ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత్ లో కరోనా బాధితుల సంఖ్య తగ్గుదలలో కొనసాగుతున్న ధోరణి

చికిత్సలో ఉన్నవారు పాజిటివ్ కేసులలో12.10%

వరుసగా 4వ రోజు కూడా చికిత్సలో ఉన్నది 9 లక్షలలోపే

Posted On: 12 OCT 2020 11:10AM by PIB Hyderabad

భారతదేశంలో కోవిడ్ చికిత్స పొందుతున్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. వరుసగా నాలుగో రోజు కూడా చికిత్సపొందుతున్నవారి సంఖ్య 9 లక్షల లోపే కొనసాగుతూ వచ్చింది. ఆ విధంగా తగ్గుదల నిర్నిరోధంగా కొనసాగుతోంది. ప్రస్తుతం మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసులలో 12.10 శాతం మాత్రమే ఇప్పటికీ చికిత్సలో ఉన్నారు. సంఖ్యాపరంగా చూస్తే దేశం మీద ఇప్పుడు చికిత్సాభారం 8,61,853 మంది.

WhatsApp Image 2020-10-12 at 10.30.12 AM.jpeg

కోలుకున్నవారి సంఖ్య అధికంగా నమోదు చేసుకోవటంలోనూ భారత్ ముందున్నది. ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 61.5 లక్షలు ఉంది. కచ్చితంగా చెప్పాలంటే ఇప్పటికి 61,49, 535 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. చికిత్సలో ఉన్నవారికి, కోలుకున్నవారికి మధ్య తేడా చూస్తే అది క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఆ తేడా  ఈ రోజుకు 52,87,682 గా నమోదైంది.   గడిచిన 24 గంటల్లో  71,559 మంది కోవిడ్ బాధితులు కోలుకోగా కొత్తగా కోవిడ్ సోకినవారి సంఖ్య  66,732 గా నమోదైంది. జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం పెరుగుతూ 86.36% చేరింది..

 

WhatsApp Image 2020-10-12 at 10.44.19 AM.jpeg

కొత్తగా కోలుకున్నవారిలో 77% మంది పది రాష్ట్రాలలోనే ఉండగా అందులో మహారాష్ట్ర, కర్నాటక ఒకే రోజులో 10,000 మందికి పైగా కోలుకున్నవారున్న జాబితాలో ముందున్నాయి. 

WhatsApp Image 2020-10-12 at 10.48.54 AM.jpeg

గత 24 గంటలలో కొత్త కోవిడ్ పాజిటివ్ నమోదైన కేసుల సంఖ్య 66,732 కాగా, వాటిలో దాదాపు 81% పది రాష్ట్రాలలోనే నమోదు కావటం గమనార్హం. 10,000 కి పైగా కేసులతో మహారాష్ట్ర అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రంగా మిగలగా దాదాపు 9,000 కేసులతో కర్నాటక, కేరళ ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి.   

WhatsApp Image 2020-10-12 at 10.48.55 AM.jpeg

గడిచిన 24 గంటలలో కోవిడ్ మరణాలు 816 నమోదయ్యాయి. వీటిలో 85% కేసులు కేవలం 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే నమోదయ్యాయి. నిన్నటి మరణాలలో 37% పైగా (309 మంది) నమోదు చేసుకున్న మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది.  

WhatsApp Image 2020-10-12 at 10.48.55 AM (1).jpeg

                                                                                                                                        

****

 

(Release ID: 1663674) Visitor Counter : 261