ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్యలో అంతర్జాతీయ రాంకు నిలబెట్టుకున్న భారత్

అతి తక్కువ మరణాల శాతం నమోదైన దేశాల్లో ఒకటిగా గుర్తింపు

Posted On: 03 OCT 2020 11:33AM by PIB Hyderabad

గరిష్ఠ సంఖ్యలో కోవిడ్ నుంచి కోలుకుంటున్న బాధితులున్న దేశంగా భారత్ అంతర్జాతీయంగా ఉన్నత స్థానంలో కొనసాగుతోంది. ఈరోజు వరకు కోలుకున్నవారి సంఖ్య 54 లక్షలు ( 54,27,706) పైబడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్యలో  21%. మొత్తం పాజిటివ్ కేసులలో ఇది 18.6 శాతం.

 

అనేక ఇతర దేశాలతో పోల్చినప్పుడు మరణాల శాతం భారత్ లో చాలా తక్కువగా నమోదైంది. ఈ విషయంలోనూ అంతర్జాతీయంగా మెరుగైన రాంక్ లో ఉంది. అంతర్జాతీయంగా కోవిడ్ పాజిటివ్ కెసులలో 2.97% మరణాలు నమోదు కాగా, భారత్ లో అది 1.56% మాత్రమే. ప్రతి పదిలక్షలమందిలో మరణాల సంఖ్య రీత్యా చుసినా భారత స్థాయి చాలా తక్కువగా ఉంది. ప్రంపంచవ్యాప్తం<గా ప్రతి పదిలక్షల జనాభాలో 130 మంది మరణించగా భారత్ లో కోవిడ్ మరణాలు 73 మాత్రమే నమోదయ్యాయి.

ప్రతిరోజూ కోలుకుంటున్నవారి సంఖ్య భారత్ లో చాలా ఎక్కువగా ఉంది. గత 24 గంటల్లో 75,628 మంది కోలుకున్నారు. ఒక్క రోజులో అత్యధికంగా కోలుకుంటున్నవారి సంఖ్య దృష్ట్యా చూస్తే  అది జాతీయస్థాయి కోలుకున్నశాతంలో ప్రతిబింబిస్తోంది. ప్రస్తుతం అది 83.84% గా ఉంది. గడిచిన 24 గంటల్లో కోలుకున్నవారిలో 74.36% మంది 10 రాష్ట్రాలకు చెందినవారే కాగా మహారాష్ట్ర అత్యధిక సంఖ్యతో మొదటి స్థానంలోను, ఆంధ్రప్రదేశ్, కర్నాటక ఆ తరువాత రెండు స్థానాల్లోనూ ఉన్నాయి.

 

ఇప్పటికీ చికిత్సలో ఉన్నవారిలో 77% మంది 10 రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. 2.6 లక్షల కేసులతో మహారాష్ట్ర మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే ముందుంది. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం పాజిటివ్ కేసులలో  ఈ రోజుకు అవి 14.6% గా ఉన్నాయి.

 

వరుసగా 12 వ రోజు కూడా భారత్ లో చికిత్సలో ఉన్నవారి సంఖ్య 10 లక్షలకంటే తక్కువస్థాయిలోకొనసాగుతోంది. ఈ రోజు నమోదైన చికిత్సలో ఉన్నవారి సంఖ్య 9,44,996.      

గడిచిన 24 గంటల్లో 79,476 మంది పాజిటివ్ గా నిర్థారణ అయ్యారు. అలా వచ్చిన కొత్త కేసులలో 78.2% కేసులు పది రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. మహారాష్ట్రలో ముందురోజు కంటే తక్కువగా దాదాపు 16 వేల కేసులు నమోదు కాగా రెండో స్థానంలో ఉన్న కేరళలో 9,258 కేసులు, కర్నాటకలో 8,000 కేసులు నమోదయ్యాయి.

 

గడిచిన 24 గంటల్లో 1,069 మరణాలు నమోదయ్యాయి. అందులో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే 84.1% మరణాలు నమోదయ్యాయి. నిన్న నమోదైన మరణాలలో 424 మంది ( 39.66%) మహారాష్ట్ర నుంచే కాగా 125 మరణాలతో కర్నాటక రెండో స్థానంలో ఉంది. 

 

****


(Release ID: 1661354) Visitor Counter : 267