మంత్రిమండలి

‘బ్రిక్స్‌’ దేశాల మ‌ధ్య క్రీడలు, ఫిజికల్ కల్చర్ రంగంలో స‌హ‌కారం అంశంపై అవ‌గాహన పూర్వ‌క ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి

Posted On: 25 NOV 2020 3:32PM by PIB Hyderabad

బిఆర్ఐసిఎస్ (‘బ్రిక్స్‌’) స‌భ్య‌త్వ దేశాల తో క్రీడలు, ఫిజికల్ కల్చర్ రంగంలో స‌హ‌కారానికి సంబంధించి సంతకాలైన ఓ అవ‌గాహ‌న‌పూర్వ‌క ఒప్పంద ప‌త్రం (ఎమ్ఒయు) ను గురించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జరిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం దృష్టికి తీసుకురావ‌డ‌మైంది.

బ్రిక్స్ లో సభ్యత్వం కలిగిన ఈ అయిదు దేశాల తో క్రీడల రంగంలో స‌హ‌కారం కుదరడం క్రీడ‌ల‌కు సంబంధించిన విజ్ఞానం, క్రీడాసంబంధి చికిత్స‌, శిక్ష‌ణ‌ప‌ర‌మైన మెల‌కువ‌లు మొదలైన అంశాల జ్ఞానాన్ని, నైపుణ్యాలను విస్త‌రింప చేసుకోవ‌డంలో స‌హాయ‌కారి కానుంది.  దీనితో అంత‌ర్జాతీయ ఆట‌ల పోటీల‌ లో మ‌న క్రీడాకారుల ప్ర‌ద‌ర్శ‌న‌ మెరుగుప‌డడం ఒక్కటే కాకుండా ‘బ్రిక్స్’ స‌భ్య‌త్వ దేశాల‌తో మన ద్వైపాక్షిక సంబంధాలు కూడా బ‌ల‌ప‌డగలవు.

ఈ దేశాలతో క్రీడ‌ల విషయం లో స‌హ‌కారానికి సంబంధించిన లబ్ధి క్రీడాకారులకు  వారి కులం, వ‌ర్గం, ప్రాంతం, మ‌తం, వారు ఆడవారా లేక మ‌గవారా అనే భేదభావాలకు అతీతంగా అందరికీ స‌మాన ప్రాతిప‌దిక‌ న అందనుంది.



 

***


(Release ID: 1675663) Visitor Counter : 142