ప్రధాన మంత్రి కార్యాలయం
సామజిక సాధికారత కోసం బాధ్యతాయుతమైన ఏఐ 2020 పేరుతో ఈ నెల 5వ తేదీ రాత్రి 7 గంటలకు
శిఖరాగ్ర సదస్సును ప్రారంభించనున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ
రైజ్ 2020 - కృత్రిమ మేధస్సు ఏఐ పై మెగా వర్చ్యువల్ శిఖరాగ్ర సదస్సు అక్టోబర్ 5-9 మధ్య జరుగుతుంది.
ప్రపంచవ్యాప్తంగా ఏఐ పరిశ్రమ ప్రతినిధులు ఈ సదస్సులో చర్చలు జరపనున్నారు
Posted On:
03 OCT 2020 5:30PM by PIB Hyderabad
రైజ్ 2020- సామజిక సాధికారత కోసం బాధ్యతాయుతమైన ఏఐ 2020 పేరుతో కృత్రిమ మేధస్సు ఏఐ పై మెగా వర్చ్యువల్ శిఖరాగ్ర సదస్సును ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఈ నెల 5వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభించనున్నారు.
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నీతి ఆయోగ్ ఈ మెగా వర్చ్యువల్ సమ్మిట్ ను అక్టోబర్ 5 నుండి 9వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు.
ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, విద్య, స్మార్ట్ మొబిలిటీ తదితర రంగాల్లో ఏఐ ద్వారా సామజిక పరివర్తన, సమ్మిళితము, సాధికారత సాధించడానికి ఈ రైజ్ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ప్రతినిధులు ఆలోచనలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటారు.
అలాగే మహమ్మారి తో పోరాటంలో ఏఐ ని ఏ మేరకు వినియోగించవచ్చు, డిజిటలీకరణ, కొత్త ఆవిష్కరణలపై కూడా చర్చ్ జరుగుతుంది. ఏఐ లో ప్రారంభమైన కొన్ని అంకురా సంస్థలు కూడా వారి ఆవిష్కరణలను ఈ నెల 6న జరిగే సెషన్ లో ప్రదర్శిస్తారు. కేంద్రం స్టార్ట్ అప్ కంపెనీలకు ఇచ్చే ప్రోత్సాహం లో ఇదో భాగం.
ప్రపంచంలోని మూడవ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్, ఐఐటిల వంటి ఎలైట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థలు, బలమైన మరియు సర్వత్రా డిజిటల్ మౌలిక సదుపాయాలు మరియు ప్రతి సంవత్సరం కొత్తగా వచ్చే మిలియన్ల మంది స్టెమ్ గ్రాడ్యుయేట్లకు నిలయంగా ఉన్న భారత్ , కృత్రిమ మేధస్సు అభివృద్ధిలో అగ్రగామిగా ఉంది. 2035 నాటికి ఏఐ- భారతదేశ ఆర్థిక వ్యవస్థకు 957 బిలియన్ డాలర్లను జోడించగలదని పరిశ్రమ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సబ్కా సాత్, సబ్కా వికాస్ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఏఐ ని సమ్మిళిత అభివృద్ధిలో భాగస్వామ్యం చేసి దేశం 'ఏఐ అందరికోసం' అనే వ్యూహ ప్రణాళికను ముందుంచనున్నారు.
రైజ్ 2020 (http://raise2020.indiaai.gov.in/) కొత్త ఆవిష్కరణలు, ఆలోచనలకూ వేదిక కాబోతోంది.
*****
(Release ID: 1661386)
Visitor Counter : 255
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam