రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గత రెండు త్రైమాసికాల ఎగుమతుల్లో 65 శాతం వృద్ధిని నమోదు చేసిన హెచ్ఐఎల్ (ఇండియా) లిమిటెడ్
Posted On:
30 OCT 2020 11:27AM by PIB Hyderabad
కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని రసాయనాలు,పెట్రో కెమికల్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌ఐఎల్ (ఇండియా) లిమిటెడ్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) మొదటి రెండు త్రైమాసికాల ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలోని ఎగుమతుల్లో 65% వృద్ధిని నమోదు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో పెద్ద మొత్తంలో డిక్లోరో డిఫినాయెల్ ట్రైక్లోరోఎథేన్ (డీడీటీ) మరియు ఆగ్రోకెమికల్స్‌ను దక్షిణాఫ్రికా దేశాలు, లాటిన్ అమెరికా, ఇరాన్‌లకు ఎగుమతి చేయబడినందున కంపెనీ ఈ గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ సందర్భంగా హెచ్ఐఎల్ (ఇండియా) లిమిటెడ్ సంస్థ బృందం చేపట్టిన యత్నాల్ని కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి వి సదానంద గౌడ ప్రశంసించారు.
“హిందూస్థాన్ ఇన్‌సెక్టిసైడ్‌స్ లిమిటెడ్ (హెచ్ఐఎల్) యాజమాన్యం మరియు వారి బృందానికి అభినందనలు. గత సంవత్సరంతో పోలిస్తే 2020-2021 ఆర్థిక సంవత్సరంలో రెండు త్రైమాసికాలలో కంపెనీ బృందం 65 శాతం మేర అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది హెచ్ఐఎల్‌కు మరింత విజయవంతమైన మరియు గొప్ప సంవత్సరంగా నిలవాలని అభిలషిస్తున్నాను."
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాల్లో హెచ్‌ఐఎల్ 530.10 మెట్రిక్ టన్నుల మలాథియాన్ టెక్నికల్ ఉత్పత్తిని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో (సీపీఎల్‌వై) దీని ఉత్పత్తి 375.5 మెట్రిక్ టన్నులుగా నిలిచింది. సంస్థ ఈ ఏడాది మొదటి రెండు త్రైమాసికాలలో అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది. వ్యవసాయ మంత్రిత్వశాఖ చేపట్టిన మిడతల నియంత్రణ కార్యక్రమం మరియు దేశవ్యాప్తంగా ఉన్న పురపాలక కార్పోరేషన్ వంటి వివిధ రకాల సంస్థలు చేపట్టిన వెక్టర్ కంట్రోల్ ప్రోగ్రాం కోసం భారీ మొత్తం పరిమాణంలో సరఫరా చేయడం అయింది.
***
(Release ID: 1668855)
Visitor Counter : 224