ఆయుష్
పుణెలో ఔషధ మొక్కల ఆర్‌సీఎఫ్‌సీ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఆయుష్ మంత్రిత్వ శాఖ
Posted On:
01 OCT 2020 1:32PM by PIB Hyderabad
ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ ఔషధ మొక్కల బోర్డ్ (ఎన్ఎంపీబీ) యొక్క పశ్చిమ ప్రాంతపు రీజినల్ కమ్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను (ఆర్‌సీఎఫ్‌సీ) ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వైద్య రాజేష్ కోటేచా ప్రారంభించారు. సావిత్రిబాయి పూలే, పుణె విశ్వవిద్యాలయం
వద్ద ఏర్పాటు చేసిన ఆర్‌సీఎఫ్‌సీని రాజేష్ కోటేచా సెప్టెంబరు 29వ తేదీన జరిగిన ఒక వర్చువల్ కార్యక్రమంలో ప్రారంభించారు. బీహార్‌లోని నలంద విశ్వవిద్యాలయం ఉపకులపతి, పద్మభూషణ్ డాక్టర్ విజయ్ భట్కర్; ఎన్ఎంపీబీ - పశ్చిమ ప్రాంతపు రీజినల్ కమ్ ఫెసిలిటేషన్ కేంద్రానికి
సమన్వయకర్త మరియు బోటనీ విభాగం అధినేత ప్రొఫెసర్ డాక్టర్ ఎ.బి.అడే; ఎన్‌ఎమ్‌పీబీ సీఈవో డాక్టర్ జె.ఎల్.శాస్త్రి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ కోటేచా మాట్లాడుతూ ఔషధ మొక్కల పెంపకం విషయమై ఎన్‌ఎమ్‌పీబీ లక్ష్యాలను పూర్తి చేయడంలో ఆర్‌సీఎఫ్‌సీల పాత్రను గురించి ప్రధానంగా నొక్కి చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ పై రాబోయే ప్రాజెక్టులో ఔషధ మొక్కల సాగును ప్రోత్సహించడంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ చేస్తున్న కృషిని ఆయన వివరించారు. ఇప్పటివరకు, దేశంలోని వివిధ ప్రాంతాలలో ఔషధ మొక్కలపై పని చేస్తున్న కొన్ని ప్రధాన సంస్థలు / విశ్వవిద్యాలయాలలో ఎన్‌ఎమ్‌పీబీ 2017-18 నుండి ఇలాంటి ఆరు ప్రాంతీయ మరియు ఫెసిలిటేషన్ సెంటర్లను (ఆర్‌సీఎఫ్‌సీ) ఏర్పాటు చేసింది. ఎంఎన్‌పీబీ యొక్క విస్తరణ విభాగంగా ఉన్న ఆర్‌సీఎఫ్‌సీ రాష్ట్ర ఔషధ మొక్కల బోర్డ్ (ఎస్‌ఎమ్‌పీబీ) / రాష్ట్ర అటవీ శాఖ / వ‌్యవసాయ / ఉద్యానవన శాఖ వంటి వాటి వివిధ రాష్ట్రా స్థాయి సంస్థల సౌజన్యంతో వివిధ పథకాలను అమలు చేస్తోంది. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ పశ్చిమ ప్రాంతపు ఆర్‌సీఎఫ్‌సీ - గోవా, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, దాద్రా & నగర్ హవేలి, మరియు డామన్ & డయ్యూ రాష్ట్రాలు / యుటీలలో ఎన్‌ఎమ్‌పీబీ కార్యకలాపాలను అమలు చేయడంతో పాటు సమన్వయపరుస్తుంది. ఈ కేంద్రం వివిధ ఆయుష్ ఫార్మసీల ద్వారా మార్కెట్ అప్-లింకింగ్‌తో పాటు పరిరక్షణ మరియు సాగు కార్యకలాపాలను సులభతరం చేస్తుంది.
***
(Release ID: 1660647)
Visitor Counter : 192