ప్రధాన మంత్రి కార్యాలయం
మైసూర్ విశ్వవిద్యాలయ శతవసంత స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ.
విద్యారంగ సంస్కరణలలో మౌలికసదుపాయాల కల్పన, నిర్మాణాత్మక సంస్కరణలపై ప్రధానంగా దృష్టిపెట్టడం జరిగింది: ప‌్రధానమంత్రి
జాతీయ విద్యా విధానం విద్యారంగ సంస్కరణలకు నూతన దిశ, నూతన బలాన్ని ఇవ్వనున్నాయి: ప‌్రధాని
దేశంలో అన్ని స్థాయిలలోని విద్యారంగంలో స్థూల నమోదు నిష్పత్తి బాలురకంటే బాలికలదే ఎక్కువగా ఉంది. : ప‌్రధానమంత్రి
నైపుణ్యాలు, నూతన నైపుణ్యాలు , నైపుణ్యాల స్థాయి పెంపుఅన్నది ప్రస్తుతావసరం: ప‌్రధానమంత్రి
Posted On:
19 OCT 2020 2:01PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మైసూరు విశ్వవిద్యాలయ శతవసంత స్నాతకోత్సవంలో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రసంగించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, ప్రాచీనభారతదేశపు అత్యుత్తమ విద్యావ్యవస్థకు కేంద్రంగా మైసూరు విశ్వవిద్యాలయం వెలుగొందిందని , ఇది భవిష్యత్ భారతావని ఆకాంక్షలు, సామర్ధ్యాలు, రాజర్షి నల్వడి కృష్ణరాజ వడయార్,ఎం. విశ్వేశ్వరయ్యగార్ల దార్శనికతను సాకారం చేసిందని ఆయన కొనియాడారు.
భారత రత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి ఉద్దండులు ఈ విశ్వవిద్యాలయంలో బోధించిన విషయాన్నిప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు.
విద్యద్వారా సముపార్జించిన విజ్ఞానాన్ని తమ నిజ జీవితంలోని వివిధ దశలలో ఉపయోగించాల్సిందిగా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. నిజజీవితమే ఒక గొప్ప విశ్వవిద్యాలయమని,విజ్ఞానాన్ని ఉపయోగించడానికి వివిధ మార్గాలను అది బోధిస్తుందని ఆయన అన్నారు.
జీవన క్లిష్టసమయాలలో విద్య వెలుగులుప్రసరింపచేస్తుందన్న ప్రఖ్యాత కన్నడ రచయిత , ఆలోచనాపరుడు గొరూరు రామస్వామి అయ్యంగార్‌జీ మాటలను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.
భారతీయ విద్యా వ్యవస్థ 21 శతాబ్దపు అవసరాలు తీర్చేదిగా ఉండేందుకు నిరంతర చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని, ఇందుకు మౌలిక సదుపాయాల కల్పన, నిర్మాణాత్మక సంస్కరణలపై ప్రధానంగా దృష్టిపెట్టినట్టు ఆయన తెలిపారు. ఇండియాను ఉన్నతవిద్యకు అంతర్జాతీయ కేంద్రంగాతీర్చిదిద్దాలని. మనయువతను ప్రపంచ స్థాయి పోటీకి నిలబెట్టేందుకు గుణాత్మకంగా, పరిమాణాత్మకంగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని అన్నారు.
స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా 2014 నాటికి దేశంలో 16 ఐఐటి లు మాత్రమే ఉన్నాయని, గత ఆరు సంవత్సరాలలో సగటున ప్రతి సంవత్సరం ఒక ఐఐటిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో ఒకటి కర్ణాటకలోని ధర్వాడ్ లో ఏర్పాటైందని చెప్పారు. 2014 నాటికి దేశంలో 9 ట్రిపుల్ ఐటిలు, 13 ఐఐఎంలు, 7 ఎయిమ్స్‌లు ఉండేవని,ఆ తర్వాత 5 సంవత్సరాలలో 16 ట్రిపుల్ ఐటిటు, 7 ఐఐఎంలు, 8 ఎయిమ్స్‌లు ఏర్పాటు చేయడం కానీ లేదా అవి ఏర్పాటు ప్రక్రియలో కానీ ఉన్నాయని అన్నారు.
