మంత్రిమండలి
ఆరోగ్యం, వైద్య శాస్త్రం రంగం లో భారతదేశానికి, కంబోడియా కు మధ్య అవగాహనపూర్వక ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
29 OCT 2020 3:40PM by PIB Hyderabad
ఆరోగ్యం, వైద్య శాస్త్రం రంగం లో భారతదేశానికి, కంబోడియా కు మధ్య అవగాహనపూర్వక ఒప్పందం (ఎంఒయు) పై సంతకాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఆరోగ్య రంగం లో సంయుక్త కార్యక్రమాలు, సాంకేతిక అభివృద్ధి మాధ్యమాల ద్వారా రెండు దేశాల మధ్య సహకారాన్ని ఈ ద్వైపాక్షిక ఎంఒయు ప్రోత్సహిస్తుంది. భారతదేశాని కి, కంబోడియా కు మధ్య ద్వైపాక్షిక సంబంధాల ను ఇది పటిష్టం చేయనుంది. ఈ ఎంఒయు పై సంతకాలైన తేదీ నాటి నుంచి అమలులోకి వచ్చి, అయిదు సంవత్సరాల కాలానికి అమలవుతుంది.
రెండు ప్రభుత్వాల మధ్య సహకారం చోటు చేసుకొనే ప్రధాన రంగాల లో..
• తల్లి, బిడ్డ ల ఆరోగ్యం;
• కుటుంబ సంక్షేమం;
• హెచ్ఐవి/ఎఐడిఎస్, క్షయ వ్యాధి;
• మందులు, ఔషధ నిర్మాణ సంబంధ కృషి;
• సాంకేతిక విజ్ఞానం బదలాయింపు;
• సార్వజనిక ఆరోగ్యం, అంటువ్యాధులు;
• వ్యాధి నియంత్రణ (సాంక్రామిక వ్యాధులు, అసాంక్రామిక వ్యాధులతో సహా);
• భారత ప్రభుత్వం లోని సంబంధిత మంత్రిత్వ శాఖ/ విభాగం, కంబోడియా లో నేశనల్ ఎథిక్ కమిటీ ఆమోదాలకు లోబడి వైద్య సంబంధి పరిశోధన- అభివృద్ధి;
• వైద్య విద్య;
• సార్వజనిక ఆరోగ్య రంగంలో స్వస్థత కు సంబంధించిన మానవ వనరుల వికాసం;
• క్లినికల్, పారా- క్లినికల్, మేనేజ్‌మెంట్ సంబంధి నైపుణ్యాల లో శిక్షణ;
• ఉభయ పక్షాలు నిర్ణయించిన ప్రకారం మరేదైనా రంగంలో సహకారం.. వంటివి భాగంగా ఉన్నాయి.
***
(Release ID: 1668443)
Visitor Counter : 209
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam