రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

జిఎస్ఎఫ్సి స్వదేశీ రకం ‘కాల్షియం నైట్రేట్’ & 'బోరోనేటెడ్ కాల్షియం నైట్రేట్' ను ప్రారంభించిన శ్రీ మాండవియా

“ఆత్మనిర్భర భారత్ మరియు ఆత్మనిర్భర్ కృషి” దిశగా ఒక నిర్ణయాత్మక అడుగు: శ్రీ మాండవియా

Posted On: 09 OCT 2020 11:16AM by PIB Hyderabad

కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి,  షిప్పింగ్ సహాయ మంత్రి (ఇంఛార్జ్) శ్రీ మన్సుఖ్ మాండవియా గుజరాత్ రాష్ట్ర ఎరువులు మరియు కెమికల్స్ - జిఎస్ఎఫ్సి ఇండియా లిమిటెడ్ తయారు చేసిన స్వదేశీ రకం కాల్షియం నైట్రేట్, బోరోనేటెడ్ కాల్షియం నైట్రేట్'ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.

 

‘కాల్షియం నైట్రేట్’ & 'బోరోనేటెడ్ కాల్షియం నైట్రేట్ భారతదేశంలో తొలిసారిగా తయారవుతోంది. ఇప్పటి వరకు, ఇది ఇతర దేశాల నుండి దిగుమతి అయ్యింది. ఈ సందర్భంగా శ్రీ మాండవియా మాట్లాడుతూ, ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ స్పష్టమైన పిలుపునకు ప్రతిస్పందిస్తూ, సంస్థ “ఆత్మనిర్భర్ భారత్ మరియు ఆత్మనిర్భర్ కృషి” వైపుగా ఈ నిర్ణయాత్మక అడుగు వేసి, జిఎస్ఎఫ్సి రిటైల్ మార్కెట్లో మొదటిసారి హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ మరియు గుజరాత్ లోని భావ్ నగర్ నుండి ఈ రెండు ఉత్పత్తులను ప్రారంభించిందని అన్నారు. ప్రస్తుతం ఈ రెండు ఉత్పత్తులకు జిఎస్‌ఎఫ్‌సి మొత్తం ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 10,000 మెట్రిక్ టన్నులు (ఎంటి). మూడు నెలల్లో, ఉత్పత్తి సంవత్సరానికి 15000 మెట్రిక్ టన్నులకు పెరిగే స్థాయి అంచనాకు చేరుకుంటుందన్నారు. 9 నుంచి 12 నెలల్లో దీనిని 30,000 మెట్రిక్ టన్నులకు పెంచాలని జిఎస్‌ఎఫ్‌సి యోచిస్తున్నట్లు మంత్రికి అధికారులు విమరించారు. దేశవ్యాప్తంగా జిఎస్‌ఎఫ్‌సి యొక్క ప్రాంతీయ కార్యాలయాలు కూడా ఈ డిజిటల్ ప్రారంభోత్సవ  కార్యక్రమంలో పాల్గొన్నాయి.

ఈ దేశీయ రకాలైన కాల్షియం నైట్రేట్ మరియు బోరోనేటెడ్ కాల్షియం నైట్రేట్ దిగుమతి చేసుకున్న వాటి కంటే దేశంలోని రైతాంగానికి తక్కువ రేటుతో నాణ్యమైన ఉత్పత్తిని అందిస్తాయని శ్రీ మాండవియా చెప్పారు. ప్రారంభించిన రెండు ఉత్పత్తులు ఎఫ్‌సిఓ గ్రేడ్‌కు చెందినవని, భారత ప్రభుత్వంలోని ఎరువుల విభాగం యొక్క గుర్తింపు పొందిన ప్రయోగశాల ద్వారా ధృవీకరించబడిందని ఆయన అన్నారు. ఇప్పటి వరకు ఈ ఉత్పత్తి పూర్తిగా దిగుమతి అయ్యిందని, మొదటిసారిగా జిఎస్‌ఎఫ్‌సి దీనిని దేశీయంగా చేయడానికి చొరవ తీసుకుందని ఆయన చెప్పారు. "ఈ ఉత్పత్తులు దేశీయ మార్కెట్లో గొప్ప విజయాన్ని సాధిస్తాయనడంలో సందేహం లేదు" అని ఆయన అన్నారు.

గత ఏడాది దేశంలో సుమారు 1.25 లక్షల మెట్రిక్ టన్నులు (1,23,000 టన్నులు) కాల్షియం నైట్రేట్ దిగుమతి అయ్యింది. ఇందులో 76% చైనా నుండి, మిగిలినవి నార్వే, ఇజ్రాయెల్ వంటి ఇతర దేశాల నుండి దిగుమతి అయ్యాయి. ఈ 1.25 లక్షల టన్నుల మొత్తం దిగుమతి విలువ రూ. 225 కోట్లు. జిఎస్‌ఎఫ్‌సి గత ఏడాది 4600 మెట్రిక్ టన్నులను దిగుమతి చేసుకుని విక్రయించింది. కాల్షియం నైట్రేట్‌ను వ్యవసాయంలో నీటిలో కరిగే ఎరువుగా ఉపయోగిస్తారు. అదనంగా, ఈ ఉత్పత్తి వ్యర్థజలాల శుద్ధిలో మరియు సిమెంట్ కాంక్రీటు బలాన్ని పెంచడానికి కూడా ఉపయోగించబడుతుంది.

                                                                                                            *****



(Release ID: 1663133) Visitor Counter : 175