పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
పరిశోధన, తనిఖీల కోసం డ్రోన్ల ఉపయోగించడానికి ఎన్ టి పి సి కి అనుమతి మినహాయింపులు మంజూరు చేసిన పౌర విమానయాన శాఖ, డి జి సి ఎ
Posted On:
23 OCT 2020 12:53PM by PIB Hyderabad
మూడు థర్మల్ విద్యుత్ కేంద్రాలలో పరిశోధన మరియు తనిఖీ కార్యక్రమాలను నిర్వహించడానికి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ( ఎన్ టి పి సి ) ఇకపై రిమోట్ సాయంతో పనిచేసే విమాన వ్యవస్థ ( ఆర్ పి ఎ ఎస్ )ను ఉపయోగించనున్నది . దీనికి అవసరమైన అనుమతులను కొన్ని షరతులతొ పౌర విమానయాన శాఖ మరియు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ మినహాయింపులను మంజూరు చేశాయి. మధ్యప్రదేశ్ లోని వింధ్యాచల్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్,గదర్వార సూపర్ థర్మల్ పవర్ స్టేషన్, ఛత్తీస్ ఘర్లో ఉన్న సిపాట్ సూపర్ థర్మల్ స్టేషన్ లలో డ్రోన్ లను వినియోగించడానికి ఎన్ టి పి సి అనుమతులను పొందింది. " భౌగోళిక చిత్రాలు, సరకు నిల్వ ప్రాంతాలు, ఏరియల్ తనిఖీలు మరియు ఇతర అంశాల కోసం ఎన్ టి పి సి ఈ మూడు కేంద్రాలలో డ్రోన్లను ఉపయోగిస్తుంది. దీనివల్ల తక్కువ ఖర్చుతో ఖచ్చితమైన సమాచారాన్ని పొందడానికి అవకాశం కలుగుతుంది. గనుల తవ్వకం ,వ్యవసాయం , ప్రకృతి వైపరీత్యాలు లాంటి కార్యక్రమాల్లో డ్రోన్ల వినియోగాన్ని ఎక్కువ చేయడానికి కేంద్ర ప్రభ్యత్వం తీసుకొంటున్న చర్యల్లో భాగంగా ఈ అనుమతులను మంజూరు చేసాం " అని పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ. అంబర్ దుబె తెలిపారు. డిజిటల్ స్కై ప్లాటుఫారమ్ అందుబాటులోకి వచ్చేంతవరకు లేదా 2020 డిసెంబర్ 31వ తేదీ వరకు ( ఏది ముందు అయితే అది) మధ్యప్రదేశ్ లోని వింధ్యాచల్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్,గదర్వార సూపర్ థర్మల్ పవర్ స్టేషన్, ఛత్తీస్ ఘర్లో ఉన్న సిపాట్ సూపర్ థర్మల్ స్టేషన్ లలో డ్రోన్ లను వినియోగించడానికి షరతులతో కూడిన మినహాయింపులు అమలులో ఉంటాయి
1. విమానాల నిర్వహణకు సంబంధించి 1937లో పౌర విమానయాన జారీ చేసిన నిబంధనలలోని నిబంధన 15A లోనే CAR సెక్షన్ 3, సిరీస్ X I భాగం కింది ఎన్ టి పి సికి ఈ మినహాయింపు ఇవ్వడం జరిగింది.
- రిమోట్ సాయంతో పనిచేసే విమాన వ్యవస్థ ( ఆర్ పి ఎ ఎస్ )ను ఉపయోగించడానికి ఎన్ టి పి సి ముందుగా (ఎ ) స్థానిక యంత్రాంగం (బి ) రక్షణ శాఖ (సి ) హోం శాఖ (డి ) భారత వాయుసేన (ఈ ) ఎయిర్ పోర్ట్ అథారిటీ అఫ్ ఇండియాల నుంచి అనుమతులను పొందవలసి ఉంటుంది .
3. NETRAPRO కోసం Idea Forge Technology Pvt Ltd జారీ చేసిన D1DX00S1T మరియు D1DX00S24 అక్నౌలెడ్జిమెంట్ నెంబర్ (DAN ) కలిగి ఉన్న ఆర్ పి ఎ ఎస్ ను మాత్రమే ముందుగా కేంద్ర ప్రభుత్వానికి తెలిపి ఎన్ టి పి సి ఉపయోగించవలసి ఉంటుంది .
4. చేపట్టనున్న కార్యక్రమాలపై ఎన్ టి పి సి ముందుగా సమగ్ర సమాచారాన్ని, SOP నకలును ఫ్లైట్ స్టాండర్డ్స్ డైరెక్టరేట్ ,DGCA లకు అందజేసి వారి నుంచి అనుమతులు పొందిన తరువాత మాత్రమే రిమోట్ సాయంతో పనిచేసే విమాన వ్యవస్థ ( ఆర్ పి ఎ ఎస్ )ను ఉపయోగించవలసి ఉంటుంది ,
5. ఏరియల్ ఫోటోగ్రఫీ కి సంబంధించి ఎన్ టి పి సి ముందుగానే ,DGCA డైరెక్టరేట్ అఫ్ రెగ్యులేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అనుమతులను పొందవలసి ఉంటుంది.
6. ఆర్ పి ఎ ఎస్ ద్వారా తీసే ఫోటోలను, వీడియోలను ఎన్ టి పి సి మాత్రమే ఉపయోగించవలసి ఉంటుంది ఆర్ పి ఎ ఎస్ రక్షణ మరియు సేకరించే సమాచారానికి ఎన్ టి పి సి పూర్తి భాద్యత వహించవలసి ఉంటుంది.
7. వెలుతురు సనిపించే వరకు మాత్రమే ( సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం ) ఆర్ పి ఎ ఎస్ ని ఉపయోగించవలసి ఉంటుంది.
8. ఈ కార్యక్రమాల వల్ల DGCAకి ఎటువంటి న్యాయపరమైన ఇతర సమస్యలు లేకుండా ఎన్ టి పి సి చర్యలు తీసుకోవలసి ఉంటుంది .
9. ఆర్ పి ఎ ఎస్ సక్రమంగా పనిచేసేలా చూడడానికి, పరికరంలో లోపాలు తలెత్తకుండా చూడడానికి ఎన్ టి పి సి తగిన చర్యలను తీసుకోవలసి ఉంటుంది.
10. పరికరాన్ని తాకడం వల్ల కలిగే గాయాలు తద్వారా వచ్చే వైద్య న్యాయపర అంశాలకు ఎన్ టి పి సి భాద్యత వహించవలసి ఉంటుంది.
11. ఆర్ పి ఎ ఎస్ వ్యవస్థను ఉపయోగిస్తున్నప్పుడు ప్రమాదం జరిగితే దానివల్ల జరిగే నష్టం భర్తీకి ఎన్ టి పి సి భీమా చేయించాలి.
12. ఎటువంటి పరిస్థితులలోను ఆర్ పి ఎ ఎస్ లో ప్రమాదకరమైన లేదా ఇతర వస్తువులు లేకుండా ఎన్ టి పి సి జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.
13. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు, నిర్వాహకులకు ఎన్ టి పి సి తగిన భద్రత కల్పించవలసి ఉంటుంది. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు DGCA భాద్యత వహించకుండా ఎన్ టి పి సి చర్యలను తీసుకోవలసి ఉంటుంది.
14. సంబంధిత మంత్రిత్వ శాఖల అనుమతులు లేకుండా CAR సెక్షన్ 3, సిరీస్ X మొదటి భాగం ప్రకారం విమానాలను నిషేదించిన నో ఫ్లై జోన్లో ఆర్ పి ఎ ఎస్ ను ఎన్ టి పి సిఉపయోగించరాదు .
15. CAR నిబంధనల ప్రకారం విమానాశ్రయాల పరిధిలో ఆర్ పి ఎ ఎస్ లను ఉపయోగించరాదు. ఆర్ పి ఎ ఎస్ లను విమానాశ్రయాల సమీపంలో ఉపయోగించినప్పుడు ప్రాంతం, సమయాలపై ముందుగానే ఎయిర్ పోర్ట్ అథారిటీ అఫ్ ఇండియా నుంచి అనుమతులను పొందవలసి ఉంటుంది .
16. శిక్షణ పొందిన అధీకృత వ్యక్తులు మాత్రమే ఆర్ పి ఎ ఎస్ నిర్వహించేలా ఎన్ టి పి సి చర్యలు తీసుకోవలసి ఉంటుంది .
- ఆర్ పి ఎ ఎస్ ల వినియోగంపై గతంలో ISOP లేదా ఇతర ప్రభుత్వ సంస్థలు విధించిన నిబంధనలు ప్రస్తుత అనుమతులతో రద్దు అవుతాయి.
18. నిర్వహణా సమయంలో చోటు చేసుకొనే ప్రమాదాలు / సంఘటనలపై నివేదికలను DGCAకు చెందిన ఎయిర్ సేఫ్టీ అథారిటీ కి సమర్పించవలసి ఉంటుంది.
పబ్లిక్ నోటీసుకు లింక్
***
(Release ID: 1667077)
Visitor Counter : 214
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam