విద్యుత్తు మంత్రిత్వ శాఖ

2020-21 సంవత్సర‌పు లక్ష్యాలను వివరిస్తూ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ‌తో ఎస్‌జేవీఎన్ అవ‌గాహ‌న ఒప్పందం

-‘ఎక్స‌లెంట్‌’ కేటగిరీ కింద సంవత్సరంలో 9680 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించాలని కేంద్ర పిఎస్‌యు లక్ష్యంగా పెట్టుకుంది

- ‘ఎక్స‌లెంట్‌’ కేటగిరీ కింద రూ.2880 కోట్ల క్యాపెక్స్ ల‌క్ష్యం, రూ.2800 కోట్ల ట‌ర్నోవ‌ర్ లక్ష్యం కూడా ఎంఓయూలో భాగంగా చేర్చ‌బ‌డింది

Posted On: 30 SEP 2020 4:40PM by PIB Hyderabad

2020-21 సంవత్సరానికి సంబంధించి ఎస్‌జేవీఎన్ లిమిటెడ్ భార‌త ప్ర‌భుత్వంతో ఒక అవగాహన ఒప్పందంను(ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం పైన‌ కేంద్ర విద్యుత్తు శాఖ కార్య‌ద‌ర్శి శ్రీ ఎస్.ఎన్.సహాయ్, ఎస్‌జేవీఎన్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నంద్‌ లాల్ శర్మలు సంత‌కం చేశారు. వీసీ (వీడియో కాన్ఫ‌రెన్సింగ్) విధానంలో ఈ ఒప్పందం కుదుర్చుకునే కార్య‌క్ర‌మ‌ము జ‌రిగింది.


ఎంఓయూలో నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం, ఎస్‌జేవీఎన్ సంస్థ ఈ సంవత్సరంలో ‘ఎక్స‌లెంట్‌’ కేటగిరీ కింద 9680 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ ఉత్పత్తిని సాధించడానికి కృషి చేస్తుంది. కార్యాచరణ సామర్థ్యంతో పాటు ప్రాజెక్ట్ పర్యవేక్షణ కు సంబంధించిన ఇతర లక్ష్యాలతో పాటు ‘ఎక్స‌లెంట్‌’ క్యాటగిరీ కింద రూ.2880 కోట్ల క్యాపెక్స్ ల‌క్ష్యం, రూ.2800 కోట్ల ట‌ర్నోవ‌ర్ ల‌క్ష్యాన్ని ఎంఓయూ ప్ర‌కారం ఎస్‌జేవీఎన్ సాధించాల్సి ఉంటుంది. శ్రీమతి గీతాక‌పూర్, డైరెక్టర్ (పర్సనల్),
ఎస్.పి.బన్సాల్, డైరెక్టర్ (సివిల్), ఎ.కె. సింగ్, డైరెక్టర్ (ఫైనాన్స్), మరియు
సుశీల్ శర్మ, డైరెక్టర్ (ఎలక్ట్రికల్)తో పాటుగా.. ఎస్‌జేవీఎన్‌కు చెందిన ఇతర సీనియర్ అధికారులు కూడా ఈ ఒప్పందంపై సంత‌కం చేసే కార్య‌క్ర‌మంలో హాజరయ్యారు. 2016 మెగావాట్ల వ్యవస్థాపిత సామర్థ్యంతో ఎస్‌జేవీఎన్ సంస్థ త‌న వాటాదారుల‌కు 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను ఇప్ప‌టికే రూ.864.56 కోట్ల డివిడెండ్‌ను చెల్లించిం‌ద‌ని  ఈ స‌మావేశం సంద‌ర్భంగా శ్రీ నంద్‌లాల్ శ‌ర్మ కేంద్ర విద్యుత్ శాఖ కార్య‌ద‌ర్శికి వివరించారు. అంత‌కు ముందు సంవ‌త్స‌రం సంస్థ రూ.844.91 కోట్ల మేర డివిడెండ్‌ను చెల్లించి‌నట్టుగా తెలిపారు. దీనికి తోడు ఎస్‌జేవీఎన్ సంస్థ గుజ‌రాత్ ఊర్జా నిఘ‌మ్ లిమిటెడ్ (జీయువీఎన్ఎల్‌)  నుండి రెండు సౌర విద్యుత్ ప్రాజెక్టుల్ని సొంతం చేసుకున్న‌ట్టుగా వివ‌రించింది.  
ఇందులో 100 మెగావాట్ల ధోలేరా సౌర విద్యుత్ ప్రాజెక్టు మ‌రియు 100 మెగావాట్ల రాఘనేస్డా సౌర విద్యుత్ ప్రాజెక్టు ఉన్న‌ట్టుగా తెలిపారు. వీటి టారీఫ్ వ‌రుస‌గా యూనిట్‌కు రూ.2.80, రూ.2.73గా ఉన్న‌ట్టుగా తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌తో పాటుగా నేపాల్, భూటాన్‌ల‌లో ఎస్‌జేవీఎన్ సంస్థ మొత్తం 13
(పదమూడు) జల ప్రాజెక్టులను అమలు చేస్తున్నట్టుగా కూడా శ్రీ నందల్ లాల్ శర్మ తెలియజేశారు. వీటితో పాటు బీహార్‌లో 1320 మెగావాట్ల బక్సర్ థర్మల్ పవర్ ప్రాజెక్టును కూడా ఎస్‌జేవీఎన్ నిర్వ‌హిస్తోంది. ఎస్‌జేవీఎన్ భారతదేశంలో మరియు పొరుగు దేశాలలో విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు అవ‌కాశం విష‌యాన్ని ప‌రిశీలిస్తోంది. నేపాల్‌, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌ల‌లో అందుబాటులో ఉన్న జ‌ల సామ‌ర్థ్యంను స‌ద్వినియోగం చేసుకొంటూ వివిధ ప్రాంతాల‌లో విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకున్న అవ‌కాశాల్ని సంస్థ ప‌రిశీలిస్తోంద‌న్నారు. ఎస్‌జేవీఎన్ బృందంపై త‌న‌కు ఉన్న విశ్వాసాన్ని పునరుద్ఘాటించిన శ‌ర్మ‌.. 2023 నాటికి 5000 మెగావాట్లు, 2030 నాటికి 12,000 మెగావాట్లు, 2040 నాటికి 25,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని సాధించడానికి ఎస్‌జేవీఎన్ తీవ్రంగా కృషి చేస్తూ ముందుకు సాగుతోందని అన్నారు. 

***

 



(Release ID: 1660452) Visitor Counter : 104