ప్రధాన మంత్రి కార్యాలయం
నవంబర్, 26వ తేదీన ఆర్.ఈ-ఇన్వెస్ట్ 2020 సదస్సును ప్రారంభించనున్న - ప్రధానమంత్రి
Posted On:
24 NOV 2020 6:13PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 3వ అంతర్జీతీయ పునరుత్పాదక ఇంధన పెట్టుబడి సమావేశం మరియు ప్రదర్శన (ఆర్.ఈ-ఇన్వెస్ట్ 2020) ను, 2020 నవంబర్, 26వ తేదీ సాయంత్రం 5 గంటల 30 నిముషాలకు ప్రారంభించనున్నారు. నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఈ సదస్సు, నవంబర్ 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరుగుతుంది.
ఆర్.ఈ - ఇన్వెస్ట్ 2020 గురించి :
"స్థిరమైన విద్యుత్తు పరివర్తన కోసం ఆవిష్కరణలు" అనే ఇతివృత్తంతో, ఆర్.ఈ-ఇన్వెస్ట్ 2020 సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో భాగంగా, పునరుత్పాదక మరియు భవిష్యత్తు ఇంధన ఎంపికల పై 3 రోజుల సమావేశాలతో పాటు తయారీదారులు, డెవలపర్లు, పెట్టుబడిదారులు మరియు ఆవిష్కర్తల ప్రదర్శనను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సదస్సులో 75 మందికి పైగా అంతర్జాతీయ మంత్రుల స్థాయి ప్రతినిధులు, 1000 మందికి పైగా ప్రపంచ పరిశ్రమల అధిపతులు, 50,000 మంది ప్రతినిధులు హాజరవుతారని భావిస్తున్నారు. పునరుత్పాదక ఇంధనం అభివృద్ధి మరియు విస్తరణను పెంపొందించడానికీ, ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను భారతీయ ఇంధన రంగ భాగస్వాములతో అనుసంధానించడానికీ వీలుగా ప్రపంచ వ్యాప్త ప్రయత్నాలను వేగవంతం చేయడం లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. 2015, 2018 సంవత్సరాలలో నిర్వహించిన మొదటి రెండు సదస్సులు విజయవంతమైన నేపథ్యంలో పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడి ప్రోత్సాహానికి ఒక అంతర్జాతీయ వేదికను నెలకొల్పాలని ఈ సదస్సు లక్ష్యంగా పెట్టుకుంది.
*****
(Release ID: 1675502)
Visitor Counter : 208
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam