ప్రధాన మంత్రి కార్యాలయం

భారత-ఇటలీ వర్చువల్ సదస్సు (6 నవంబర్, 2020)

Posted On: 06 NOV 2020 7:50PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు ఇటలీ ప్రధాన మంత్రి ప్రొఫెసర్ గియుసేప్ కోంటె మధ్య 2020 నవంబర్, 6వ తేదీన వర్చువల్ ద్వైపాక్షిక సదస్సు జరిగింది.

ప్రొఫెసర్ గియుసేప్ కోంటె 2018 సంవత్సరంలో భారతదేశంలో చేసిన పర్యటనను, ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు, ఈ మధ్యకాలంలో భారతదేశం-ఇటలీ సంబంధాలు వేగంగా వృద్ధి చెందడాన్ని ఆయన ప్రశంసించారు.  షరతులు అనుమతించిన వెంటనే తమ దేశం సందర్శించాలని, ఇటలీ ప్రధానమంత్రి ప్రొఫెసర్ కోంటె, భారత ప్రధానమంత్రి మోదీకి ఆహ్వానం పలికారు.

ద్వైపాక్షిక సంబంధాల విస్తృత పరిధిపై సమగ్రంగా సమీక్షించడానికి ఇరువురు నాయకులకు ఈ సదస్సు ఒక అవకాశం కల్పించింది.  కోవిడ్-19 మహమ్మారితో సహా, ఇతర సాధారణ ప్రపంచ సవాళ్ళకు వ్యతిరేకంగా సహకారాన్ని బలోపేతం చేయాలన్న తమ నిబద్ధతను ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు.

రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక, అంతరిక్ష రంగాలు మరియు రక్షణ సహకారంతో సహా పలు అంశాలపై ఇరువురు నాయకులు చర్చించారు.  ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సమస్యలపై, ఇరుపక్షాలు బహుపాక్షిక వేదికలలో ముఖ్యంగా జి-20 వద్ద సన్నిహితంగా సమన్వయం చేసుకోవడానికి అంగీకరించాయి.  ఇటలీ 2021 డిసెంబర్ ‌లో జి-20 కి అధ్యక్ష పదవిని స్వీకరిస్తూండగా, 2022లో భారతదేశం జి-20 కి అధ్యక్ష స్థానాన్ని చేపట్టనుంది. భారతదేశం మరియు ఇటలీ కలిసి 2020 డిసెంబర్ నుండి జి-20 ట్రోయికాలో భాగంగా ఉంటాయి.  ధృవీకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఐ.ఎస్.ఏ. లో చేరాలని ఇటలీ తీసుకున్న నిర్ణయాన్ని భారతదేశం స్వాగతించింది.

ఇంధనం, మత్స్య పరిశ్రమ, ఓడల నిర్మాణం, రూపకల్పన మొదలైన వివిధ రంగాలలో 15 అవగాహన ఒప్పందాలు / ఒడంబడికలపై ఈ సందర్భంగా సంతకాలు జరిగాయి. 

*****



(Release ID: 1670850) Visitor Counter : 120