారు.  

ఆధునిక జీవనం లోని ఒత్తిడులు, ఇలెక్ట్రానిక్ సాధనాల పై ఆధారపడటం అనేది పెరిగిపోవడం గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, యువతీయువకుల లో చింతన, ఆత్మబోధ అలవాటు అనేవి తగ్గిపోతున్నాయన్నారు.  యువత అన్ని రకాలైన ఒత్తిడుల మధ్య తమ కోసం సమయాన్ని కేటాయించుకోవాలని ప్రధాన మంత్రి సూచించారు.  ఇలా చేస్తే వారికి స్వీయ సామర్థ్యాలను పెంచుకోవడం లో సాయం అందుతుంది అని ఆయన పేర్కొన్నారు.

జాతీయ విద్య విధానం అనేది విద్యార్థినీవిద్యార్థులు వారిని వారే పరీక్షించుకొనేందుకు ఒక సాధనంగా ఉందని ప్రధాన మంత్రి అన్నారు.  విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, వారిని మార్పులకు అలవాటు పడేటట్టు తీర్చిదిద్దేందుకు నూతన విధానం లో కృషి జరిగిందని ఆయన చెప్పారు.  మూసలను బద్దలు చేయండి, పరిమితులను మించి ఆలోచనలు చేస్తూ ఉండండి, మార్పు లకు భయపడకండి అంటూ విద్యార్థినీవిద్యార్థులకు ఆయన పిలుపునిచ్చారు.  కొత్త విద్య విధానాన్ని గురించి చర్చించి,  దాని అమలు కు సాయపడాల్సిందిగా   విద్యార్థినీవిద్యార్థులకు ప్రధాన మంత్రి సూచించారు.



 

***



(Release ID: 1675997) Visitor Counter : 122