ప్రధాన మంత్రి కార్యాలయం

గుజ‌రాత్ పూర్వ ముఖ్య‌మంత్రి శ్రీ‌ కేశూభాయి ప‌టేల్ క‌న్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 29 OCT 2020 2:26PM by PIB Hyderabad

గుజ‌రాత్ పూర్వ ముఖ్య‌మంత్రి శ్రీ‌ కేశూభాయి ప‌టేల్ మృతి కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

‘‘మ‌న ప్రియ‌త‌ములు, గౌర‌వ‌నీయులైన కేశూభాయి గారు క‌న్నుమూశారు.  దీనికి నేనెంతో వేద‌న‌కు లోన‌య్యాను, దుఃఖిస్తున్నాను కూడా.  ఆయ‌న ఒక అసాధార‌ణ నేత‌; స‌మాజం లో ప్ర‌తి ఒక్క వ‌ర్గం వారి ప‌ట్ల ఆయన శ్ర‌ద్ధ‌ ను చూపించారు.  ఆయ‌న జీవితం గుజ‌రాత్ ప్రగ‌తి కోసం, గుజ‌రాత్ లోని ప్ర‌తి ఒక్క‌రికి సాధికారిత క‌ల్ప‌న‌ కోసం అంకిత‌మైంది.  

జ‌న‌ సంఘ్ ను, బిజెపి ని బ‌లోపేతం చేయ‌డం కోసం కేశూభాయి గారు గుజ‌రాత్ అంత‌టా విస్తృతంగా ప్ర‌యాణించారు.  అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని ఆయ‌న తీవ్రంగా ప్ర‌తిఘ‌టించారు.  రైతుల సంక్షేమానికి సంబంధించిన అంశాలు ఆయ‌న కు ఎంతో ప్రీతిపాత్రమైనవిగా ఉండేవి.  ఎమ్ఎల్ఎ గా గాని, పార్ల‌మెంటు స‌భ్యుని గా గాని, మంత్రి గా గాని, లేదా ముఖ్య‌మంత్రి ప‌ద‌వి లో ఉన్న‌ా గాని రైతు కు మేలు చేసే అనేక చ‌ర్య‌ల‌కు ఆమోదముద్ర ల‌భించేట‌ట్లు ఆయ‌న శ్ర‌ద్ధ తీసుకున్నారు.

కేశూభాయి గారు నాతో స‌హా ఎంతో మంది యువ కార్య‌క‌ర్త‌ల‌కు ఆచార్య‌త్వాన్ని వ‌హించి, వారిని తీర్చిదిద్దారు.  ఆయ‌న స్నేహ‌శీల‌త్వాన్ని ప్ర‌తి ఒక్క‌రు అభిమానించారు.  ఆయ‌న లేని లోటు తీరేది కాదు.  ఈ రోజున మ‌న‌మంతా విచారిస్తున్నాం.  ఆయ‌న కుటుంబానికి, ఆయ‌న శ్రేయోభిలాషుల‌కు క‌లిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను.  ఆయ‌న కుమారుడు భ‌ర‌త్ తో మాట్లాడి, నా సంతాపాన్ని తెలియ‌జేశాను.  ఓమ్ శాంతి’’ అంటూ ప్ర‌ధాన మంత్రి త‌న మ‌నోభావాల‌ను ట్విట‌ర్ లో ఒకదాని తరువాత ఒకటిగా వ్యక్తం చేశారు.
 

***


(Release ID: 1668423) Visitor Counter : 190