గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

గిరిజన ఉత్పత్తులకు అతిపెద్ద మార్కెట్.గా ‘ట్రైబ్స్ ఇండియా ఈ-మార్కెట్ ప్లేస్’

ప్రారంభించిన కేంద్ర మంత్రి అర్జున్ ముండా కోల్కతా, రుషీకేశ్ లలో రెండు కొత్త ఔట్ లెట్లు ప్రారంభం
పహాడియా గిరిజన తెగల ఉత్పాదన పాకూర్ తేనె విక్రయం కూడా మెదలు

Posted On: 02 OCT 2020 3:13PM by PIB Hyderabad

   “ గిరిజనుల హస్తకళా ఉత్పాదనలకు, సేంద్రియ ఉత్పత్తులకు దేశంలోనే అతిపెద్ద ఈ -మార్కెట్ వేదిక ట్రైబ్స్ ఇండియా. గిరిజనుల జీవితాలను, జీవనోపాధిని గొప్ప మలుపు తిప్పేలా ట్రైబ్స్ ఇండియా చొరవ చూపించింది. కరోనా మహమ్మారి ప్రబలినప్పటికీ, గిరిజనుల సామాజిక ఆర్థికాభివృద్ధి అనే ప్రధాన లక్ష్య సాధనకే  భారతీయ గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమాఖ్య (ట్రైఫెడ్) యుద్ధవీరులు పనిచేస్తూ వచ్చారు. గిరిజనుల జీవితాల్లో కొత్త తరహా సాధారణ పరిస్థితులు నెలకొనేలా ట్రైఫెడ్ కృషి చేసింది.” కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా చేసిన వ్యాఖ్యలివి. ట్రైబ్స్ ఇండియా  కొత్తగా రూపొందించిన ఈ-మార్కెట్ వేదిక market.tribesindia.comను ప్రారంభించిన సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 2020 అక్టోబరు 2న ఆన్ లైన్ ద్వారా  ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద దేశాన్ని స్వావలంబన దిశగా తీసుకువెళ్లాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా ట్రైబ్స్ ఇండియా ఈ-మార్కెట్ వేదికను రూపొందించింది.

   ట్రైబ్స్ ఇండియా ఈ-మార్కెట్ ప్లేస్ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కేంద్ర గిగిజన వ్యవహారాల సహాయ మంత్రి రేణుకా సింగ్, చత్తిస్ గఢ్ గ్రామీణ పరిశ్రమల శాఖ మంత్రి రుద్రకుమార్, గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి దీపక్ ఖండేకర్ సమక్షంలో నిర్వహించారు. ట్రైఫెడ్ చైర్మన్ రమేశ్ చంద్ మీనా, మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీర్ కృష్ణ, మంత్రిత్వ శాఖ, ట్రైఫెడ్ ల సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.  

  ఈ సందర్భంగా గిరిజన సోదరులకు అండగా ట్రైఫెడ్ చేపట్టిన పలు కార్యక్రమాలను కూడా కేంద్ర మంత్రి అర్జున్ ముండా లాంఛనంగా ప్రారంభించారు. రుషీకేశ్ లో ట్రైబ్స్ ఇండియా 123వ దుకాణాన్ని, కోల్కతాలో 124వ అవుట్ లెట్ ను ఆయన ప్రారంభించారు. జార్ఖండ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలనుంచి రెండు కొత్త ఉత్పాదనల చేరికను కూడా లాంఛనంగా ప్రకటించారు. గిరిజన ఉత్పాదనల విక్రయ కార్యక్రమంలో భాగంగా అమెజాన్ సంస్థతో ట్రైఫెడ్, ట్రైబ్స్ ఇండియా భాగస్వామ్యాన్ని ప్రకటించారు. జార్ఖండ్ లోని పాకూర్ ప్రాంతపు వందశాతం సహజసిద్ధమైన తాజా అటవీ ఉత్పత్తి అయిన తేనె విక్రయాన్ని ప్రారంభించారు. జార్ఖండ్ లోని పహాడియా తెగలవారు ఈ తేనెను ఉత్పత్తి చేస్తారు. ట్రైఫెడ్ కోసం వారు 3 టన్నుల పాకూరు తేనెను ఉత్పత్తి చేశారు.

  ఈ సందర్భంగా అర్జున్ ముండా మాట్లాడుతూ,..దేశవ్యాప్తంగా తయారైన వివిధ రకాలైన హస్తకళా ఉత్పాదనలు, చేనేతలు, సహజసిద్ధమైన ఆహార ఉత్పాదనలతో, 5లక్షలమంది గిరిజన ఉత్పత్తి దారులకు విక్రయ వేదిక కల్పించేందుకు ట్రైఫెడ్ కొత్త ఈ-మార్కెట్ వేదికను రూపొందించిందని అన్నారు. సొంతంగా పనిచేసుకునే గిరిజన హస్తకళాకారులు, గిరిజన స్వయం సహాయక బృందాలు, సంస్థలు, ఏజెన్సీలు, గిరిజనులకోసం పనిచేసే స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ విక్రయ వేదికకు సరఫరాదార్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు.  

  గిరిజన, ఆదివాసీలు, హస్తకళాకారులు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం కావడానికి వీలుగా ట్రైఫెడ్ సంస్థ గిరిజన ఉత్పత్తులను, హస్తకళా ఉత్పాదనలను ఈ మార్కెట్ వేదిక ద్వారా ప్రదర్శిస్తోందని మంత్రి చెప్పారు. కోల్కతా, రుషీకేశ్ ప్రాంతాల్లో కొత్త ట్రైబ్స్ ఇండియా అవుట్ లెట్లు ప్రారంభం కావడం సంతోషదాయకమని కేంద్ర మంత్రి అన్నారు. పలు రకాలైన పూవులనుంచి తేనేటీగలు కూడబెట్టిన తేనెను గిరిజనులు సేకరిస్తారు. ఈ పాకూర్ తేనె వందశాతం సహజమైన అటవీ ఉత్పాదన అని మంత్రి అన్నారు.

   ట్రైఫెడ్ చైర్మన్ రమేశ్ చంద్ర మీనా, గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి దీపక్ ఖండేకర్, ట్రైఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీర్ కృష్ణ, ఈ సందర్భంగా ప్రసంగించారు.

   ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ తో ట్రైబ్స్ ఇండియా కుదుర్చుకున్న సెల్లర్ ఫ్లెక్స్ ప్రోగ్రాం భాగస్వామ్య ఒప్పందంతో, ట్రైబ్స్ ఇండియా ఉత్పత్తులను దేశంలోను, ప్రపంచ మార్కెట్ లోనూ విక్రయం జరిపేందుకు అమెజాన్ సంస్థ సహకారం అందిస్తూ వస్తోంది. ఉత్పత్తులను గిడ్డంగుల్లో నిల్వచేయడం,  అమ్మకం జరిపే ఉత్పాదనల జాబితాను తయారీ చేయడం, కొనుగోలు దారుల వద్దకు ఉత్పత్తులను రవాణాచేయడం వంటి రంగాల్లో అమెజాన్ అనుసరిస్తున్న ఉత్తమ విధానాలతో ట్రైబ్స్ ఇండియా పాలుపంచుకుంటోంది. ఈ ఒప్పందం ప్రకారం ట్రైబ్స్ ఇండియా సరుకులను, ఉత్పాదనలను అమెజాన్ గిడ్డంగులకు రవాణా చేసేందుకు అయ్యే ఖర్చు కనీస స్థాయిలో ఉంటుంది. దీనితో మన హస్తకళాకారులు, చేతిపని వస్తువుల ఉత్పత్తిదారులకు, అమ్మకం దార్లకు తాము పంపించే వస్తువుల జాబితాపై నియంత్రణ ఉంటుంది. ట్రైబ్స్ ఇండియాతో భాగంగా ఉంటున్న వేలాది మంది హస్తకళాకారులకు సాధికారత కల్పించేందుకు అమెజాన్ సంస్థ సహకారం ఎంతగానో ఉపకరిస్తోంది.

*****



(Release ID: 1661093) Visitor Counter : 230