వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

పేటెంట్ల (సవరణ ) 2020 నియమాలు , ఫారం 27 దాఖలు చేయడానికి సంబంధించిన

అంశాలను క్రమబద్దీకరించడం మరియు తనిఖీ చేసిన ఆంగ్ల అనువాదాన్ని ప్రాధాన్యత కలిగిన పత్రాలతో సమర్పించడం:

త్వరితగతిన దరఖాస్తు చేయడానికి, నూతన ఆవిష్కరణలకు దోహదపడే విధంగా ఒకటి లేదా అంతకుమించి పేటెంట్ల కోసం దరఖాస్తు చేసే వారు ఒకే ఫారం -27సమర్పించడానికి వెసులుబాటు:

పేటెంట్ల కోసం ఆవిష్కర్త తరఫున అధీకృత ఏజెంట్లు ఫారం 27ను దాఖలు చేయడానికి అనుమతి:
ఆవిష్కర్తలకు వ్యాపారం మరింత సులభతరం:

ఫారం -27 సమర్పించడానికి మూడు నెలలు కాకుండా ఆరు నెలల గడువు:

ఆంగ్ల అనువాదం WIPO డిజిటల్ లైబ్రరీ ఉంటే దానిని భారత పేటెంట్ కార్యాలయంలో పేటెంట్ కోసం దరఖాస్తు చేసేవారు సమర్పించనవసరం ఉండదు

Posted On: 28 OCT 2020 1:41PM by PIB Hyderabad

భారత దేశంలో వాణిజ్య అవసరాల కోసం పేటెంట్ పొందడానికి అనుసరించవలసిన విధానంపై షమ్నద్ బషీర్, భారత ప్రభుత్వాల కేసులో ( WPC - 5590 ఆఫ్ 2015) ఢిల్లీ హై కోర్ట్ 2018 ఏప్రిల్ 23న జారీ చేసిన ఉత్తర్వులపై సంబంధిత వర్గాలతో ఈ ప్రక్రియను సులభతరం చేసే అంశంపై చర్చలు జరిగాయి.

2020 అక్టోబర్ 19వ తేదీ నుంచి అమలు లోకి వచ్చిన పేటెంట్స్( సవరణ ) నిబంధనలు ఫారం -27 సమర్పణ మరియు పేటెంట్ కోరిన అంశం ఆంగ్లంలో లేని పక్షంలో ఆంగ్ల అనువాదాన్ని సమర్పించే అంశాలను మరింత సులభతరం చేశాయి.

ఫారం -27 మరియు 131 (2) నియమంలో చేసిన ముఖ్యమైన మార్పులు ఈ కింది విధంగా ఉన్నాయి

1. ఒకటి లేదా అంతకు మించి పేటెంట్ లకు సంబంధించి కోసం ఒకేఒక్క ఫారం -27ను అందజేయడానికి వెసలుబాటు కలుగుతుంది.

2. ఇద్దరు లేదాఅంతకు మించినవారికి పేటెంట్ జారీ అయినప్పుడు వారందరూ కలసి సంయుక్తంగా ఫారం -27ను అందచేయవచ్చును.

3. పేటెంట్ పొందినవారు దాని ద్వారా వచ్చే ఆదాయం / విలువను తెలియజేయవలసి ఉంటుంది.

4. పేటెంట్ పొందినవారి తరఫున వారి అనుమతి పొందిన అధీకృత ఏజెంట్లు ఫారం -27ను సమర్పించవచ్చును.

5. ఆర్థిక సంవత్సరం ముగిసిన మూడు నెలల లోగా ప్రస్తుతం ఫారం-27ను అందించవలసి ఉంది. కొత్త నిబంధనల వల్ల ఇకపై ఈ గడువు ఆరు నెలలుగా ఉంటుంది.

6. ఆర్థిక సంవత్సరంలో కొంత భాగం లేదా కాలానికి సంబంధించి పేటెంట్ పొందినవారు ఫారం-27ను సమర్పించవలసిన అవసరం ఉండదు.

7. ఫారం -27 దాఖలు చేసే అంశంలో నిబంధనలను సులభతరం చేసినప్పటికీ అవసరం అయినప్పుడు పేటెంట్ పొందినవారి నుంచి పేటెంట్ల చట్టం 1970లోని సెక్షన్ 146(1) కింద పూర్తి వివరాలను పొందే అధికారాన్ని కంట్రోలర్ కలిగి ఉంటారని గుర్తించవలసి ఉంటుంది.

 

నియమము 27లో వచ్చిన ముఖ్యమైన మార్పులు ఈ కింది విధంగా ఉన్నాయి :

1. ప్రాధాన్యత కలిగిన పత్రం WIPO డిజిటల్ లైబ్రరీ లో అందుబాటులో ఉంటే దానిని తిరిగి పేటెంట్ కోసం దరఖాస్తు చేసేవారు భారత పేటెంట్ కార్యాలయంలో తిరిగి అందజేయనవసరం ఉండదు.

2.ఆవిష్కరణకు పేటెంట్ ను జారీ చేయడానికి అవసరమైన ప్రమాణాలు ఉన్నాయా లేదా అన్న అంశాన్ని నిర్ణయించడానికి పేటెంట్ కోసం దరఖాస్తు చేసిన వ్యక్తి ద్రువీకరించబడిన ఆంగ్ల అనువాదాన్ని సమర్పించవలసి ఉంటుంది.

నూతన నియమనిబంధనల వల్ల పేటెంట్ కలిగిన ఆవిష్కరణను భారతదేశంలో వాణిజ్యపరంగా వినియోగించడానికి కావలసిన ( ఫారం -27) అనుమతులను సులభంగా పొందడానికి మరియు ఆంగ్ల అనువాదాన్ని సమర్పించే ప్రక్రియను క్రమబద్దీకరిస్తాయి.

***

 



(Release ID: 1668220) Visitor Counter : 198