ప్రధాన మంత్రి కార్యాలయం
2020 నవంబర్, 21, 22 తేదీలలో జి-20 దేశాల నాయకుల 15వ సదస్సు
Posted On:
19 NOV 2020 8:33PM by PIB Hyderabad
సౌదీ అరేబియా రాజ్యంలోని రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడైన గౌరవనీయులైన రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ ఆహ్వానం మేరకు సౌదీ అరేబియా అధ్యక్షతన జరిగే జి-20 దేశాల 15వ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. "అందరికీ 21వ శతాబ్దపు అవకాశాలను గ్రహించడం" అనే ఇతివృత్తంతో 2020 నవంబర్, 21, 22 తేదీలలో ఈ సదస్సు, వర్చువల్ మాధ్యమంలో జరుగుతుంది.
ఇప్పుడు జరిగే ఈ సదస్సు 2020 సంవత్సరంలో జి-20 దేశాల నాయకుల రెండవ సమావేశం. భారత ప్రధానమంత్రి మరియు సౌదీ అరేబియా యువరాజు మధ్య టెలిఫోన్ లో జరిగిన సంభాషణ అనంతరం, ఇంతకు ముందు, 2020 మార్చి నెలలో జి-20 దేశాల నాయకుల ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాయకులు, కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడానికీ, ప్రపంచ సమన్వయ ప్రతిస్పందనను రూపొందించడానికీ, జి-20 దేశాల మధ్య సకాలంలో అవగాహన పెంచుకున్నారు.
కోవిడ్-19 వ్యాధి నుండి బయటపడి, స్థితిస్థాపకంగా, స్థిరమైన పునరుద్ధరణపై, రాబోయే జి-20 సదస్సులో, దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. మహమ్మారి ఎదుర్కోవడంలో సంసిద్ధత మరియు ఉద్యోగాలను పునరుద్ధరించే మార్గాలపై కూడా జి-20 సదస్సులో నాయకులు చర్చించనున్నారు. సమగ్ర, స్థిరమైన మరియు స్థితిస్థాపక భవిష్యత్తును నిర్మించటానికి నాయకులు తమ దృష్టిని, అభిప్రాయాలను పరస్పరం పంచుకుంటారు.
2020 డిసెంబర్, 1వ తేదీన, ఇటలీ, జి-20 అధ్యక్ష పదవిని స్వీకరించే సమయంలో, సౌదీ అరేబియాతో పాటు జి-20 ట్రోయికాలో భారత్ ప్రవేశిస్తుంది.
*****
(Release ID: 1674273)
Visitor Counter : 191
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Odia
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam