PIB Headquarters

కోవిడ్-19 మీద పిఐబి రోజువారీ బులిటెన్

Posted On: 20 NOV 2020 5:55PM by PIB Hyderabad

 

Coat of arms of India PNG images free download

(ఇందులో గత 24 గంటలలో కోవిడ్-19 కు సంబంధించిన పత్రికా ప్రకటనలుపిఐబి క్షేత్ర సిబ్బంది అందించిన సమాచారంపిఇబి చేపట్టిన నిజనిర్థారణ సమాచారం ఉంటుంది.)

 

·       4 రాష్ట్రాలకు ఉన్నత స్థాయి కేంద్ర బృందాల తరలింపు;  పరిశీలనలో మరికొన్ని రాష్ట్రాలు

·       కోవిడ్ నిర్థారణ పరీక్షలు పెంచాలని రాష్ట్రాలకు సూచించిన కేంద్రం, గుర్తించని కేసులు పట్టుకోవాలని  సూచన

·       చికిత్సలో ఉన్న కేసులు మొత్తం కేసులలో 5% లోపు 

·       గత 24 గంటలలో తాజా కోవిడ్ కేసులు 45,882

·       భారత్ లో ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారు 4,43,794 మంది; పాజిటివ్ కేసులలో 4.93% చికిత్సలో

·       8 లక్షల సంప్రదింపులు పూర్తి చేసుకున్న ఆరోగ్యమంత్రిత్వశాఖ వారి ఈ-సంజీవని

Image

4 రాష్ట్రాలకు హుటాహుటిన తరలిన కేంద్ర బృందాలు; పరిశీలనలో మరికొన్ని రాష్ట్రాలు;  పరీక్షల సంఖ్య పెంచాల్సిందిగా కేంద్రం రాష్ట్రాలకు సూచన;  పరీక్షల సంఖ్య పెంచితే పాజిటివ్ శాతం తగ్గుదల; చికిత్సలో ఉన్నవారు మొత్తం కేసుల్లో  5%

కోవిడ్ తీవ్రత బాగా పెరిగినట్టు తేలిన నాలుగు రాష్ట్రాలకు కేంద్రం ఉన్నతస్థాయి ప్రత్యేక బృందాలను హుటాహుటిన తరలించింది. హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మణిపూర్ లో పరిస్థితిలో ఈ విధమైన మార్పు కనబడటంతో  నియంత్రణ, నిఘా, పరీక్షలలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాల కృషికి తోడుగా నిలబడేందుకు ఈ బృందాలను కేంద్రం పంపింది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న మరికొన్ని రాష్ట్రాలకు కూడా ఇలాంటి బృందాలను పంపే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోంది.  రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చురుగ్గా పరీక్షలు జరపాలని, పరీక్షల సంఖ్య బాగా పెంచాలని కేంద్రం మరోమారు సూచించింది. ఎవరూ మిగిలిపోకుండా, నిర్థారణ కాకుండా ఉండిపోయే అవకాశం ఇవ్వవద్దని కోరింది. సకాలంలో గుర్తించి చికిత్స అందించినపుడే ఫలితాలు ఉంటాయని గుర్తు చేస్తూ, ఆనవాళ్లు పట్టుకోవటంలో నియంత్రించటంలో అప్రమత్తంగా ఉండాలని కోరింది. దేశంలో ఇప్పటివరకు 12,95,91,786 శాంపిల్స్ పరీక్షించారు. గత 24 గంటల్లో 10 లక్షలకు పైగా (10,83,397) పరీక్షించారు. పెద్ద ఎత్తున పరీక్షలు జరపటం వలన పాజిటివ్ శాతం క్రమంగా తగ్గుతూ వస్తున్నట్టు తేలింది.  ఈరోజుకు పాజిటివ్ శాతం  6.95% గా నమోదైంది. ఆ విధంగా ఈ రోజుకు 7% కు దిగువ ఉంది. పరీక్షల సంఖ్య పెరుగుతున్నకొద్దీ  పాజిటివ్ శాతం తగ్గుతోంది. 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రోజుకు ప్రతి పది లక్షల జనాభాకు 140 చొప్పున పరీక్షలు జరుపుతున్నాయి. 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మొత్తం పరీక్షలలో పాజిటివ్ కెసుల శాతం జాతీయ సగటు అయిన 6.95% కంటే తక్కువ పాజిటివ్ కేసులు చూపుతున్నాయి. గడిచిన 24 గంటలలో 45,882 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయింది. ప్రస్తుతం దేసంలో చికిత్సపొందుతూ ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 4,43,794 కి చేరింది. వీరు మొత్తం పాజిటివ్ కేసులలో  4.93%  మంది. ఆ విధంగా 5% లోపు కేసులు కొనసాగుతూ ఉన్నాయి. చికిత్స పొందుతూ ఉన్నవారిలో  78.2% మంది 10 రాష్టాల్లోనే ఉన్నారు.  మహారాష్ట్రలో అత్యధికంగా 18.19% మంది కోవిడ్ బాధితులు చికిత్సలో ఉన్నారు. .28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో నేటికి 20,000 కంటే తక్కువమంది చికిత్సలో ఉన్నారు.  భారత్ లో గత 24 గంటలలో కోలుకున్నవారు 44,807 మంది నమొదయ్యారు. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కోలుకున్నవారి సంఖ్య  84,28,409 కు చేరింది. కోలుకున్నవారి శాతం 93.60% అయింది. కోలుకున్నవారికి, చికిత్సలో ఉన్నవారికి మధ్య తేడా క్రమంగా పెరుగుతూ  79,84,615కి చేరింది. తాజాగా కోలుకున్నవారిలో  78.02% మంది 10 రాష్ట్రాలకు చెందినవారు  కేరళలో అత్యధికంగా 6,860 మంది కోలుకున్నారు. ఢిల్లీలో  6,685  మంది, మహారాష్ట్రలో 5,860 మంది కోలుకున్నారు. గత 24 గంటలలో కొత్తగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కెసులలో 77.20%  పది రాష్ట్రాలకు చెందినవే ఉన్నాయి. ఢిల్లీలో 7,546 పాజిటివ్ కేసులు రాగా.  కేరళలో 5,722, మహారాష్ట్రలో  5,535  కేసులు వచ్చాయి. గడిచిన 24 గంటలలో కోవిడ్ వల్ల 584 మంది చనిపోగా, వారిలో 81.85% మంది పది రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు.  మహారాష్ట్రలో అత్యధికంగా 154 మరణాలు నమోదుకాగా ఢిల్లీలో  93 మంది, పశ్చిమ బెంగాల్ లో 53 మరణాలు సంభవించాయి.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1674401 

50,000 కు పైగా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాల నిర్వహణతో చరిత్రాత్మక  మైలురాయి దాటిన భారత్

విశ్వజనీన అరోగ్య రక్షణ దిశలో భారత్ మరో మైలురాయి దాటింది. ఇళ్లకు దగ్గర్లోనే  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సేవలకోసం 50 వేలకు పైగా (50,025) ఆయుష్మాన్ భారత్ వెల్ నెస్ కేంద్రాలను ఇప్పుడు వాడకంలో పెట్టింది. 2022 డిసెంబర్ నాటికి లక్షన్నర కేంద్రాల స్థాపన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవి దాదాపు 25 కోట్ల మందికి సేవలందిస్తున్నాయి. ప్రస్తుతానికి మూడోవంతు కేంద్రాలు స్థాపించారు. కష్టకాలంలో కూడా వాడకంలో పెట్టినందుకు  వీటిని  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈ సందర్భంగా రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను  అభినందించారు. అన్ని స్థాయిలలో సరైన ప్రణాళిక, మానిటరింగ్ ఉండటం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. కోట్లాది మందికి సేవలందించిన అంకిత భావంతో కృషి చేసిన  డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలను కూడా అభినందించారు.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1674370

8 లక్షల సంప్రదింపులు పూర్తి చేసుకున్న ఆరోగ్య మంత్రిత్వశాఖ వారి ఈ -సంజీవని

డిజిటల్ ఆరోగ్య సేవలలో భారత్ చరిత్రాత్మక మైలురాయి దాటింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ వారి ఈ-సంజీవని ఈ రోజుకు 8 లక్షల సంప్రదింపులు పూర్తి చేసుకుంది. ముఖ్యంగా కోవిడ్ సమయంలో నేరుగా సంప్రదించటం సాధ్యంకానివారికి  వైద్య సలహాలకోసం ఇది ఎంతగానో ఉపయోగపడింది.  27 రాష్ట్రాలలో రోజుకు 11,000 మందికి పైగా ఆరోగ్య సేవలు అందుకుంటున్నారు. ఏడాది పొడవునా, మారుమూల ప్రాంతాలకు సైతం ఈ సేవలు అందుబాటులో ఉంటున్నాయి. ఇందులో మొదటిఉ ఐదు రాష్ట్రాలలో తమిళనాడు (259904), ఉత్తరప్రదేశ్ (219715), కేరళ (58000), హిమాచల్ ప్రదేశ్ (46647), మధ్యప్రదేశ్ (43045), గుజరాత్ (41765), ఆంధ్రప్రదేశ్(35217), ఉత్తరాఖండ్ (26819), కర్నాటక (23008),

మహారాష్ట్ర (9741) ఉన్నాయి.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1674467 

శాస్త్ర పరిశోధనను ఉన్నత స్థాయికి తీసుకు వెళ్ళిన ఆయుష్- డిబిటి సహకారం

కోవిడ్ వైరస్ కు సంబంధించి జంతువులమీద అధ్యయనాలు ఆయుష్ మంత్రిత్వశాఖ, బయోటెక్నాలజీ విభాం మధ్య సహకారంతో ఉన్నత స్థాయికి చేరింది.  దాదాపు పూర్తి కావస్తున్న దశకు చేరిన పరిశోధనలు ప్రస్తుతం క్లినికల్ పరీక్షలకు చేరాయి. ఇందులో శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనామండలి (సిఎస్ ఐ ఆర్) పాత్ర కూడా ఉంది. జంతువులమీద పరీక్షలకు అవగాహనా ఒప్పందం కుదిరింది.  ఆయుష్ మంత్రిత్వశాఖకు చెందిన జాతీయ ఔషధ మొక్కల బోర్డు , బయోటెక్నాలజీ డిపార్ట్ మెంట్ సంతకాలు చేశాయి. ఆయుర్వేదం ఆధారంగా జరుగుతున్న అధ్యయనం భారత్ లో జరిగే తొలి పరిశోధన.

వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1674415

చౌకగా ఆరోగ్య రంగ పరిష్కారాలు సాధించటంలో భారత్ కీలకపాత్ర పోషిస్తుంది : శ్రీ పీయూష్ గోయల్

కోవిడ్ సమయంలో ఆస్పత్రులు, డాక్టర్లు, కరోనా యోధులు, అందించిన సేవలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి శ్రీ పీయూష్ గోయల్ ప్రశంసించారు. దేశం వాళ్లకు ఎంతగానో రుణపడి ఉందని, వారి సేవలు వృధా కావని అన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన  ఏషియా హెల్త్ 2020 శిఖరాగ్ర సదస్సు నుద్దేశించి ఆయన మాట్లాడారు. స్వదేశంలో తయారవుతున్న వాక్సిన్ పురోగతి చాలా వేగంగా ఉందన్నారు. 130 కోట్లమందికి ఆరోగ్య సేవలు అందించటానికి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో పనిచేస్తామన్నారు. కోవిడ్ వాక్సిన్ అందరికీ అందుబాటు ధరలో లభించాలని, ఇది మనందరి ఉమ్మడి బాధ్యత అని గోయల్ గుర్తు చేసారు.  చౌకగా వాక్సిన్ అందించటంలో భారత తనదైన పాత్ర పోషిస్తుందన్నారు.

.వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1674575

భారత పరిశ్రమల సమాఖ్య జాతీయ మండలి నుద్దేశించి ప్రసంగించిన డాక్టర్ హర్ష వర్ధన్

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్షవర్ధన్ భారత పరిశ్రమల సమాఖ్య జాతీయ మండలితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. సిఐఐ ఎప్పటికప్పుడు ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయటం వలన కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రజల సంక్షేమం కోసం చేయాల్సిన కార్యక్రమాలమీద ఒక అవగాహన ఏర్పడిందన్నారు. ఉపాధి కల్పన పరంగా చూసినప్పుడు భారత ఆరోగ్య పరిశ్రమ చాలా కీలకమైనదని, అది 2022 నాటికి 8.6 ట్రిలియన్లకు పెరుగుతుందని అంచనావేశామన్నారుఅందుబాటు ధరలో అరోగ్య సేవలందించటం చాలాముఖ్యమని, కోవిడ్ నేపథ్యంలో దీనికి మరింత ప్రాధాన్యముంటుందని గుర్తు చేశారు.

వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1674426

ఉత్తరప్రదేశ్ లోని వింధ్యాచల్ లో గ్రామీణ మంచినీటి సరఫరాకు 22న శంకుస్థాపన చేయనున్న ప్రధాని 

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ  ఈనెల 22న ఉత్తరప్రదేశ్ లోని వింధ్యాచల్ లో గ్రామీణ మంచినీటి సరఫరాకు శంకుస్థాపన చేస్తారు.  వింధ్యాచల్ ప్రాంతంలోని మీర్జాపూర్, సోన్ భద్ర జిల్లాల్లో  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 22న ఉదయం 11.30 కి ఈ కార్యక్రమం ఉంటుంది. గ్రామాల త్రాగు నీరు, పారిశుద్ధ్య కమిటీ సభ్యులతో ప్రధాని ఈ సందర్భంగా ముచ్చటిస్తారు.  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగు ఆదిత్యనాథ్, కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ పథకం కింద రెండు జిల్లాల లోని 2995 గ్రామాలకు చెందిన  42 లక్షలమంది ప్రజలకు కుళాయిల ద్వారా త్రాగు నీరు అందుతుంది. ఈ గ్రామాలన్నిటిలో త్రాగునీరు, పారిశుద్ధ్య గ్రామకమిటీలు ఏర్పాటు చేశారు. కుళాయిల వ్యవస్థ నిర్వహణలో వాళ్ళే కీలకపాత్రధారులవుతారు. 24 నెలల్లో పూర్తికావాల్సిన ఈ ప్రాజెక్ట్ విలువ రూ. 5,555.38 కోట్లు

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1674371

నవంబర్ 21,22 తేదీలలో  15వ జి20 నాయకుల శిఖరాగ్ర సదస్సు

సౌదీ అరేబియాలో రెండు మసీదుల బాధ్యుడైన రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజిజ్ ఆహ్వానం మేరకు  ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 21,22 తేదీలలో జరిగే 15వ జి20 నాయకుల శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతునన్నారు. 21వ శతాబ్దపు అవకాశాలను అందరూ అందిపుచ్చుకోవటం అనే అంశం మీద వర్చువల్ పద్ధతిలో ఈ రెండు రోజుల సదస్సు జరుగుతుంది. 2020 లో ఇది రెండవ సదస్సు. ప్రధానితో జరిపిన టెలిఫోన్ సంభాషణలో ఆహ్వానం పలికారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో జి20 దేశాలమధ్య అవగాహన తదితర అంశాలను సదస్సు చర్చిస్తుంది.

వివరాలకు:  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1674273

21న పండిట్ దీన్ దయాళ్ పెట్రోలియం విశ్వ విద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొనబోతున్న ప్రధాని

గాంధీనగర్ లోని పండిట్ దీన్ దయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయపు 8వ స్నాతకోత్సవం ఈ నెల 21న జరగబోతోంది. ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమ్నామానికి ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారు.  దాదాపు 2600 మంది విద్యార్థులు తమ డిగ్రీ, డిప్లొమా సర్టిఫికెట్లు అందుకోబోతున్నారు. 

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1674273

భారత్-లక్సెంబర్గ్ వర్చువల్ సదస్సు లో ఉమ్మడి ప్రకటన

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1674231

కార్మిక సంస్కరణల దిశలో ముసాయిదా నిబంధనలు నోటిఫై చేసిన కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ

కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ వృత్తిపర భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల నియమావళి-2020కి సంబంధిమ్చిన ముసాయిదా నియమావళిని 2020 నవంబ్వర్ 19న  రూపొందించింది. దీనిమీద అభ్యంతరాలను, సూచనలు, సలహాలను ఆహ్వానించింది.  నోటిఫికేషన్ వెలువడిన నిన్నటి నుంచి 45 రోజుల్లోగా అభ్యంతరాలు తెలియజేయవచ్చునని పేర్కొంది. కార్మికుల భద్రత, వృత్తిపరమైన పని పరిస్థితులు, నౌకాశ్రయాల్లో సిబ్బంది, భవననిర్మాణ కార్మికులు, గని కార్మికులు, అంతర్రాష్ట్ర వలస కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, వర్కింగ్ జర్నలిస్టులు, ఆడియీ విజువల్ సిబ్బంది దీనికిందికి వస్తారు.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1674468 

 

పిఐబి క్షేత్ర సిబ్బంది అందించిన సమాచారం

అస్సాం: అస్సాంలో 175 మంది కోవిడ్ పాజిటివ్ గా తేలారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య  211040 కి చేరింది. 206875 మంది డిశ్చార్జ్ అయ్యారు. చికిత్సలో  3193 మంది ఉండగా 969 మంది మరణించారు..

సిక్కిం: మరో  24 మంది పాజిటివ్ గా తేలింది. ఒకరు మరణించారు. .మొత్తం కేసులు 4632 కు పెరగగా డిశ్చార్జ్ అయినవారు 4186 మంది, చికిత్సలో ఉన్నవారు  265 మంది.

మహారాష్ట్ర: కోవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా  గ్రేటర్ ముంబయ్  పరిధిలోని పాఠశాలలన్నీ  డిసెంబర్ 31 వరకు మూతపడే ఉంటాయి. 9 నుంచి 11 తరగతులవరకు 23 నుంచి పాఠశాలలు ప్రారంభించే విషయంలో విద్యా శాఖామంత్రి, స్థానిక పాలనశాఖామంత్రి సమావేశమై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీపావళి సమయంలో కోవిడ్  పరీక్షల సంఖ్య తగ్గగా, బ్రుహన్ ముంబయ్ మళ్ళీ పరీక్షలు పెంచింది.  రెండో విడత కోవిడ్ వ్యాపించవచ్చునన్న అనుమానాల మధ్య నగరంలో 244 పరీక్షా కేంద్రాలు తెరచారు.  ప్రస్తుతం దాదాపు 80 వేలమంది చికిత్సలో ఉన్నారు. .

గుజరాత్: గుజరాత్ ప్రభుత్వం ఈ రోజునుంచి వారాంతంలో రాత్రి 9 నుంచి అహమ్మదాబాద్ నగరంలో కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది.  మళ్లీ ఉత్తర్వులు ఇచ్చేదాకా రాత్రి పూట  కర్ఫ్యూ సోమవారం నుంచి కూడా కొనసాగుతుంది.  ఇటీవల కోవిడ్ కేసులు పెరుగుతూ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 23 నుమ్చి పునఃప్రారంభించాలనుకున్న పాఠశాలలను నిరవధికంగా వాయిదావేశారు. దీపావళి తరువాత అహమ్మదాబాద్ నగరంలో కోవిడ్ కేసులు బాగా పెరిగాయని ఆకాశవాణి విలేఖరి తెలియజేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 12,700 మంది చికిత్సలో ఉన్నారు.

రాజస్థాన్: గత 24 గంటలలో రాజస్థాన్ లో  2,549 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక రోజులో ఇంత పెద్ద సంఖ్యలో నమోదు కావటం ఇదే మొదటి సారి.    కరోనా కేసులు పెరగటంతో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  మాట్లాడారు. రాజధాని జైపూర్ లో చికిత్సలో ఉన్నవారి సంఖ్య దాదాపు 7వేలకు చేరగా రాష్ట్ర వ్యాప్తంగా. 20,100 మందిచికిత్సలో ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలో ఐసియు పడకల కొరత ఉంది. ఈ పరిస్థితుల్లో పడకలు పెంచాలని ముఖ్యమంత్రి ప్రైవేట్ ఆస్పత్రులకు సూచించారు.

మధ్యప్రదేశ్: రాష్ట్రంలో చికిత్సలో ఉన్నవారు  9,800 కాగా భోపాల్ లో కొత్త కేసులు 300 దాటాయి. మాస్కులు ధరించని వారికి జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  రోజుకు కనీసం 100 మందికి జరిమానా విధిస్తారు. ఒక నగల దుకాణంలో 30 మందికి కోవిడ్ రావరంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం రాష్ట్రంలో చికిత్సలో ఉన్నవారి సంఖ్య 9,800.

చత్తీస్ గఢ్: రాజధాని రాయ్ పూర్ లో  కోవిడ్ కెసులు ఒక్కసారిగా పెరుగుతూ ఉండటంతో నగర ప్రవేశాల వద్ద కోవిడ్ కేంద్రాల ఏర్పాటు అంశం పరిశీలించాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ కు లేక రాశారు. దీనివలన వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చునని అభిప్రాయపడ్దారు. ప్రస్తుతం 19,400 పైగా బాధితులు చికిత్సలో ఉన్నారు.

