ప్రధాన మంత్రి కార్యాలయం

కేంద్ర మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ మృతికి ప్ర‌ధాన‌మంత్రి సంతాపం

Posted On: 08 OCT 2020 9:59PM by PIB Hyderabad
కేంద్ర మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ మ‌ర‌ణం ప‌ట్ల ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌గాఢ సంతాపం తెలియ‌చేశారు.
 
"నా విచారాన్ని మాట‌ల్లో వ్య‌క్తం చేయ‌లేను. శ్రీ పాశ్వాన్ మృతితో జాతీయ స్థాయిలో పెద్ద అగాధం ఏర్ప‌డింది, దాన్ని నింప‌డం ఎప్ప‌టికీ సాధ్యం కాదు. శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ జీ మ‌ర‌ణం నాకు వ్య‌క్తిగ‌తంగా కూడా న‌ష్ట‌మే. నేను ఒక మంచి మిత్రుడు, విలువైన స‌హ‌చ‌రుడు, ప్ర‌తీ ఒక్క పేద వానికి ఆత్మ‌విశ్వాసంతో జీవించ‌గ‌ల ప‌రిస్థితి క‌ల్పించ‌డం ప‌ట్ల ఎంతో వ్యామోహం ఉన్న ఒక మంచి మిత్రుని కోల్పోయాను" అని ఆయ‌న వ‌రుస ట్వీట్ల‌లో రాశారు. 
 
క‌ఠోర శ్ర‌మ‌, క‌ట్టుబాటులో శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ జీ రాజ‌కీయాల్లో ఎదిగారు. ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో యువ‌నాయ‌కుడుగా ఉన్న ఆయ‌న క్రూర‌త్వానికి, ప్ర‌జాస్వామ్యంపై దాడికి వ్య‌తిర‌రేకంగా పోరాడారు. ఆయ‌న ఒక అసాధార‌ణ‌మైన పార్ల‌మెంటేరియ‌న్‌, ప‌లు విధాన నిర్ణ‌యాల‌కు త‌న వంతు స‌హ‌కారం అందించిన మంచి మంత్రి అని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.

"రామ్ విలాస్ పాశ్వాన్ తో క‌లిసి ప‌ని చేయ‌డం ఒక అద్భుత‌మైన అనుభ‌వం.  కేబినెట్ స‌మావేశాల్లో ఆయ‌న ప్ర‌స్తావించే అంశాలు ఎంతో లోతైన అవ‌గాహ‌న‌తో కూడిన‌వి. చ‌క్క‌ని రాజ‌కీయ జ్ఞానం, రాజ‌నీతిజ్ఞ‌త‌, మంచి తెలివితేట‌లు గ‌ల వ్య‌క్తి ఆయ‌న‌. ఆయ‌న కుటుంబానికి, మ‌ద్ద‌తుదారుల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టిస్తున్నాను. ఓం శాంతి" అని పేర్కొన్నారు. 
***


(Release ID: 1662936) Visitor Counter : 130