హోం మంత్రిత్వ శాఖ
28వ వార్షికోత్సవం సందర్భంగా ఆర్‌ఏఎఫ్ సిబ్బంది, వారి కుటుంబాలను అభినందించిన కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా శాంతిభద్రతల సవాళ్లను ఎదుర్కోవడంలో ఆర్‌ఏఎఫ్ తనను తాను నిరూపించుకుంది: అమిత్ షా
వివిధ మానవత కార్యక్రమాలు, యూఎన్ శాంతి పర్యవేక్షణ మిషన్లలో ఆర్‌ఏఎఫ్ చూపిన నిబద్ధత భారత్‌ను గర్వించేలా చేసింది: అమిత్ షా
Posted On:
07 OCT 2020 11:16AM by PIB Hyderabad
ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్) 28వ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. " ఆర్‌ఏఎఫ్ సిబ్బంది, వారి కుటుంబాలకు 28వ వార్షికోత్సవ అభినందనలు. శాంతిభద్రతలకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కోవడంలో ఆర్‌ఏఎఫ్ తనను తాను నిరూపించుకుంది. వివిధ మానవత కార్యక్రమాలు, ఐక్యరాజ్యసమితి శాంతి పర్యవేక్షణ మిషన్లలో ఆర్‌ఏఎఫ్ చూపిన నిబద్ధత భారత్‌ను సగర్వంగా నిలిచేలా చేసింది" అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఆర్‌ఏఎఫ్ ఒక ప్రత్యేక దళం. 1992 అక్టోబర్‌లో 10 బెటాలియన్లతో ఏర్పాటైంది. 2018 జనవరి 1వ తేదీన మరో 5 యూనిట్లు చేరాయి. ఎక్కడైనా అల్లర్లు, అల్లర్ల తరహా సంఘటనలు చెలరేగినప్పుడు పరిస్థితులను చక్కదిద్ది, సమాజంలోని అన్ని వర్గాల్లో విశ్వాసం నింపడానికి ఈ బృందాలు రంగంలోకి దిగుతాయి. దేశ అంతర్గత రక్షణను కూడా ఆర్‌ఏఎఫ్ చూస్తుంది.
***
(Release ID: 1662264)
Visitor Counter : 111
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam