గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్ కింద ఇప్పటివరకు 31,500 కోట్ల రూపాయల వ్యయంతో, మొత్తం 32 కోట్ల పనిదినాలు ఉపాధి కల్పించారు.

పెద్ద సంఖ్యలో నిర్మాణాలు జరిగాయి; 2,123 గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం జరిగింది; 21,595 వ్యర్థ పదార్థాల నిర్వహణ పనులు చేపట్టడం జరిగింది; 62,824 మంది అభ్యర్థులు నైపుణ్య శిక్షణ పొందారు

Posted On: 12 OCT 2020 4:44PM by PIB Hyderabad

కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో గ్రామాలకు తిరిగి వస్తున్న వలస కార్మికులకు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావితమైన పౌరులకు ఉపాధి మరియు జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచడం కోసం గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్ (జి.కె.ఆర్.ఏ) ను ప్రారంభించడం జరిగింది.  6 రాష్ట్రాలలో, వారి సొంత గ్రామాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు ఉపాధి కల్పించడానికి ఈ పధకం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది.  ఈ రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచడం ద్వారా ఈ పధకం, ఆయా గ్రామంలోని ప్రజలకు సాధికారత కల్పిస్తోంది.

15వ వారం నాటికి మొత్తం 32 కోట్ల పనిదినాల ఉపాధి కల్పించడం జరిగింది.  ఈ అభియాన్ లక్ష్యాల సాధన కోసం ఇప్పటివరకు 31,577 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.  పెద్ద సంఖ్యలో నిర్మాణాలు జరిగాయి. వీటిలో, 1,32,146 నీటి సంరక్షణ నిర్మాణాలు,  4,12,214 గ్రామీణ గృహాలు, 35,529 పశువుల షెడ్లు, 25,689 వ్యవసాయ చెరువులు,  మరియు 16,253 కమ్యూనిటీ మరుగు దొడ్లు ఉన్నాయి. వీటితో పాటు, జిల్లా ఖనిజ నిధుల ద్వారా 7,340 పనులు కూడా చేపట్టడం జరిగింది.  2,123 గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం జరిగింది. ఘన మరియు ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణకు సంబంధించి మొత్తం 21,595 పనులు చేపట్టడం జరిగింది. ఈ పధకం కింద కృషి విజ్ఞాన కేంద్రాలు (కె.వి.కె.ల) ద్వారా 62,824 మంది అభ్యర్థులకు నైపుణ్య శిక్షణ అందించడం జరిగింది. 

ఈ అభియాన్ ఇప్పటివరకు సాధించిన విజయాన్ని 12 మంత్రిత్వ శాఖలు / విభాగాలు మరియు రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి ప్రయత్నాలుగా భావించవచ్చు.  ఇవి వలస కార్మికులకు మరియు గ్రామీణ సమాజానికి, అధిక మొత్తంలో ప్రయోజనాలను చేకూరుస్తున్నాయి.  గ్రామాలలోని ఉండిపోదామని నిర్ణయించుకున్న వారికి ఉద్యోగాలు మరియు జీవనోపాధి కోసం దీర్ఘకాలిక ఏర్పాట్లకు అవసరమైన దీర్ఘకాలిక చర్యలు చేపట్టడానికి ఈ పధకం ఒక వేదికగా రూపుదిద్దుకుంది. 

*****


(Release ID: 1663816) Visitor Counter : 166