ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

4 రాష్ట్రాలకు హుటాహుటిన తరలిన కేంద్ర బృందాలు; పరిశీలనలో మరికొన్ని రాష్ట్రాలు

పరీక్షల సంఖ్య పెంచాల్సిందిగా కేంద్రం రాష్ట్రాలకు సూచన

పరీక్షల సంఖ్య పెంచితే పాజిటివ్ శాతం తగ్గుదల

చికిత్సలో ఉన్నవారు మొత్తం కేసుల్లో 5% లోపే

Posted On: 20 NOV 2020 12:13PM by PIB Hyderabad

కోవిడ్ తీవ్రత బాగా పెరిగినట్టు తేలిన నాలుగు రాష్ట్రాలకు కేంద్రం ఉన్నతస్థాయి ప్రత్యేక బృందాలను హుటాహుటిన తరలించింది. హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మణిపూర్ లో పరిస్థితిలో ఈ విధమైన మార్పు కనబడటంతో  నియంత్రణ, నిఘా, పరీక్షలలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాల కృషికి తోడుగా నిలబడేందుకు ఈ బృందాలను కేంద్రం పంపింది. సకాలంలో వ్యాధి నిర్థారణ,  చికిత్స అందించటంలో ఎదురయ్యే సవాళ్లకు స్పందించటంలో కూడా కేంద్ర బృందాలు సహాయపడతాయి. పాజిటివ్ కేసులు పెరుగుతున్న మరికొన్ని రాష్ట్రాలకు కూడా ఇలాంటి బృందాలను పంపే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోంది.  

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చురుగ్గా పరీక్షలు జరపాలని, పరీక్షల సంఖ్య బాగా పెంచాలని కేంద్రం మరోమారు సూచించింది. ఎవరూ మిగిలిపోకుండా, నిర్థారణ కాకుండా ఉండిపోయే అవకాశం ఇవ్వవద్దని కోరింది. సకాలంలో గుర్తించి చికిత్స అందించినపుడే ఫలితాలు ఉంటాయని గుర్తు చేస్తూ, ఆనవాళ్లు పట్టుకోవటంలో నియంత్రించటంలో అప్రమత్తంగా ఉండాలని కోరింది.

దేశంలో ఇప్పటివరకు 12,95,91,786 శాంపిల్స్ పరీక్షించారు. గత 24 గంటల్లో 10 లక్షలకు పైగా (10,83,397) పరీక్షించారు. పెద్ద ఎత్తున పరీక్షలు జరపటం వలన పాజిటివ్ శాతం క్రమంగా తగ్గుతూ వస్తున్నట్టు తేలింది.  ఈరోజుకు పాజిటివ్ శాతం  6.95% గా నమోదైంది. ఆ విధంగా ఈ రోజుకు 7% కు దిగువ ఉంది. పరీక్షల సంఖ్య పెరుగుతున్నకొద్దీ  పాజిటివ్ శాతం తగ్గుతోంది.

 

34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రోజుకు ప్రతి పది లక్షల జనాభాకు 140 చొప్పున పరీక్షలు జరుపుతున్నాయి. ప్రజారోగ్యం మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షల సంఖ్య నిర్ణయించటంతో బాటు అనుమానితుల ఆనవాలు పట్టుకోవటానికి సమగ్రమైన నిఘా పెట్టారు.

20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మొత్తం పరీక్షలలో పాజిటివ్ కెసుల శాతం జాతీయ సగటు అయిన 6.95% కంటే తక్కువ పాజిటివ్ కేసులు చూపుతున్నాయి.

 

గడిచిన 24 గంటలలో 45,882 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయింది. ప్రస్తుతం దేసంలో చికిత్సపొందుతూ ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 4,43,794 కి చేరింది. వీరు మొత్తం పాజిటివ్ కేసులలో  4.93%  మంది. ఆ విధంగా 5% లోపు కేసులు కొనసాగుతూ ఉన్నాయి. చికిత్స పొందుతూ ఉన్నవారిలో  78.2% మంది 10 రాష్టాల్లోనే ఉన్నారు.  మహారాష్ట్రలో అత్యధికంగా 18.19% మంది కోవిడ్ బాధితులు చికిత్సలో ఉన్నారు. .

 

28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో నేటికి 20,000 కంటే తక్కువమంది చికిత్సలో ఉన్నారు.  

 

భారత్ లో గత 24 గంటలలో కోలుకున్నవారు 44,807 మంది నమొదయ్యారు. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కోలుకున్నవారి సంఖ్య  84,28,409 కు చేరింది. కోలుకున్నవారి శాతం 93.60% అయింది. కోలుకున్నవారికి, చికిత్సలో ఉన్నవారికి మధ్య తేడా క్రమంగా పెరుగుతూ  79,84,615కి చేరింది. తాజాగా కోలుకున్నవారిలో  78.02% మంది 10 రాష్ట్రాలకు చెందినవారు  కేరళలో అత్యధికంగా 6,860 మంది కోలుకున్నారు. ఢిల్లీలో  6,685  మంది, మహారాష్ట్రలో 5,860 మంది కోలుకున్నారు.

 

గత 24 గంటలలో కొత్తగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కెసులలో 77.20%  పది రాష్ట్రాలకు చెందినవే ఉన్నాయి. ఢిల్లీలో 7,546 పాజిటివ్ కేసులు రాగా.  కేరళలో 5,722, మహారాష్ట్రలో  5,535  కేసులు వచ్చాయి.

 

గడిచిన 24 గంటలలో కోవిడ్ వల్ల 584 మంది చనిపోగా, వారిలో 81.85% మంది పది రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు.  మహారాష్ట్రలో అత్యధికంగా 154 మరణాలు నమోదుకాగా ఢిల్లీలో  93 మంది, పశ్చిమ బెంగాల్ లో 53 మరణాలు సంభవించాయి..

****


(Release ID: 1674401) Visitor Counter : 241