ప్రధాన మంత్రి కార్యాలయం

మౌలానా ఆజాద్‌ జయంతి, ఆచార్య కృప‌లానీ జ‌యంతి ల సంద‌ర్భం లో వారికి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించిన‌ ప్ర‌ధాన మంత్రి

Posted On: 11 NOV 2020 2:24PM by PIB Hyderabad

మౌలానా ఆజాద్‌ జయంతి, ఆచార్య కృప‌లానీ జ‌యంతి ల సంద‌ర్భం లో వారికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ్ర‌ద్ధాంజ‌లి ని సమర్పించారు.

‘‘దేశ పురోగ‌తి కి విశిష్ట తోడ్పాటుల‌ను అందించిన మార్గ‌ద‌ర్శ‌క ప్ర‌ముఖులు గా మౌలానా ఆజాద్ ను, ఆచార్య కృప‌లానీ ని స్మ‌రించుకొంటూ ఉంటాము.  పేద‌ల జీవితాల‌కు, యువ‌త జీవితాల‌కు సాధికారిత ను క‌ల్పించేందుకు వారు తమను తాము అంకితం చేసుకొన్నారు.  వారి ఉభ‌యుల జ‌యంతి నాడు ఆ ప్ర‌ముఖుల‌కు నేను న‌మస్క‌రిస్తున్నాను.  వారి ఆద‌ర్శాలు మ‌న‌కు ఎల్లప్పటికీ ప్రేర‌ణ‌ ను అందిస్తూనే ఉంటాయి’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

***


(Release ID: 1671903) Visitor Counter : 163