మంత్రిమండలి
సమాచారం, కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగం లో భారతదేశానికి, జపాన్ కు మధ్య సహకార పూర్వక ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
29 OCT 2020 3:41PM by PIB Hyderabad
సమాచారం, కమ్యూనికేషన్ టెక్నాలజీలు (ఐసిటి స్) రంగం లో భారతదేశాని కి, జపాన్ కు మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన మెమొరాండమ్ ఆఫ్ కోఆపరేషన్ (ఎమ్ఒసి)పై సంతకాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
ఈ ఎమ్ఒసి కమ్యూనికేషన్స్ రంగం లో ద్వైపాక్షిక సహకారాన్ని, పరస్పర అవగాహన ను పటిష్ట పరచడం లో దోహదపడనుంది. అంతేకాకుండా, జపాన్ ప్రస్తుతం ‘‘ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్య’’ స్థాయిని కలిగిన ఒక ముఖ్య భాగస్వామిగా ఉన్నందువల్ల భారతదేశం పక్షాన ఇది ఒక వ్యూహాత్మక కార్యక్రమం గా తోడ్పడనుంది.
ఈ ఎమ్ఒసి రెండు దేశాల మధ్య 5జి నెట్ వర్క్, టెలికామ్ సెక్యూరిటీ, సబ్‌మరేన్ కేబుల్, కమ్యూనికేషన్ సామగ్రి కి ప్రామాణిక ధ్రువ పత్రం మంజూరు, అత్యాధునిక వైర్ లెస్ సాంకేతికల వినియోగం, ఐసిటి స్, ఐసిటి ల సామర్ధ్యం పెంపుదల, సార్వజనిక పరిరక్షణ మరియు విపత్తుల వేళ సహాయం, కృత్రిమ మేధస్సు (ఎఐ)/ బ్లాక్ చైన్, స్పెక్ట్రమ్ చైన్, స్పెక్ట్రమ్ నిర్వహణ, బహుళ పక్షీయ వేదికల లో సహకారం మొదలైన వివిధ రంగాల లో సహకరించుకొనేందుకు ఉపయోగపడనుంది.
అంతేకాకుండా, భారతదేశం ప్రపంచ ప్రమాణీకరణ ప్రక్రియలోకి అడుగుపెట్టేందుకు అవకాశాలను కూడా ఈ ఎమ్ఒసి పెంచనుంది. ఐసిటి స్ సాంకేతికల లో సహకారం దేశం లో తత్సంబంధిత మౌలిక సదుపాయాల కల్పన ను బలపరచడం లో సహయకారి కానుంది. భవిష్యత్తు కాలానికి ఉపయోగపడే సబ్ మరేన్ కేబుల్ నెట్ వర్క్ లను మరియు సాంకేతికతల ను అభివృద్ధి పరచడం లో సహకారం అనేది మారుమూల ప్రాంతాల తో భారతదేశ ప్రధాన భూభాగానికి సంధానం సదుపాయాన్ని పెంపొందించడం లో చేదోడుగా ఉంటుంది. ఈ ఎమ్ఒసి ఐసిటి స్ రంగంలో మానవ సామర్ధ్యాన్ని పెంపొందించడంలో సాయపడనుంది. అంతేకాకుండా, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాల ను సాధించడం లో అండగా నిలచే స్టార్ట్ అప్ ఇకో సిస్టమ్ ను మరింతగా అభివృద్ధి చేసేందుకు కూడా ఇది దోహదపడుతుంది.
***
(Release ID: 1668439)
Visitor Counter : 237
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam