ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత్ లో అసాధారణ రికార్డు: కోవిడ్ కేసుల రెట్టింపుకు73 రోజుల సమయం చికిత్సలో ఉన్న బాధితుల సంఖ్య మరింత తగ్గి 11 శాతానికి చేరిక

Posted On: 15 OCT 2020 12:56PM by PIB Hyderabad

భారత దేశంలో కోవిడ్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య అసాధారణంగా పెరుగుతూ ఉండటంతో చికిత్సలో ఉన్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఫలితంగా ఇన్ఫెక్షన్ సోకుతున్నవారి సంఖ్య రెట్టింపు కావటానికి 73 రోజులు (72.8) పడుతున్నట్టుగా తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీన్ని బట్టి రోజూ వస్తున్న కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్టు, పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపు కావటానికి ఎక్కువకాలం పడుతున్నట్టు  స్పష్టంగా తెలుస్తోంది.

రెట్టింపు కావటానికి పట్టే సమయం ఆగస్టు మధ్యలో 25.5 రోజులకు చేరగా  ఇప్పుడు 73 రోజులకు చేరింది. కేంద్రం పర్యవేక్షణలో రూపొందించిన వ్యూహాన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సమర్థంగా అమలు చేయటం వల్లనే ఇది సాధ్యమైంది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పరీక్షలు జరపటం, గట్టి నిఘా ద్వారా  ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉన్నవారి ఆనవాలు పట్టటం, వేగంగా ఆస్పత్రులలో చేర్పించటం, ప్రామాణిక చికిత్సావిధానాలు అనుగుణంగా చికిత్స అందించటం వలన ఇది సాధ్యమైంది. అదే సమయంలో  డాక్టర్లు, పారామెడిక సిబ్బమ్ది సహా కోవిడ్ యోధులు అందరూ అందించిన నిస్వార్థ సేవలు దీనికి దోహదం చేసాయి,

WhatsApp Image 2020-10-15 at 10.30.11 AM.jpeg

కోవిడ్ కి తగినట్టు ఎలా నడుచుకోవాలో దేశవ్యాప్తంగా అవగాహన పెరగటం వలన సకాలంలో చికిత్సకు సిద్ధం కావటం కూడా ఇన్ఫెక్షన్ వ్యాప్తిని నియంత్రించటానికి సాయపడింది. గడిచిన 24 గంటలలో  81,514 మంది కొత్తగా కోలుకున్నారు. దీంతో ఇప్పటివరలు కోలుకున్న కోవిడ్ పాజిటివ్ ల సంఖ్య 64 లక్షలకు (63,83,441) చేరింది. ఒక్కో రోజూ కోలుకుంటున్నవారి సంఖ్య అధికంగా ఉండటం వల్ల జాతీయ స్థాయిలో కోలుకున్నవారిశాతం 87 దాటి ప్రస్తుతం 87.36% అయింది. కొత్తగా కోలుకున్నవారిలో దాదాపు 79% మంది 10 రాష్ట్య్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకే పరిమితం కావటం కూడా గమనార్హం.  వీటిలో మహారాష్ట్రలోనే 19,000 కు పైగా కేసులు నమోదు కాగా కర్నాటక 8,000 తో తరువాత స్థానంలో ఉంది.

WhatsApp Image 2020-10-15 at 10.25.39 AM.jpeg

ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసులలో 11.12 % మంది చికిత్స పొందుతూ ఉన్నారు. వీరి సంఖ్య 8,12,390 గా నిలిచింది. వారం రోజులుగా ఈ సంఖ్య 9 లక్షల లోపే ఉంటూ వస్తున్నది. గత 24 గంటలలో 67,708 కేసులు కొత్తగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 77% కేసులు కేవలం 10 రాష్ట్రాలకు చెందినవే కావటం గమనార్హం. వాటిలో మహారాష్ట్రలో అత్యధికంగా 10,000 కు పైగా కేసులు నమోదు కాగా దాదాపు 9,000 కు పైగా కేసులతో కర్నాటక రెండో స్థానంలో ఉంది.  

WhatsApp Image 2020-10-15 at 10.25.38 AM (1).jpeg

గత 24 గంటల్లో 680 మంది కోవిడ్ బాధితులు చనిపోయారు. గడిచిన 12 రోజులుగా మరణాల సంఖ్య స్థిరంగా 1000 కి లోపే ఉంటూ వస్తున్నది.  మృతులలో 80% మంది పది రాష్ట్రాలలోనే కేంద్రీకృతమయ్యారు. వారిలో 23% (158 మంది) కొత్తగా మరణించినవారు మహారాష్ట్రకు చెందినవారే.

 
WhatsApp Image 2020-10-15 at 10.25.38 AM.jpeg
****


(Release ID: 1664713) Visitor Counter : 153