ప్రధాన మంత్రి కార్యాలయం

ఫ్రాన్సు లోని నైస్ లో చర్చి లోపల జరిగిన ఉగ్రవాద దాడులను తీవ్రంగా ఖండించిన - ప్రధానమంత్రి

Posted On: 29 OCT 2020 7:55PM by PIB Hyderabad

ఫ్రాన్సు లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడులతో సహా, నైస్ లోపల చర్చిలో ఈరోజు జరిగిన ఘోరమైన దాడిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, తీవ్రంగా ఖండించారు.

ప్రధానమంత్రి ఈ విషయమై ఒక ట్వీట్‌ చేస్తూ,  "ఫ్రాన్సు లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడులతో సహా, నైస్ లోని చర్చి లోపల ఈరోజు జరిగిన ఘోరమైన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.  బాధితుల కుటుంబాలకు మరియు ఫ్రాన్సు ప్రజలకు మా ప్రగాఢ, హృదయ పూర్వక సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఫ్రాన్సు చేసే పోరాటానికి భారతదేశం బాసటగా నిలుస్తుంది." అని పేర్కొన్నారు. 

*****


(Release ID: 1668718)