ప్రధాన మంత్రి కార్యాలయం

కాబుల్ విశ్వ‌విద్యాల‌యం లో జ‌రిగిన ఉగ్రవాద ‌దాడిని తీవ్రంగా ఖండించిన ప్ర‌ధాన మంత్రి

प्रविष्टि तिथि: 02 NOV 2020 11:01PM by PIB Hyderabad

కాబుల్ విశ్వవిద్యాల‌యం లో జ‌రిగిన ఉగ్ర‌వాద దాడిని పిరికిపంద‌లు చేసిన చ‌ర్య‌ గా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పేర్కొంటూ, ఆ చర్య ను తీవ్రం గా ఖండించారు.

‘‘పిరికిపంద ఉగ్రవాద శ‌క్తులు కాబుల్ విశ్వ‌విద్యాల‌యం లో ఈ రోజు న  చేసిన దాడి ని నేను తీవ్రం గా ఖండిస్తున్నాను.  బాధితుల, క్ష‌త‌గాత్రుల కుటుంబాల‌కు క‌లిగిన దు:ఖం లో మేము సైతం పాలుపంచుకొంటున్నాము.  ఉగ్ర‌వాదంతో  అఫ్గానిస్తాన్ చేస్తున్న సాహ‌సిక పోరాటానికి మద్దతివ్వడాన్ని మేము కొనసాగిస్తూనే ఉంటాము’’ అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

****
  


(रिलीज़ आईडी: 1669670) आगंतुक पटल : 157
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam