ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితుల సంఖ్య తగ్గుముఖం మొత్తం పాజిటివ్ కేసులలో ఇంకా చికిత్సలో ఉన్నది 13.75 శాతమే
కొత్తగా కోలుకున్నవారిలో 74% మంది 10 రాష్ట్రాలనుంచే
25 రాష్ట్రాల్లో కొత్తగా వస్తున్న కేసులకంటే కోలుకుంటున్నవారే ఎక్కువ
Posted On:
06 OCT 2020 11:37AM by PIB Hyderabad
మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసులలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి వాటా పెద్ద ఎత్తున తగ్గుతూ వస్తోంది. శాతం పరంగా చూస్తే పాజిటివ్ కేసులలో అది 13,75% గా నమోదైంది. ఈరో జుకు ఇంకా కోవిడ్ చికిత్స అందుకుంటున్నవారి సంఖ్య 9,19,023 గా నిలిచింది.
కోలుకుంటున్నవారి శాతం గణనీయంగా పెరుగుతూ ఉండటం వల్లనే ఇప్పటికీ చికిత్సలో ఉండిపోయినవారి సంఖ్య తగ్గుతూ ఉంది. ఇప్పటిదాకా మొత్తం కోవిడ్ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 56,62,490 కి చేరింది. కోలుకున్నవారికీ, చికిత్సలో ఉన్నవారికీ మధ్య తేడా 47 లక్షలు (కచ్చితంగా చెప్పాలంటే 47,43, 467) దాటింది. కోలుకుంటున్నవారు పెరుగుతూ ఉందటంతో ఈ తేడా మరింత విస్తరిస్తోంది
ఇలా కోలుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉండటం వల్ల జాతీయ స్థాయిలో కోలుకుంటున్నవారి శాతం బాగా మెరుగుపడి 84.70 శాతానికి చేరింది. గడిచిన 24 గంటల్లో 75,787 మంది కోలుకొని ఆస్పత్రులనుంచి డిశ్చార్జ్ కావటమో, హోమ్ క్వారంటైన్ నుంచి బైటపడటమో జరిగింది. అదే సమయంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ జరిగిన కేసులు 61.267 గా తేలాయి. 25 రాష్ట్రాల్లో కోలుకున్నవారికంటే కొత్త కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతోంది.
కొత్తగా కోలుకున్నవారిలో 74% కేసులు 10 రాష్ట్రాలలోనే కేంద్రీకృతమైనట్టు వెల్లడైంది. అవి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేమ్ కర్నాటక, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఢిల్లీ, చత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్. వీటిలో ఒక్క మహారాష్ట్రలోనే ఒక్కరోజులోనే 13,000 మందికి పైగా కోవిడ్ బాధితులు కోలుకున్నారు.
గడిచిన 24 గంటల్లో 61.267 మందికి కొత్తగా కోవిడ్ సోకినట్టు నిర్థారణ జరిగింది. వీటిలో 75% కేసులు 10 రాష్ట్రాలలోనే నమోదు కావటం గమనార్హం. అందులో అత్యధికంగా కేసులు నమోదు కావటంలో మహారాష్ట్ర ముందుంటూనే ఉంది. రోజులో 10 వేలకు పైగా కేసులు మహారాష్ట్రలో నమోదు కాగా 7,000 కు పైగా కేసులు నమోదైన కర్నాటక రెండో స్థానంలో ఉంది.
గడిచిన 24 గంటలలో 884 మరణాలు నమోదయ్యాయి. వీళ్లలో 80% మంది 10 రాష్ట్రాలలోనే కేంద్రీకృతమయ్యాయి. అవి మహారాష్ట్ర, కర్నాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, చత్తీస్ గఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు. కొత్తగా నమోదైన మరణాలలో 29% పైగా ( 263 మరణాలు) మహారాష్ట్ర నుంచే కావటం గమనార్హం.
****
(Release ID: 1661997)
Visitor Counter : 180
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam