సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

'భాస్కరాచార్య నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్పేస్‌ అప్లికేషన్స్‌ అండ్‌ జియో ఇన్ఫర్మాటిక్స్‌'తో ప్రసారభారతి ఎంవోయూ

Posted On: 04 NOV 2020 3:14PM by PIB Hyderabad

కేంద్ర ఎలక్ట్రానిక్స్‌&సమాచార సాంకేతికత శాఖకు చెందిన 'భాస్కరాచార్య నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్పేస్‌ అప్లికేషన్స్‌ అండ్‌ జియో ఇన్ఫర్మాటిక్స్‌'తో, ప్రభుత్వ ప్రసారాల సంస్థ ప్రసారభారతి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఎంవోయూలో భాగంగా; స్వయంప్రభ (22 ఛానెళ్లు, కేంద్ర విద్యాశాఖ), 1-12 తరగతులకు ఈ-విద్య (ఎన్‌సీఈఆర్‌టీ), వందే గుజరాత్‌ (16 ఛానెళ్లు, గుజరాత్‌ ప్రభుత్వం), డిజీశాల (1 ఛానెల్‌, ఎలక్ట్రానిక్స్‌&ఐటీ శాఖ)తో కలిపి 51 డీటీహెచ్‌ విజ్ఞాన టీవీ ఛానెళ్లు అన్ని డీడీ ఛానెళ్ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.

    గ్రామీణ, మారుమూల ప్రాంతాలు సహా ప్రతి ఇంటికి నాణ్యమైన విద్యా కార్యక్రమాలను అందించడం ఈ ఎంవోయూ లక్ష్యం. నైపుణ్యాభివృద్ధి, ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందించాలన్న ప్రభుత్వ నిబద్ధతకు తార్కాణంగా ఈ కార్యక్రమాలను 24 గంటలూ ఉచితంగా అందిస్తున్నారు.

***



(Release ID: 1670051) Visitor Counter : 187