ప్రధాన మంత్రి కార్యాలయం

కోవిడ్-19 ను దృష్టి లో పెట్టుకొని దానికి తగినట్లు నడుచుకొనేందుకు ఉద్దేశించిన జన్ ఆందోళన్ ‌ను ప్రారంభించనున్న గౌరవనీయ ప్రధాన మంత్రి

Posted On: 08 OCT 2020 9:28AM by PIB Hyderabad

కోవిడ్-19 ను దృష్టి లో పెట్టుకొని దానికి తగినట్లు నడుచుకొనేందుకు గాను ఉద్దేశించిన జన్ ఆందోళన్ ‌ప్రచార ఉద్యమాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం అక్టోబరు 8న ట్వీట్ రూపం లో ప్రారంభించనున్నారు.

రాబోయే పండుగలను, శీతాకాలాన్ని, ఆర్థిక వ్యవస్థ ను తెరచే క్రమంలో ఈ ప్రచార ఉద్యమాన్ని ఆరంభించడం జరుగుతోంది.   


ప్రజల భాగస్వామ్యాన్ని (జన్ ఆందోళన్) ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ప్రచారాన్ని ప్రారంభించడం జరుగుతోంది. కోవిడ్-19 పట్ల అప్రమత్తంగా మెలగడాన్ని ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దడం ఈప్రచార ఉద్యమ ఉద్దేశ్యంగా ఉంది. 'మాస్కు ధరించండి, సురక్షిత  దూరాన్ని పాటించండి, చేతులను శుభ్రంగా ఉంచుకొనేందుకు తరచుగా వాటిని కడుక్కుంటూ ఉండండి' అనే ప్రక్రియలతో ముడిపడిన సందేశాలను ఇస్తూ తక్కువ ఖర్చు తో, ఎక్కువ ప్రభావాన్ని కలగజేసే విధంగా ఈ ప్రచారాన్ని చేపట్టడం జరుగుతుంది. 

ఈ క్రమం లో అందరితో కోవిడ్-19 కి సంబంధించిన ప్రతిజ్ఞ ను స్వీకరింపచేస్తారు. దీనిలో భాగంగా,  ఈ  క్రింది ముఖ్యాంశాలతో,  కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు / విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు / కేంద్ర పాలిత ప్రాంతాల ద్వారా సంఘటిత కార్యాచరణ ప్రణాళిక ను అమలు చేయడం జరుగుతుంది. ఆ ప్రణాళిక లో ఈ క్రింది అంశాలు భాగంగా ఉంటాయి.. :

*          కేసుల భారం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో, ఆయా ప్రాంతాలపై నిర్దిష్ట లక్ష్యంతో ప్రచారాన్ని కొనసాగించనున్నారు; 

*          సరళమైన భాషలో, తేలికగా అర్థమయ్యే సందేశాలను దేశంలో ప్రతి ఒక్కరికీ చేరవేయనున్నారు;

*          అన్ని ప్రసార మాధ్యమాల వేదికల ను ఉపయోగించుకొంటూ దేశంలోని అన్ని ప్రాంతాలకు సందేశాలను చేరవేయడం జరుగుతుంది;

*          బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లను, బ్యానర్లను ఏర్పాటు చేస్తారు; దీనికోసం ఫ్రంట్ లైన్ వర్కర్ ల సాయం తీసుకొంటారు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను కూడా లక్ష్యంగా చేసుకోవడం జరుగుతుంది.

*          ప్రభుత్వ ప్రాంగణాలలో హోర్డింగులు / గోడలపై పెయింటింగులు  / ఎలక్ట్రానిక్ ప్రదర్శన బోర్డులను ఏర్పాటు చేయడం జరుగుతుంది.

*          ఈ సందేశాన్ని ప్రతి ఇంటికీ చేర్చేందుకు స్థానిక, జాతీయ స్థాయి లో ప్రభావాన్ని కనబర్చే ప్రముఖుల సేవలను వినియోగించుకోవడం జరుగుతుంది.

*          జాగృతిని వ్యాప్తి చేయడం కోసం క్రమం తప్పక సంచార వ్యాన్ లను నడుపుతారు. ఆడియో సందేశాలు; అవగాహన పై కరపత్రాలు / వివరణ పత్రాల ద్వారా కూడా ప్రచారం జరుగుతుంది.

*          కోవిడ్-19 కి సంబంధించిన జాగ్రత్తలను తీసుకోవాలని చెప్పే  సందేశాలను ప్రచారం చేయవలసిందిగా స్థానిక కేబుల్ ఆపరేటర్ల ను సాయం కోరుతారు.

*          ఈ సందేశాల ను లక్షిత వర్గాల వారికి ప్రభావవంతమైన విధంగా తీసుకుపోవడానికి గాను ప్రసార మాధ్యమాల మధ్య సమన్వయ సాధన తో కూడిన ప్రచారాన్ని అన్ని వేదికల లోనూ నిర్వహించడం జరుగుతుంది.


 

***
 



(Release ID: 1662615) Visitor Counter : 215