శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

హైడ్రోజన్ ఇంధన సెల్‌ను అమర్చిన కారును ప్రదర్శించిన సీఎస్‌ఐఆర్-కేపిఐటీ

ఎలక్ట్రోడ్‌ పొర కలిగిన పీఈఎం ఇంధన కణ సాంకేతిక పరిజ్ఞానం సీఎస్‌ఐఆర్‌కు మాత్రమే పూర్తిగా సొంతమైన స్వదేశీ పరిజ్ఞానం

Posted On: 10 OCT 2020 5:52PM by PIB Hyderabad

భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ (హెచ్‌ఎఫ్‌సీ) ప్రోటోటైప్ కారును  కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) మరియు కెపిఐటిలు విజయవంతంగా నడిపాయి. పూణెలోని సిఎస్ఐఆర్-నేషనల్ కెమికల్ లాబొరేటరీలో ఈ సాంకేతికతను దేశీయంగా అభివృద్ధి చేశాయి. ఇది తక్కువ ఉష్ణోగ్రత (ప్రోటాన్ ఎక్స్ఛేంజ్ మెంబ్రేన్) రకమైన ఇంధన కణం. ఇది ఇది 65 నుంచి 75 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద పనిచేస్తుంది. ఈ వ్యవస్థ వాహనాలకు అనుకూలంగా ఉంటుంది.

 



సీఎస్‌ఐఆర్‌ మరియు కేపిఐటీలకు మాత్రమే సొంతమైన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా..10 కిలోవాట్ల ఆటోమోటివ్ గ్రేడ్ ఎల్‌టీ-పీఈఎంఎఫ్‌సీ ఇంధన్‌సెల్‌ను విజయవంతంగా అభివృద్ధి చేశాయి.ఇందులో ఎలక్ట్రోడ్‌ పొర కలిగిన పీఈఎం ఇంధన కణ సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది. ఇది పూర్తిగా సీఎస్‌ఐఆర్‌కు మాత్రమే సొంతమైన సాంకేతిక పరిజ్ఞానం. ఈ వ్యవస్థలో కీలకమైన తేలికపాటి మెటల్ బైపోలార్ ప్లేట్ మరియు గ్యాస్‌కెట్‌ డిజైన్, ప్లాంట్ బ్యాలెన్స్ (బీవోపీ) అభివృద్ధి, సిస్టమ్ ఇంటిగ్రేషన్, కంట్రోల్ సాఫ్ట్‌వేర్ మరియు వాహనాన్ని నడపడానికి వీలు కల్పించే ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్‌లను రూపకల్పన చేయడానికి కేపీఐటీకి చెందిన సాంకేతిక నిపుణులు పనిచేశారు.చాలా సన్నని మెటల్ బైపోలార్ ప్లేట్ల ఈ ఇంధన వ్యవస్థ ఉపయోగిస్తుంది. తద్వారా స్టాక్  బరువు రెండొంతుల వరకు తగ్గిపోతుంది.

ఇండస్ట్రీ ఆరిజినేటెడ్ ప్రాజెక్ట్ (ఐఓపి) విభాగంలో భాగంగా  ఆటోమోటివ్ గ్రేడ్ పిఇఎమ్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ అభివృద్ధి కోసం 2016లో న్యూ మిలీనియం ఇండియన్ టెక్నాలజీ లీడర్‌షిప్ ఇనిషియేటివ్ (ఎన్‌ఎమ్‌ఐటిఎల్‌ఐ) కెపిఐటితో కలిసి ఆటోమోటివ్ గ్రేడ్ పీఈఎం సెల్‌టెక్నాలజీ కార్యక్రమాన్ని చేపట్టింది.

విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి..ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ (హెచ్‌ఎఫ్‌సి) సాంకేతికత హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ మధ్య రసాయన ప్రతిచర్యలను ఉపయోగిస్తుంది. తద్వారా శిలాజ ఇంధనాల వాడకాన్ని తొలగిస్తుంది. అనంతరం ఇది కేవలం నీటిని మాత్రమే విడుదల చేస్తుంది. తద్వారా ఇతర వాయు కాలుష్య కారకాలతో పాటు హానికరమైన గ్రీన్‌హౌస్‌ వాయువుల ఉద్గారాలు వెలువడడం తగ్గిపోతుంది. భవిష్యత్తులో ఉపయోగపడే ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల కాలుష్యకారాకాలు తొలగిపోతాయి. అందువల్ల ఈ ప్రపంచం మరింత పరిశుభ్రంగా మారుతుంది.

ఈ కారు ట్రయిల్ రన్‌లో పాసెంజర్ కారు ఫ్లాట్‌ఫామ్‌పై బ్యాటరీ ఎలక్ట్రిక్‌ ఫ్యూయల్‌ సెట్‌ స్టాక్‌ను ఉపయోగించారు. బస్సులు, ట్రక్కులు వంటి వాణిజ్య వాహనాలకు ఈ సాంకేతికత మరింత అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. సాధారణంగా ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులు నడవడానికి  పెద్ద బ్యాటరీ శక్తి అవసరం. అయితే  హెచ్‌ఎఫ్‌సి టెక్నాలజీలో చిన్న బ్యాటరీతోనే అతి ఎక్కువ శక్తిని విడుదల చేయవత్తు. అందువల్ల ఈ వ్యవస్థ వాణిజ్య వాహనాలకు  మరింత ఎక్కువగా ఉపయోగపడుతుంది.

ఈ ఎఫ్‌సీ వాహనంలో టైప్-3 వాణిజ్య హైడ్రోజన్ ట్యాంక్‌ను అమర్చారు. దీని సామర్థ్యం సుమారు 350 బార్ ప్రెజర్ వద్ద నిల్వ చేయబడిన 1.75 కిలోల హైడ్రోజన్. ఈ సామర్ధ్యంతో భారతీయ రహదార్లపై గంటకు 60 నుండి 65 కిలోమీటర్ల వేగంతో వాహనం 250 కిలోమీటర్లు నడుస్తుంది. 5 సీట్లు కలిగిన సెడాన్ కారులో ఈ మొత్తం ఇంధన సెల్ స్టాక్‌ను అమర్చారు.

ఈ ముఖ్యమైన మైలురాయిపై, కెపిఐటి ఛైర్మన్ శ్రీ రవి పండిట్ మాట్లాడుతూ, "స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీకి మంచి భవిష్యుత్తు ఉంటుందని అలాగే గతంలో కంటే వాణిజ్యపరంగానూ లాభదాయకంగా ఉంటుందని చెప్పారు. శిలాజ ఇంధనాల దిగుమతులను తగ్గించడంతో పాటు కాలుష్యాన్ని అరికట్టడంలో భారతదేశానికి ఈ సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు.

స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మొదటిసారి విజయవంతంగా హైడ్రోజన్ ఇంధన సెల్‌తో కారును నడిపిన బృందానికి..
సిఎస్‌ఐఆర్-ఎన్‌ఎమ్‌టిఎల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్ అశ్వినీకుమార్ నంగియా అభినందలను తెలిపారు. " భారతదేశంలో హైడ్రోజన్ ఆధారిత ఇంధన వినియోగానికి సమయం ఆసన్నమయిందని..ఇది పెట్రోల్, డీజిల్ దిగుమతి బిల్లును తగ్గించడమే కాక కాలుష్యరహిత ఇంధనానికి ఉపయోగపడుతుందని" ఈ ఇండస్ట్రీ భాగస్వామి కెపిఐటి పేర్కొంది. ఎన్‌ఎమ్‌ఐటిఎల్‌ఐ ఆధ్వర్యంలో సిఎస్‌ఐఆర్ దీర్ఘకాలిక పెట్టుబడి ఫలించిందని తెలిపింది.

 

***


(Release ID: 1663455) Visitor Counter : 292