రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

దిల్లీలో 'నేవల్ ఇన్వెస్టిచర్ సెరెమనీ'-2020

నాడు పోస్టు చేయడమైనది: 14 OCT 2020 3:25PM by PIB Hyderabad

నావికాదళంలో గొప్ప నాయకత్వం ప్రదర్శించిన, వృత్తిపర విజయాలు సాధించిన, విశిష్ట సేవలు అందించిన సిబ్బందిని సన్మానించేందుకు, దిల్లీలో 'నేవల్ ఇన్వెస్టిచర్ సెరెమనీ' నిర్వహించారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన విశిష్ట సేవ పతకాలను, చీఫ్‌ ఆఫ్‌ నావల్‌ స్టాఫ్, అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌ నౌకాదళ సిబ్బందికి ప్రదానం చేశారు. ఒక యుద్ధ సేవ పతకం, ఒక నవ సేన పతకం, ఆరు విశిష్ట సేవ పతకాలను ఆయన గ్రహీతలకు బహూకరించారు.

    'నేవల్ ఇన్వెస్టిచర్ సెరెమనీ'ని, అవార్డు గ్రహీతల ఉత్సవ కవాతుగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ప్రస్తుత కొవిడ్‌ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఎక్కడికక్కడ స్థానికంగానే నిర్వహించారు. కేవలం అతి కొద్దిమంది సీనియర్‌ అధికారులు, పురస్కార గ్రహీతల జీవిత భాగస్వాములను మాత్రమే దిల్లీలో జరిగిన వేడుకకు అనుమతించారు. సామాజిక దూరం వంటి అన్ని జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకున్నారు. వేడుక నిరాడంబరంగా జరిగినప్పటికీ, పురస్కార గ్రహీతలకు గుర్తుండిపోయేలా నిర్వహించారు.

***


(రిలీజ్ ఐడి: 1664386) సందర్శకుల సూచీ సంఖ్య : : 169
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Punjabi , Tamil , Malayalam