ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మరో కీలక మైలు రాయి దాటిన భారత్ ఒకటిన్నర నెల తరువాత చికిత్సలో ఉన్నవారి సంఖ్య 8 లక్షలలోపు
పాజిటివ్ కేసులలో చికిత్సలో ఉన్నది 10.70%
Posted On:
17 OCT 2020 10:23AM by PIB Hyderabad
కోవిడ్ మీద పోరులో భారత్ మరో మైలురాయి దాటింది. దాదాపు నెలన్నర తరువాత దేశంలో ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి సంఖ్య 8 లక్షల లోపుకు పడిపోయింది. చికిత్సలో ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య నేడు 7,95,087 గా నమోదైంది. ఇది ఇప్పటిదాకా నమోదైన మొత్తం పాజిటివ్ కేసులలో 10.70% మాత్రమే. ఆఖరిసారిగా సెప్టెంబర్ 1 న చికిత్సలో ఉన్నవారి సంఖ్య 8 లక్షల లోపు, అంటే, 7,85,996 గా నమోదైంది. ప్రతిరోజూ కోవిడ్ బాధితులు పెద్ద సంఖ్యలో కోలుకుంటూ ఉండటంతో దేశంలో చికిత్స పొందుతున్నవారి సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది.
భారతదేశంలో కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పెద్ద సంఖ్యలో పెరుగుతూ ఉంది. ఇప్పటివరకు దాదాపు 65 లక్షలమంది (65,24,595) పాజిటివ్ కేసులు చికిత్స తరువాత నెగటివ్ గా మారాయి. చికిత్స పొందుతున్నవారికి, కోలుకున్నవారికి మధ్య అంతరం కూడా పెరుగుతూ ఇప్పుడు 57,29,508 కి చేరింది. గడిచిన 24 గంటలలో 70,816 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అదే సమయంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు 62,212. జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 87.78% కి చేరింది.
దేశవ్యాప్తంగా పెరిగిన వైద్య సదుపాయాలు, కేంద్రం నిర్దేశించిన ప్రామాణిక చికిత్సావిధానాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేయటం, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, ఇతర కోవిడ్ యోధులు అంకిత భావంతో కృషి చేయటం వలన కోలుకుంటున్నవారి సంఖ్య బాగా పెరుగుతూ వస్తోంది. అదే సమయంలో మరణాల సంఖ్య కూడా బాగా తగ్గుతూ వచ్చింది. అంతజాతీయ స్థాయిలో కూడా మరణాల శాతం తక్కువగా ఉన్న దేశంగా భారత్ కు ప్రత్యేక స్థానం లభించింది. ఈరోజు అది 1.52% గా నమోదైంది. వీటన్నిటి ఉమ్మడి ఫలితమే చికిత్సలో ఉన్నవారి సంఖ్య తగ్గుదలకు కారణమైంది.
కొత్తగా కోలుకున్న కేసులలో దాదాపు 78% కేవలం 10 రాష్ట్రాలలోనే కేంద్రీకృతమయ్యాయి. వాటిలో మహారాష్ట అత్యధికంగా 13,000 కు పైగా కేసులు కోలుకున్నట్టు నమోదు చేసుకొని మొదటి స్థానంలో ఉండగా 8,000 కు పైగా కేసులతో కర్నాటక రెండో స్థానంలో ఉంది.
గడిచిన 24 గంటలలో కొత్తగా పాజిటివ్ గా నిర్థారణ జరిగిన కేసులు 62,212 వీటిలో 79% కేసులు 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోనే నమోదయ్యాయి. ఇప్పటికీ మహారాష్ట్రలోనే అత్యధికంగా కేసులు వస్తున్నాయి. 11,000 కు పైహా మహారాష్ట్రలో నమోదు కాగా, కర్నాటక , కేరళ రాష్టాల్లో ఏడేసి వేలకు పైగా కేసులు వచ్చాయి.
గడిచిన 24 గంటలలో 837 మంది మరణించారు. వీళ్లలో దాదాపు 82% మంది 10 రాష్ట్రాలకు చెందినవారే. మహరాష్ట్రలో అత్యధికంగా ఒకే రోజు 306 మరణాలు నమోదయ్యాయి.
ఈ అంతర్జాతీయ సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం అండగా నిలిచి సాయం అందిస్తూనే ఉంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఉన్నత స్థాయి కేంద్ర బృందాలను కేరళ, కర్నాటక, రాజస్థాన్, చత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు పంపింది. ఈ రాష్ట్రాలలో పాజిటివ్ కేసుల సంఖ్య బాగా పెరుగుతున్నట్టు తేలటమే ఇందుకు కారణం.
వ్యాధి నియంత్రణ విధానాన్ని పటిష్టంగా అమలు చేయటం, నిఘా, నిర్థారణ పరీక్షలు, ఇన్ఫెక్షన్ నిరోధం, నియంత్రణ చర్యలు, పాజిటివ్ కేసులకు సమర్థవంతమైన చికిత్సావిధానం అమలు జరిగేలా ఈ బృందాలు ఆయా రాష్ట ప్రభుత్వాలకు సాయం చేస్తాయి. సకాలంలో వ్యాధి నిర్థారణ, ఆ తరువాత తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా కేంద్ర బృందాలు మార్గదర్శనం చేస్తాయి.
****
(Release ID: 1665412)
Visitor Counter : 172
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam