రక్షణ మంత్రిత్వ శాఖ
ఎయిరో ఇండియా 2021కి మీడియా నమోదు నేటి నుంచి ప్రారంభం
Posted On:
02 NOV 2020 2:45PM by PIB Hyderabad
ఎయిరో ఇండియా 2021, 13వ ఎడిషన్ ఈ నెల 3వ తేదీ నుంచి 7వ తేదీవరకు బెంగళూరు (కర్ణాటక)కు సమీపంలోని యలహంకలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో నిర్వహించనున్నారు.
ఈ ప్రదర్శనను సందర్శించాలనుకునే మీడియా ఉద్యోగుల నమోదు నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం అయింది. మీడియా సిబ్బంది నమోదుకు ఎటువంటి ఫీజు ఉండదు, అయితే ఈ ప్రదర్శనను కవర్ చేయాలనుకునే విదేశీ విలేకరుల వద్ద చట్టబద్ధమైన జె వీసా ఉండాలి.
మీడియా విలేకరులు నమోదు చేసుకునేందుకు ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ (https://aeroindia.gov.in/media/ mediaregcontent )లోకి లాగిన్ అయ్యి చేసుకోవచ్చు. వారి వద్ద ప్రామాణికమైన మీడియా గుర్తింపు కార్డు నెంబరు/ పిఐబి/ రాష్ట్ర అక్రెడిటేషన్ కార్డు నెంబరు (అక్రెడిటేషన్ ఉంటే), ప్రభుత్వం జారీ చేసిన ఫోటో ఐడి కార్డు నెంబర్, 512 కెబి కన్నా తక్కువ ఉన్న ఫోటోను సమర్పించాలి.
ఈ ఐదు రోజుల ప్రదర్శనలో భాగంగా రక్షణ, అంతరిక్ష (ఎయిరోస్పేస్) పరిశ్రమలకు సంబంధించిన భారీ వాణిజ్య ప్రదర్శన కూడా జరుగనుంది. అంతరిక్ష పరిశ్రమలోని అంతర్జాతీయ నాయకులు, బారీ పెట్టుబడిదారులతో పాటు ప్రదర్శనలో ప్రపపంచం నలుమూలల నుంచి వచ్చిన థింక్ టాంక్స్ పాల్గొననున్నాయి. విమానయాన పరిశ్రమలో చోటు చేసుకున్న నూతన అభివృద్ధి, ఆవిష్కరణలు, భావనలు, సమాచారాన్ని పరస్పరం ఇచ్చి పుచ్చుకునే ప్రత్యేక అవకాశాన్ని ఎయిరో ఇండియా కల్పిస్తుంది. దేశీయ విమానయాన పరిశ్రమకు ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి అదనంగా, ఈ ప్రదర్శన మేకిన్ ఇండియా లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్ళేందుకు ప్రయత్నిస్తుంది.
ఎయిరో ఇండియా ప్రదర్శనలో భారతీయ, విదేశీ కంపెనీలు కలిపి మొత్తంగా సుమారు 500 కంపెనీలు పాలుపంచుకోనున్నట్టు భావిస్తున్నారు.
***
(Release ID: 1669468)
Visitor Counter : 217
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam