మంత్రిమండలి

2020-21లో జమ్ముకాశ్మీర్ లో ఆపిల్ సేకరణకు కేంద్రం అనుమతి కేంద్ర మంత్రివర్గం ఆమోదం

Posted On: 21 OCT 2020 3:26PM by PIB Hyderabad

జమ్ముకాశ్మీర్లో ప్రస్తుత సంవత్సరం అంటే 2020-21లోకూడా రైతులకు కనీస ధరను చెల్లించి వారి నుంచి ఆపిల్ కాయలను సేకరించడానికి మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకాన్ని(ఎం ఐ ఎస్ ) అమలు చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయాన్ని తీసుకొంది. గత సీజన్లో అంటే 2019-20లో అమలు చేసిన నియమనిబంధనలను ఈ ఏడాది కూడా వర్తింపచేసి పథకాన్ని అమలు చేయాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. పంట సేకరణ కార్యక్రమాన్నిరాష్ట్ర ప్రణాళిక మరియు మార్కెటింగ్ డైరెక్టరేట్, రాష్ట్ర ఉద్యానవన శాఖ మరియు జమ్ముకాశ్మీర్ ఉద్యానవన ప్రాసెసింగ్ అండ్ మార్కెటింగ్ కార్పొరేషన్ ( JKHPMC ) ల ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ సమాఖ్య (నాఫెడ్ ) అమలు చేసి రైతుల నుంచి ఆపిల్ పంటను కొనుగోలు చేస్తుంది. ఆపిల్ రైతుల ఖాతాలలోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ) ద్వారా చెల్లింపులు జరుగుతాయి. ఈ పధకం కింది 12 లక్షల మిలియన్ టన్నుల పంటను సేకరించడానికి అవకాశం ఉంది .

కార్యక్రమాన్ని అమలుకు 2,500 కోట్ల రూపాయల ప్రభుత్వ హామీని ఉపయోగించడానికి నాఫెడ్ కు అనుమతి ఇస్తారు. ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం వల్ల ఒకవేళ నష్టం వాటిల్లితే దానిని కేంద్ర ప్రభుత్వం మరియు జమ్ముకాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం చెరి సగం భరిస్తాయి.

వివిధ రకాల ఆపిల్ కాయలకు ధరలను నిర్ణయించడానికి గత సీజన్లో ఏర్పాటైన అధికార కమిటీ ఈ సీజన్లో కూడా కొనసాగుతుంది. గుర్తించిన సంతలలో కనీస సౌకర్యాలను కల్పించే భాద్యతను కేంద్ర పాలిత జమ్ముకాశ్మీర్ యంత్రాంగం చేపడుతుంది.

కార్యక్రమం సజావుగా ఎలాంటి సమస్యలు లేకుండా అమలు చేయడానికి తీసుకోవలసిన చర్యలను కేంద్ర కేబినెట్ కార్యదర్శి , రాష్ట్రంలో ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటు అయ్యే సమన్వయ కమిటీలు పర్యవేక్షిస్తాయి.

ఆపిల్ పంటను సేకరించాలన్న కేంద్ర నిర్ణయంవల్ల తమ పంటలను విక్రయించడానికి రైతులకు సరైన వేదిక అందుబాటులోకి వస్తుంది. స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రైతులకు వారు పండించే ఆపిల్ కు గిట్టుబాటు ధర లభించడంవల్ల జమ్ముకాశ్మీర్ రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.

***

 

 

 

 

 



(Release ID: 1666530) Visitor Counter : 287