సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

డిజిటల్ మీడియాలో ఎఫ్.డి.ఐ. విధానాన్ని ఒక నెల లోపు అమలుచేయాలని కోరిన - ఐ & బి. మంత్రిత్వ శాఖ

Posted On: 16 NOV 2020 2:23PM by PIB Hyderabad

డిజిటల్ మీడియా ద్వారా వార్తలు మరియు ప్రస్తుత వ్యవహారాలను అప్‌లోడ్ / స్ట్రీమింగ్‌లో పాల్గొనడానికి అర్హత ఉన్న సంస్థలకు,  ప్రభుత్వం అనుమతించిన విధానం కింద 26 శాతం ఎఫ్.డి.ఐ. లను అనుమతిస్తూ,  2019 సెప్టెంబర్, 18వ తేదీన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలుచేయడానికి వీలుగా, కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఈ రోజు ఒక బహిరంగ ప్రకటన జారీ చేసింది.

ఈ నిర్ణయాన్ని ఒక నెల లోపు అమలు చేయాలని కోరుతూ, అర్హత కలిగిన సంస్థలు చేపట్టాల్సిన సవివరమైన చర్యలను తెలియజేస్తూ, మంత్రిత్వ శాఖ ఈ రోజు ఒక బహిరంగ ప్రకటనను తన వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. 

ఈ ప్రకటనలోని ముఖ్యాంశాలు :

i.          26 శాతం కంటే తక్కువ విదేశీ పెట్టుబడులున్న సంస్థలు ఈ రోజు నుండి ఒక నెల లోపు, కింద పేర్కొన్న అంశాలను పొందుపరుస్తూ - కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు తెలియజేయవచ్చు: - 

(ఎ) కంపెనీ / సంస్థ వివరాలు మరియు దాని వాటాల నమూనాతో పాటు దాని డైరెక్టర్లు / వాటాదారుల పేర్లు మరియు చిరునామాల వివరాలు,  

(బి) ప్రమోటర్లు / ముఖ్యమైన యజమానుల పేర్లు మరియు చిరునామాలు, 

(సి)  ఎఫ్.డి.ఐ. విధానం, విదేశీ మారకం నిర్వహణ (నాన్-డెట్ ఇన్స్ట్రుమెంట్స్) నిబంధనలు, 2019 మరియు విదేశీ మారకం నిర్వహణ (నాన్-డెట్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క చెల్లింపు మరియు రిపోర్టింగ్) నిబంధనలు, 2019, క్రింద ధర, డాక్యుమెంటేషన్ మరియు రిపోర్టింగ్ అవసరాలకు అనుగుణంగా ఒక ధృవీకరణ పత్రం (గత / ఇప్పటికే ఉన్న విదేశీ పెట్టుబడులు ఏమైనా ఉంటే, వాటి మద్దతుగా సంబంధిత ధ్రువపత్రాల కాపీలతో పాటు) 

(డి) ఆడిటర్ నివేదికతో పాటు శాశ్వత ఖాతా సంఖ్య (పాన్)  మరియు తాజా ఆడిట్ చేయబడిన / ఆడిట్ చేయని లాభ, నష్టాల (పి  & ఎల్) పట్టిక మరియు బ్యాలెన్స్ షీట్.  

(ii)          ప్రస్తుతం, 26 శాతానికి మించి విదేశీ పెట్టుబడులతో ఈక్విటీ నిర్మాణాన్ని కలిగి ఉన్న సంస్థలు , పైన (i) వద్ద ఉన్న వివరాలతో పాటు, 2021 అక్టోబర్, 15వ తేదీ నాటికి, విదేశీ పెట్టుబడులను 26 శాతానికి తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలను, ఈ రోజు నుండి ఒక నెలలోపు,   సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు సమర్పించాలి మరియు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆమోదం పొందాలి.  

(iii)           దేశంలో కొత్తగా విదేశీ పెట్టుబడులను తీసుకురావాలని అనుకునే ఏదైనా సంస్థ డి.పి.ఐ.ఐ.టి. యొక్క విదేశీ పెట్టుబడుల సౌకర్య పోర్టల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి పొందాలి.

గమనిక:- పెట్టుబడులు అంటే భారతదేశంలో నివసించే వ్యక్తి చేత చందా పొందడం, సేకరించడం లేదా బదిలీ చేయడం.    

(iv)      ప్రతి సంస్థ తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల పౌరసత్వం యొక్క అవసరాలకు అనుగుణంగా ఉండాలి.   నియామకం, కాంట్రాక్ట్ లేదా కన్సల్టెన్సీ లేదా సంస్థ యొక్క పనితీరు కోసం ఇతర సామర్ధ్యాల ద్వారా సంవత్సరంలో 60 రోజులకు పైగా నియమించుకునే అవకాశం ఉన్న విదేశీ సిబ్బందికి, వారిని నియమించుకోడానికి ముందే తగిన భద్రతా అనుమతులు తీసుకోవాలి.  ఇందు కోసం, ఆయా సంస్థలు, విదేశీ సిబ్బందిని నియమించుకోడానికి కనీసం 60 రోజుల ముందుగానే సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకుని, ముందస్తు అనుమతి పొందిన తరువాత మాత్రమే ప్రతిపాదిత విదేశీ సిబ్బందిని నియమించాలి.

బహిరంగ ప్రకటనను ఈ క్రింది యు.ఆర్.ఎల్.  ద్వారా చూడవచ్చు :

https://mib.gov.in/sites/default/files/Public%20Notice%20%20regarding%20FDI%20Policy%20.pdf

 

 

*****



(Release ID: 1673202) Visitor Counter : 217