వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ- డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ & పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా అర్హులైన లబ్దిదారులకు రేషన్ కార్డులను అందించాలన్న లక్ష్యంతో 2013 నుండి ఇప్పటివరకూ 4.39 కోట్ల బోగస్ రేషన్ కార్డులు తొలగించబడ్డాయి.

తొలగించబడిన రేషన్ కార్డుల స్థానంలో నిజమైన అర్హత కలిగిన లబ్ధిదారులకు / కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు క్రమం తప్పకుండా జారీ చేయబడతాయి.

Posted On: 06 NOV 2020 11:06AM by PIB Hyderabad

ప్రభుత్వ ప్రయోజనాలను  అర్హులైన లబ్దిదారులకు అందించేందుకు టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (టిపిడిఎస్) నిత్యం సాంకేతికంగా ఆధునీకరించబడుతుంది. రేషన్ కార్డులు / లబ్ధిదారుల డేటాబేస్ల డిజిటలైజేషన్, ఆధార్ సీడింగ్, అనర్హమైన / బోగస్ రేషన్ కార్డులను గుర్తించడం ద్వారా దాని కార్యకలాపాలలో పారదర్శకత మరియు సామర్థ్యాన్ని నిత్యం మెరుగుపర్చడం జరుగుతుంది. టెక్నాలజీ ఆధారిత పిడిఎస్ సంస్కరణల్లో భాగంగా డిజిటలైజ్డ్ డేటా ద్వారా నకిలీ, లబ్ధిదారుల వలస / మరణాలను నమోదు చేయడం వల్ల 2013 నుండి 2020 మధ్య కాలంలో దేశంలోని కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు మొత్తం 4.39 కోట్ల అనర్హమైన / బోగస్ రేషన్ కార్డులను తొలగించాయి.

దాంతో పాటు చట్టప్రకారం ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ ద్వారా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు నిత్యం విడుదలయ్యే కోటా నిర్దారిత లక్ష్యానికి అంటే అర్హులైన లబ్దిదారులకు అందే విధంగా ఇది ఉపయోగపడుతుంది.  ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు నిర్దేశించిన పరిమితి మేరకు సరైన అర్హత కలిగిన లబ్ధిదారులు / గృహాలకు ఆ ప్రయోజనం అందించబడుతుంది. అందుకు  ఈ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుంది.

 

 


2011 జనాభా లెక్కల ప్రకారం  81.35 కోట్ల మందికి అంటే దాదాపు 2/3 వంతు జనాభా టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (టిపిడిఎస్) ద్వారా అధిక సబ్సిడీకి ఆహార ధాన్యాలను ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ అందిస్తోంది. ఈ వ్యవస్థ ద్వారా దేశంలో 80 కోట్లకు పైగా ప్రజలు ఆహార ధాన్యాలు (బియ్యం, గోధుమలు, తృణధాన్యాలు)లను అధిక రాయితీతో కేజీ 3 రూపాయలు, 2 రూపాయలు, ఒక రూపాయికి నెలవారీగా పొందగలుగుతున్నారు.
 

****



(Release ID: 1670574) Visitor Counter : 125