గోవా: గురువారం నాడు కొత్తగా మరణాలేవీ నమొదు కాలేదు. ప్రస్తుతం 1,343 మంది చికిత్సలో ఉండగా  1,621 శాంపిల్స్ పాజిటిఉవ్ గా తేలాయి. .

కేరళ: కోవిడ్ మొదలైన తీరుమీద అద్యయనం చేసే కార్యక్రమం వచ్చే వారం కేరళలో మొదలవుతుంది.  ప్రతి జిల్లా నుంచి సేకరించిన శాంపిల్స్ ను  ఈ అధ్యయనంలో పరిశీలిస్తారు.  ఐసిఎఆర్ పరిధిలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక అండ్ ఇంటెగ్రేటివ్ బయాలజీ ఈ సమగ్ర అధ్యయనం చేపడుతుంది. మొత్తం 1400 శాంపిల్స్ పరీక్షిస్తారు.జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర విభాగం ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటుంది. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద అధ్యయనంగా భావిస్తున్నారు. ఇలా ఉండగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 5,45,641  కి చేరింది. కొత్తగా 5,722 కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా  4,75,320 మంది కోలుకున్నారు.  68,229  మంది ఇంకా చికిత్సలో ఉన్నారు.

తమిళనాడు:  పూర్తి చేసిన 86  ప్రాజెక్టులను ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి ప్రారంభించారు. వీటి విలువ రూ. 123.53 కోట్లు. 6832 మంది లబ్ధిదారులకు రూ. 46.32 కోట్ల విలువచేసే సహాయాన్ని పంపిణీ చేసారు.  118.93 కోట్ల విలువచేసే మరో 44 ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా చేశారు. సేలం సమీపంలోని వనవాసి పాలిటెక్నిక్ కాలేజ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో వివిధ విభాగాల వినియోగం కోసం రూ. 3,09 కోట్ల విలువచేసే కొత్త వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. కోవిడ్ నిబంధనల మధ్య  తిరువణ్నామలై కార్తీక దీపోత్సవం ప్రారంభమైంది. దేవాదాయ శాఖామంత్రి రామచంద్రన్ సహా అనేకమంది ప్రముఖులు పాల్గొన్నారు.

కర్నాటక: కర్నాటకలో కోవిడ్  తగ్గుముఖం పట్టింది. అయితే 2-3 వారాల తరువాత యూరప్ లో మళ్ళీ విజృంభించిన నేపథ్యంలో వేచుఇ చూసే ధోరణి అవలంబిస్తామని అధిఉకారులు చెబుతున్నారు. ]కేంద్ర మంత్రి సదానంద గౌడకు కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయింది.  కోవిడ్ ఉల్లంఘనలమీద నోటీసు ఇవ్వటానికి రాజకీయపార్టీల జాబితా ఇవ్వాలని కర్నాటక హైకోర్ట్ కోరింది. 

అంధ్రప్రదేశ్: ముఖ్యమంత్రి జగ్నమోహన్ రెడ్డి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభించారు. కర్నూల్ జిల్లా సంకల్ భాగ్ దగ్గర ప్రత్యేక హారతి ఇచ్చి పూజలు జరిపారు. కోవిడ్ నేపధ్యంలోనూ పుష్కరాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎలాంటి హడావిడి లేకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా సంప్రదాయ బద్ధంగా నిర్వహించాలని ఆదేశించింది.   12 రోజులపాటు జరిగే పుష్కరాలకు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే ఘాట్ల దగ్గర పూజలకు అనుమతిస్తారు. ఎవరినీ స్నానాలకు అనుమతించబోమని దేవాదాయ శాఖామంత్రి శ్రీనివాస్ స్పష్టం చేశారు. .

 తెలంగాణ: 894 కొత్త కేసులు, 1057 మంది కొలుకున్నవారు; 4 మరణాలు గత 24 గంటలలో నమోదయ్యాయి.  దీంతో మొత్తం కేసులు : 2,61,728; చికిత్సలో ఉన్నవారు: 12,515; మరణాలు: 1423; కోలుకున్నవారు 2,47,790  గా నమోదయ్యారు. కోలుకున్నవారి శాతం 94.67 . దేశవ్యాప్తంగా కోలుకున్నవారి శాతం 93.6

నిజ నిర్థారణ

 

 

 

 

Image

*******



(Release ID: 1674586) Visitor Counter : 143