ప్రధాన మంత్రి కార్యాలయం

భారతదేశం- శ్రీ లంక వర్చువల్ ద్వైపాక్షిక శిఖర సమ్మేళనం లో ప్రధాన మంత్రి ప్రారంభోపన్యాసం

Posted On: 26 SEP 2020 5:36PM by PIB Hyderabad

శ్రేష్ఠులు ప్రధాని శ్రీ మహిందా రాజపక్ష,
నమస్కారం.

ఆయుబోవాన్,

వణక్కమ్

ఎక్స్ లెన్సి,

ఈ వర్చువల్ శిఖర సమ్మేళనానికి మీకు ఇదే సాదర స్వాగతం. ఎప్పటి మాదిరిగానే, మీరు మీ ప్రథమ ఆధికారిక సందర్శన కు భారతదేశానికి విచ్చేస్తే మీకు స్వాగతం పలికేందుకు మేమెంతో సంతోషిస్తాం.  ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే, మనం ఇలా వర్చువల్ శిఖర సమ్మేళనాన్ని నిర్వహించుకొంటున్నందుకు నాకు ఆనందంగా ఉంది. ఈ శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోవలసిందిగా నేను మిమ్మల్ని ఆహ్వానించినంతనే అందుకు మీరు మీ ఆమోదాన్ని తెలియజేసినందుకు మీకు ఇవే నా ధన్యవాదాలు. 

ప్రధాని పదవీబాధ్యతల్ని స్వీకరించిన మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. పార్లమెంటరీ ఎన్నికల్లో ఎస్ఎల్ పిపి చాలా పెద్ద విజయాన్ని సాధించినందుకు మీకు మరోసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మీ నాయకత్వం పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని ఈ చరిత్రాత్మకమైన విజయం తెలియజేస్తోంది.  భారతదేశానికి, శ్రీ లంక కు మధ్య అనేక రంగాల్లో ఉన్న సంబంధాలు వేల సంవత్సరాల నాటివి. మేము అనుసరిస్తున్న నైబర్ హుడ్ ఫస్ట్ విధానం, నా ప్రభుత్వం పాటిస్తున్న ఎస్ఎజిఎఆర్ సిద్ధాంతం లలో భాగంగా, శ్రీ లంక తో సంబంధాలకు మేము పెద్ద పీట వేస్తున్నాము.  బిఐఎమ్ఎస్ టిఇసి, ఐఒఆర్ఎ, ఎస్ఎఎఆర్ సి వేదికల్లో కూడా భారతదేశం, శ్రీ లంక సన్నిహితంగా సహకరించుకొంటున్నాయి.

మీ పార్టీ ఇటీవల విజయాన్ని సాధించిన తరువాత, భారతదేశం- శ్రీలంక సంబంధాల్లో ఒక కొత్త చరిత్రాత్మక అధ్యాయాన్ని జోడించే గొప్ప అవకాశం లభించింది.  రెండు దేశాల ప్రజలు కొత్త ఆశలతో, కొత్త ఉత్సాహం తో మన వైపు చూస్తున్నారు. మీరు అందుకొన్న ఘనమైన ప్రజాతీర్పు తో పాటు మీ విధానాలకు పార్లమెంట్ నుంచి లభించిన బలమైన మద్దతు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని రంగాల్లో పురోగతి కోసం కృషి చేయడానికి మనకు సహాయపడతాయని నేను నమ్ముతున్నాను.

ఇక, ప్రధాని శ్రీ రాజపక్ష గారిని వారి ప్రారంభోపన్యాసాన్ని ఇవ్వవలసింది గా నేను కోరుతున్నాను.

అస్వీకరణ: ఇది స్థూల అనువాదం.  మూల ప్రసంగం హిందీ భాష లో ఉంది.


 

***


(Release ID: 1659391) Visitor Counter : 198