ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటీజనపనార సంచులలో తప్పనిసరి ప్యాకింగ్‌కు సంబంధించిన నిబంధనల పొడిగింపునకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్.
प्रविष्टि तिथि:
29 OCT 2020 3:46PM by PIB Hyderabad
నూరుశాతం ఆహార ధాన్యాలు, 20 శాతం చక్కెరను వివిధ రకాల జనపనార సంచులలో తప్పనిసరిగా ప్యాక్ చేయాలన్న నిబంధనలను ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన కేంద్ర ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించింది.చక్కెరను వైవిధ్యంతో కూడిన జనపనార సంచులలో ప్యాక్ చేయాలంటూ తీసుకున్న నిర్ణయంతో జనపనార పరిశ్రమ ముందు ముందు రకరకాల ఉత్పత్తులతో ముందుకు రావడానికి వీలు కలుగుతుంది. ఈ నిర్ణయం ప్రకారం ప్రస్తుతం ఆహార ధాన్యాల ప్యాకేజింగ్‌కు సంబంధించిన జనపనార బ్యాగ్‌లలో 10 శాతం బ్యాగ్‌లను రివర్స్ ఆక్షన్ కింద జిఇఎం పోర్టల్‌లో ఉంచాల్సి ఉంటుంది. ఇది క్రమంగా ధరలను తెలుసుకోవడానికి ఉపకరిస్తుంది. జూట్ పాకేజింగ్ మెటీరియల్ ( జెపిఎం) చట్టం 1987 కింద తప్పని సరి ప్యాకేజింగ్ నిబంధనల పరిధిని ప్రభుత్వం మరింత విస్తరించింది. జనపనార ప్యాకేజింగ్ మెటీరియల్ సరఫరా విషయంలో ఏదైనా కొరత లేదా, సరఫరాలో అంతరాయం ఏర్పడినా లేదా ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినా టెక్స్‌టైల్ మంత్రిత్వశాఖ, సంబంధిత ఇతర మంత్రిత్వశాఖల సమన్వయంతో ఈ నిబంధనలను సడలించేందుకు వీలుంది. అంతే కాకుండా ఆహారధాన్యాల ఉత్పత్తికి సంబంధించి నిర్దేశిత ప్రొవిజన్లకు మించి గరిష్ఠంగా 30 శాతం వరకు సడలింపులు చేయడానికి వీలుంటుంది.
జనపనార రంగంపై 3.7 లక్షల మంది కార్మికులు, మరి కొన్ని లక్షల రైతు కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఈ అంశాలను దృష్టిలొ ఉంచుకుని ప్రభుత్వం జనపనార రంగాన్ని అభివృద్ధి చేసేందుకు గట్టి కృషి చేస్తున్నది. ముడి జనుము నాణ్యత, ఉత్పాదకతను పెంపొందించడం,జనపనార రంగంలో వైవిధ్యతకు కృషి ఏయడం, అలాగే జనపనార ఉత్పత్తులకు డిమాండ్ ను పెంచడం వంటి చర్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ప్రయోజనాలు :
కేంద్ర కేబినెట్ ఆమోదించిన తాజానిబంధనలవల్ల దేశతూర్పు, ఈవాన్యప్రాంతంలోని రైతులు, కార్మికులు, ప్రత్యేకించి పశ్చిమబెంగాల్, బీహార్, ఒడిషా, అస్సాం,ఆంధ్రప్రదేశ్, మేఘాలయ,త్రిపుర రాష్ట్రాల వారికి ప్రయోజనం చేకూరుతుంది.
జూట్ ప్యాకేజింగ్ మెటీరియల్( సరకుల ప్యాకింగ్‌కు తప్పనిసరి ) చట్టం 1987 ( దీనినే జెపిఎం చట్టం అంటారు)ఈ చట్టం కింద, ముడి జనపనార ఉత్పత్తి, జనపనార రైతుల ప్రయోజనం కోసం కొన్ని రకాల ఉత్పత్తుల తప్పనిసరి ప్యాకేజింగ్‌కు జనపనార ప్యాకేజింగ్ అంశాన్ని పరిశీలించవలసి ఉంటుంది.
అందువల్ల ప్రస్తుత ప్రతిపాదనలోని రిజర్వేషన్ నిబంధనలు దేశీయ జనపనార ఉత్పత్తి ప్రయోజనాలు, దేశంలో ప్యాకేజింగ్ మెటీరియల్ ప్రయోజనాలు తీర్చనుంది. తద్వారా ఇండియా ఆత్మనిర్భర్ భారత్‌తో సమానంగా స్వావలంబన సాధించేలా చేయనుంది.
జనపనార పరిశ్రమ ప్రధానంగా ప్రభుత్వ రంగం జనపనార బ్యాగ్‌ల కొనుగోలుపై ఆధారపడి ఉంటుంది. దీనివిలువ సుమారు 7500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ. ప్రతిసంవత్సరం ఆహార ధాన్యాల ప్యాకేజింగ్‌కు ఈ బ్యాగ్‌లు అవసరం అవుతాయి. జనపనార రంగం కీలక డిమాండ్‌ను నిలబెట్టడానికి,ఈ రంగంపై ఆధారపడిన కార్మికులు,రైతుల జీవనోపాథికి మద్దతు నివ్వడానికి ఇది ఉపకరిస్తుంది.
జనపనార రంగానికి ఇతర మద్దతు:
ముడి జనపనార ఉత్పాదకత, నాణ్యత పెంచడానికి జాగ్రత్తగా రూపొందించిన చర్యలను ప్రభుత్వం చేపట్టడం జరిగింది. జూట్ ఐ కేర్, వంటి చర్యల ద్వారా రెండు లక్షల జనపనార రైతులకు మద్దతు నివ్వడం జరుగుతోంది. అధునాతన వ్యవసాయపద్ధతులు, సీడ్‌డ్రిల్లింగ్ పద్ధతి ద్వారానాట్లు, మెరుగైన కలుపు నివారణ పద్ధతులు, నాణ్యమైన విత్తనాల సరఫరా వంటి చర్యలు చేపట్టడం జరుగుతోంది.
ఈ చర్యలు ముడి జనుము నాణ్యత , ఉత్పాదకతను పెంచడమే కాక, ముడి జనుము రైతులకు హెక్టారుకు10 వేల రూపాయల రాబడి పెరగడానికి దోహదపడ్డాయి.
ఇటీవల, జూట్‌కార్పోరేషన్ ఆఫ్ ఇండియా 10వేల క్వింటాళ్ల సర్టిఫైడ్ విత్తనాలను వాణిజ్య పద్ధతిన పంపిణీ చేయడానికి నేషనల్ సీడ్స్ కార్పొరేషన్‌తో ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తేవడం, ధృవీకృత విత్తనాల పంపిణీ వంటివి ఉత్పాదకత, నాణ్యతను పెంచడంతోపాటు, రైతుల రాబడిని పెంచాయి.
జనపనార రంగం వైవిధ్యతకు మద్దతునిస్తూ, జాతీయ జనపనార బోర్డు , నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, గాంధీనగర్‌లో ఒక జనపనార డిజైన్ సెల్‌ను ఏర్పాటు చేసింది. జూట్ జియో టెక్స్‌టైల్,ఆగ్రో టెక్స్‌ల్స్‌ను ప్రోత్సహించడానికి రాష్ట్రప్రభుత్వాలతో కలిసి చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రత్యేకించి ఈశాన్యప్రాంత రాష్ట్రాలు,అలాగే రోడ్డు రవాణా, జలవనరుల మంత్రిత్వశాఖలతో కలిసి కృషి చేయడం జరిగింది. జనపనార రంగానికి డిమాండ్‌ను పెంపొందించడంకోసం 2017 జనవరి 5 నుంచి బంగ్లాదేశ్,నేపాల్‌లనుంచి ప్రభుత్వం డిఫినిటివ్ యాంటీ డంపింగ్ డ్యూటీ ని విధించింది.
జనపనార రంగంలో పారదర్శకతను పెంపొందించడం కోసం , జూట్ స్మార్ట్ ఈ గవర్నమెంట్ చొరవను ప్రభుత్వం 2016 డిసెంబర్‌లో ప్రారంభించింది. దీనికితోడు జెసిఐ 100 శాతం నిధులను కనీస మద్దతు ధర , వాణిజ్య కార్యకలాపాలకు జనపనార రైతులకు ఆన్‌లైన్ ద్వారా బదలాయిస్తోంది.
***
(रिलीज़ आईडी: 1668703)
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam