వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

జర్మనీతో వర్చువల్ కొనుగోలు, అమ్మకందారుల సమావేశాన్ని నిర్వహించిన ఏపీఈడీఏ

Posted On: 26 NOV 2020 4:12PM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద ప‌ని చేస్తున్న వ్యవసాయ మరియు ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి ప్రాధికారిక సంస్థ (ఏపీఈడీఏ).. వివిధ‌ ఎగుమతి ప్రచార కార్యకలాపాల ద్వారా షెడ్యూల్ చేసిన వ్యవసాయ మరియు ప్రాసెస్ చేసిన ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి వీలు కల్పిస్తోంది. కోవిడ్-19 మహమ్మారి కాలంలో వర్చువల్ విధానంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహించడానికి ఏపీఈడీఏ తన వంతు ప్రయత్నాన్ని కొనసాగించింది. విదేశాలలో ఉన్న భారతీయ మిషన్ల సహకారంతో దిగుమతి చేసుకునే దేశాలతో పలు వర్చువల్ కొనుగోలు, అమ్మకందారుల సమావేశాలు నిర్వహించింది. ఈ శ్రేణిలో భాగంగా దేశం నుండి తాజా పండ్లు మరియు కూరగాయల ఎగుమతిని ప్రోత్సహించడానికి గాను ఈ నెల‌ 25న జ‌ర్మ‌నీ దిగుమతిదారులతో వర్చువల్ నెట్‌వర్కింగ్ సమావేశాన్ని నిర్వహించింది. బెర్లిన్ న‌గ‌రంలోని భారత రాయబార కార్యాలయం, జర్మన్ అగ్రిబిజినెస్ అలయన్స్ సహకారంతో ఏపీఈడీఏ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 70 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెర్లిన్ న‌గ‌రంలోని భారత రాయబార కార్యాలయ మిష‌న్ డిప్యూటీ హెడ్ ‌శ్రీమతి పరమితా త్రిపాఠి, ఏపీఈడీఏ సంస్థ చైర్మెన్ డాక్టర్ ఎం.అంగముత్తు, జర్మన్ అగ్రిబిజినెస్ అలయన్స్ చైర్‌పర్సన్ శ్రీమతి జూలియా హర్నాల్ కార్యక్ర‌మంలో పాల్గొని ప్ర‌సంగించారు. డాక్టర్ ఎం. అంగముత్తు మాట్లాడుతూ భారతీయ జీఐ మరియు సేంద్రీయ ఉత్పత్తులతో పాటు ప్రాసెస్ చేసిన ఉత్పత్తుల ప్రాధాన్యతల‌ను గురించి ప్ర‌ధానంగా  ఈ స‌మావేశంలో వివ‌రించారు. భారత రాయబార కార్యాలయం, మిషన్ డిప్యూటీ హెడ్ శ్రీమతి పరమితా త్రిపాఠి మాట్లాడుతూ విశిష్ఠ‌మైన రుచులు, లక్షణాల కార‌ణంగా‌ భారతీయ ఉద్యానవన ఉత్ప‌త్తులు మేటి ఉనికిని క‌లిగి ఉన్నాయ‌ని నొక్కి చెప్పారు. ఎగుమతుల్లో భారతీయ వ్యవసాయ ఉత్పత్తుల బలం గురించి ప్రత్యేకంగా ద్రాక్ష మరియు తాజా పండ్లు మరియు కూరగాయల విష‌య‌మై తెలియ‌జేస్తూ భారతీయ పక్షాన ప్రదర్శనలు నిలిచాయి. జర్మనీ వైపు నుండి, జర్మనీ మార్కెట్ యొక్క అవసరాలు, అంచనాలపై ప్రదర్శనలు నిలిచాయి.
భారతీయ వ్యవసాయ ఉత్పత్తులపై జర్మనీ కొనుగోలుదారుల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడానికి, ఎగుమతులను సులభతరం చేయడానికి తాజా పండ్లు మరియు కూరగాయల ఎగుమతిలో భారత దేశ బలాన్ని ప్రదర్శించడానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలిచింది.
                             

*****

 

 (Release ID: 1676273) Visitor Counter : 6