ప్రధాన మంత్రి కార్యాలయం

పార్లమెంటు సభ్యుల కోసం నవంబర్ 23వ తేదీన బహుళ అంతస్తుల ఫ్లాట్లను ప్రారంభించనున్న - ప్రధానమంత్రి

Posted On: 21 NOV 2020 4:22PM by PIB Hyderabad

పార్లమెంటు సభ్యుల కోసం నిర్మించిన బహుళ అంతస్తుల ఫ్లాట్లను, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2020 నవంబర్, 23వ తేదీ ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి లోక్ ‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా కూడా హాజరుకానున్నారు.

న్యూఢిల్లీ లోని డాక్టర్ బి.డి. మార్గ్ వద్ద ఈ ఫ్లాట్లను నిర్మించారు.  80 సంవత్సరాల క్రితం నిర్మించిన ఎనిమిది పాత భవనాల స్థానంలో ఇప్పుడు 76 ఫ్లాట్లను నిర్మించారు.  మంజూరు చేసిన వ్యయం కంటే సుమారు 14 శాతం పొదుపుతో ఈ ఫ్లాట్ల నిర్మాణం పూర్తయ్యింది. కోవిడ్-19 ప్రభావం ఉన్నప్పటికీ సకాలంలో ఈ ఫ్లాట్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది.

ఈ నిర్మాణంలో - ఫ్లై బూడిద మరియు నిర్మాణం,కూల్చివేత వ్యర్థాలతో తయారు చేసిన ఇటుకలు;  థర్మల్ ఇన్సులేషన్ మరియు శక్తి సామర్థ్యం కోసం డబుల్ గ్లేజ్డ్ కిటికీలు;  విద్యుత్తును పొదుపు చేయడానికి ఉపకరించే ఎల్.ఈ.డి. బల్బులు, ఉపకరణాలు;   మనుషులు ఉన్నప్పుడు మాత్రమే దీపాలు వెలిగే విధంగా సెన్సార్ల ఏర్పాటు;  తక్కువ విద్యుత్తు వినియోగం కోసం వి.ఆర్.వి. వ్యవస్థ కలిగిన ఎయిర్ కండీషనర్లు, నీటి సంరక్షణ కోసం తక్కువ వేగంతో నీటిని విడుదల చేసే ఉపకరణాల ఏర్పాటు;  వర్షపు నీటి  సేకరణ వ్యవస్థ, పైకప్పు మీద సౌర విద్యుత్తు ప్లాంటు ఏర్పాటు వంటి అనేక హరిత భవన నిర్మాణ కార్యక్రమాలను అమలుచేశారు. 

*****(Release ID: 1674784) Visitor Counter : 138