గత 5-6 సంవత్సరాలలో ఉన్నత విద్యా రంగంలో కొత్తవిద్యాసంస్థలను ఏర్పాటు చేయడానికి మాత్రమే పరిమితం కాకుండా. ఈ సంస్థలలో పాలనా పరంగా సంస్కరణలు . స్త్రీ , పురుష సమానత్వం,సామాజిక సమ్మిళితత్వాన్ని తీసుకువచ్చినట్టు ఆయన తెలిపారు. ఇలాంటి సంస్థలకు మరింత స్వేచ్ఛ ఇవ్వడం జరిగిందని, దీనివల్ల ఆయా సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కలుగుతుందని ఆయన అన్నారు.
తొలి ఐఐఎం చట్టం దేశవ్యాప్తంగా గల ఐఐఎం లకు మరిన్ని హక్కులు ఇచ్చినట్టు ఆయన తెలిపారు. వైద్య విద్యలో మరింత పారదర్శకత తెచ్చేందుకు జాతీయ మెడికల్ కమిషన్ ను ఏర్పాటు చేసినట్టు ప్రధానమంత్రి తెలిపారు. హోమియోపతి ఇతర వైద్యవిధానాలలో సంస్కరణలు తెచ్చేందుకు జాతీయ మెడికల్ క మిషన్‌ను ఏర్పాటు చేసినట్టు ప్రధానమంత్రి చెప్పారు.
దేశంలో అన్ని స్థాయిలలో విద్యారంగంలో స్థూల నమోదు నిష్పత్తి బాలురకంటే బాలికలదే ఎక్కువగా ఉండడం పట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
నూతన జాతీయ విద్యావిధానం దేశ మొత్తం విద్యా రంగంలో మౌలిక మార్పులు తీసుకువచ్చి ఈ రంగానికి కొత్త ఊపు తీసుకువస్తుందని ప్రధానమంత్రి అన్నారు.
నూతన విద్యావిధానం బహుముఖీనమైన దృష్టి కలిగినదని , ఇది మనయువతను వారికి అనువైన విధంగా , వారికి ఉపయుక్తమైన రీతిలో బోధనకు వీలు కల్పించి వారిని పోటీకి నిలుపుతుందన్నారు. నైపుణ్యాలు, నూతన నైపుణ్యాలు, నైపుణ్యాల స్థాయి పెంపు ప్రస్తుతం అత్యావశ్యకమని ఆయన అన్నారు.
దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ అయిన మైసూరు విశ్వవిద్యాలయం,నూతన పరిస్థితులకు అనుగుణంగా నూతన ఆవిష్కరణలు చేపట్టాలన్నారు. ఇంక్యుబేషన్ కేంద్రాలపైన, టెక్నాలజీ అభివృద్ధి కేంద్రాలపైన, పరిశ్రమ-విద్యారంగ అనుసంధానతపైన, ఇంటర్ డిసిప్లినరీ పరిశోధన పైన దృష్టిపెట్టాల్సిందిగా ఆయన సూచించారు. స్థానిక సంస్కృతి, స్థానికకళలు, ఇతర సామాజిక అంశాలు, అలాగే దానితో ముడిపడిన అంతర్జాతీయ, సమకాలీన అంశాలపై పరిశోధనలను ప్రోత్సహించాల్సిందిగా విశ్వవిద్యాలయాన్ని ప్రధానమంత్రి కోరారు. తమ వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా రాణించడానికి విద్యార్ధులు ప్రయత్నించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
***
(Release ID: 1665891)
Visitor Counter : 147
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam