ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
రికవరీ రేటు 85% దాటిన భారత్ మరో శిఖర అంచుకు చేరుకుంది
క్రియాశీలక కేసులు కన్నా కోలుకున్న కేసులు 48 లక్షలను దాటాయి
18 రాష్ట్రాలు / యుటిలు రికవరీ రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదు
Posted On:
07 OCT 2020 11:13AM by PIB Hyderabad
భారతదేశం మరో ముఖ్యమైన మైలురాయిని దాటింది. గత కొన్ని వారాలలో అధిక సంఖ్యలో కోలుకున్నవారి కేసుల నిరంతర పరంపరతో జాతీయ రికవరీ రేటు నేడు 85% దాటింది. కోలుకున్న కేసులు గత 24 గంటల్లో కొత్త రికార్డు నమోదైంది. దేశంలో గత 24 గంటల్లో 82,203 రికవరీలు నమోదు కాగా, కొత్తగా ధృవీకరించబడిన కేసుల సంఖ్య 72,049 గా ఉంది. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 57,44,693 ను తాకింది. ఇది గరిష్ట సంఖ్యలో రికవరీలతో ప్రపంచంలోనే భారత్ స్థానాన్ని పదిలపరిచింది.
.
నిరంతర అధిక స్థాయి రికవరీలు క్రియాశీలకంగా ఉన్నవి మరియు కోలుకున్న కేసుల మధ్య అంతరాన్ని మరింత పెంచాయి. కోలుకున్న కేసులు క్రియాశీల కేసుల(9,07,883) కన్నా 48 లక్షలకు పైగా (48,36,810) మించిపోయాయి. కోలుకున్న కేసులు 6.32 రెట్ల క్రియాశీలక కేసులు, రికవరీలు స్థిరంగా పెరుగుతున్నాయని నిర్ధారిస్తుంది. దేశం యొక్క క్రియాశీల కేసుల లోడ్ మొత్తం సానుకూల కేసులలో 13.44% కు పడిపోయింది మరియు స్థిరంగా తగ్గుతోంది. జాతీయ సంఖ్య పెరుగుదలతో పోలిస్తే, 18 రాష్ట్రాలు / యుటిలు జాతీయ సగటు కంటే ఎక్కువ రికవరీ రేటును కలిగి ఉన్నాయి.
కోలుకున్న కొత్త కేసులలో 75% పది రాష్ట్రాల మహారాష్ట్ర, కర్ణాటక ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్ మరియు ఢిల్లీ నుండి నమోదయ్యాయి. మహారాష్ట్ర దాదాపు 17,000 రికవరీలతో అగ్రస్థానంలో ఉండగా, కర్ణాటక ఒకే రోజు రికవరీకి 10,000 కంటే ఎక్కువ దోహదపడింది.
దేశంలో గత 24 గంటల్లో మొత్తం 72,049 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసుల్లో 78% కేసులు పది రాష్ట్రాలు / యుటిలలోనే నమోదయ్యాయి. మహారాష్ట్ర లో అధిక మొత్తంలో కేసులు నమోదుకావడం కొనసాగుతోంది. ఈ రాష్ట్రం 12,000 మందికి పైగా దోహదపడింది, తర్వాతి స్థానంలో కర్ణాటకలో దాదాపు 10,000 కేసులను నమోదు చేస్తోంది
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 986 మరణాలు నమోదయ్యాయి. కోవిడ్ కారణంగా గత 24 గంటల్లో 83% మరణాలు రాష్ట్రాలు / యుటిలలోనే సంభవించాయి. కొత్త నమోదైన మరణాలలో, మహారాష్ట్ర 370 మరణాలతో 37% కంటే ఎక్కువ మరణాలను నివేదించింది 91 మందిమరణాలు నమోదు చేసుకుని కర్ణాటక తరువాతి స్థానంలో ఉంది.
అక్టోబర్ నుండి డిసెంబర్ నెలలు మతపరమైన ఆరాధన, ఉత్సవాలు, ర్యాలీలు, ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఊరేగింపులు మొదలైన వాటి కోసం నిర్దేశిత ప్రదేశాలలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడే సమయం ఇది. ఈ కార్యక్రమాలు ఒక రోజు లేదా ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండవచ్చు . కోఉత్సవాల సందర్భంగా కోవిడ్-19 వ్యాప్తి నివారణ చర్యలపై ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను విడుదల చేసింది. వీటిని ఇక్కడ యాక్సెస్ చేయవచ్చు:
https://www.mohfw.gov.in/pdf/StandardOperatingProceduresonpreventivemeasurestocontainspreadofCOVID19duringfestivities.pdf
***
(Release ID: 1662266)
Visitor Counter : 228
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam