ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రముఖ వాయులీనం విద్వాంసుడు శ్రీ టి.ఎన్. కృష్ణన్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
03 NOV 2020 11:05AM by PIB Hyderabad
ప్రముఖ వాయలినిస్టు శ్రీ టి.ఎన్. కృష్ణన్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారాన్ని వ్యక్తం చేశారు.
‘‘ప్రముఖ ఫిడేలు విద్వాంసుడు శ్రీ టి.ఎన్. కృష్ణన్ మృతి సంగీత జగత్తు కు ఒక పెద్ద లోటు. ఆయన సారంగి కృతులు మన సంస్కృతిలో భాగం అయినటువంటి విస్తృత శ్రేణి భావోద్వేగాల పోగులకు ఒక సుందరమైన ఆకృతిని ఇచ్చాయి. యువ సంగీతకారులకు ఒక అసాధారణ మార్గదర్శకుని పాత్రను కూడా ఆయన పోషించారు. ఆయన కుటుంబానికి, ఆయన ప్రశంసకులకు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఓమ్ శాంతి’’ అని ఒక సందేశంలో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
****
(రిలీజ్ ఐడి: 1669701)
సందర్శకుల సూచీ సంఖ్య : : 197
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam