ఆర్థిక మంత్రిత్వ శాఖ

సి.బి.డి.టి. ఈ రోజు పరోక్ష అప్పీళ్ళ విధానాన్ని ప్రారంభించింది - నిజాయితీకి గౌరవం

Posted On: 25 SEP 2020 3:29PM by PIB Hyderabad

పరోక్ష ఆదాయపు పన్ను అప్పీళ్ళను ఆదాయపు పన్ను శాఖ ఈరోజు ప్రారంభించింది.  పరోక్ష అప్పీళ్ళ కింద, అన్ని ఆదాయపు పన్ను విజ్ఞప్తులు ప్రత్యక్షంగా సమర్పించనవసరం లేని, పరోక్ష పర్యావరణ వ్యవస్థ ద్వారా ఖరారు చేయబడతాయి.  అయితే, ఈ విధానం నుండి - తీవ్రమైన మోసాలు, ప్రధాన పన్ను ఎగవేత, సున్నితమైన మరియు శోధన విషయాలు, అంతర్జాతీయ పన్ను, బ్లాక్ మనీ చట్టానికి సంబంధించిన అప్పీళ్ళను మినహాయించారు.  అవసరమైన గెజిట్ నోటిఫికేషన్ కూడా ఈ రోజు జారీ చేయబడింది.

“పారదర్శక పన్నులు - నిజాయితీని గౌరవించడం” వేదికలో భాగంగా ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ మరియు పన్ను చెల్లింపుదారులు చార్టర్‌ను గౌరవనీయ ప్రధానమంత్రి 2020 ఆగష్టు, 13వ తేదీన ప్రారంభించే సమయంలో మాట్లాడుతూ, 2020 సెప్టెంబర్, 25వ తేదీన, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా "ఫేస్ లెస్ అప్పీళ్ళ"ను ప్రారంభించనున్నట్లు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి.   అలాగే, పన్ను ప్రక్రియల సరళీకరణ కోసం మరియు పన్ను చెల్లింపుదారులకు సమ్మతి కోసం, ఆదాయపన్ను శాఖ, ఇటీవలి సంవత్సరాలలో, ప్రత్యక్ష పన్నులలో అనేక సంస్కరణలను చేపట్టింది. 

ఫేస్ లెస్ అప్పీళ్ళ క్రింద, ఇప్పటి నుండి, ఆదాయపు పన్ను అప్పీళ్ళలో, అప్పీల్ యొక్క ఇ-కేటాయింపు, నోటీసు / ప్రశ్నాపత్రం యొక్క ఈ-కమ్యూనికేషన్, ఈ-ధృవీకరణ / ఈ-విచారణ నుండి ఈ-వాదనలు మరియు చివరకు అప్పీలేట్ యొక్క ఈ-కమ్యూనికేషన్ నుండి ప్రతి విషయం ఆదేశాలు, అప్పీల్ యొక్క మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్ ‌లోనే ఉంటుంది, అప్పీలుదారు మరియు సంబంధిత విభాగం మధ్య ఏవిధమైన భౌతిక ముఖాముఖీ అవసరం ఉండదు.  పన్ను చెల్లింపుదారులు లేదా వారి న్యాయవాదులు మరియు ఆదాయపు పన్ను శాఖ మధ్య భౌతిక ముఖాముఖీ సంప్రదింపులు ఉండవు.  పన్ను చెల్లింపుదారులు తమ ఇంటి వద్ద నుండి సౌకర్యంగా తమ పత్రాలను దాఖలు చేయవచ్చు. తద్వారా వారి సమయాన్ని, వనరులను ఆదా చేయవచ్చు.

ఫేస్ లెస్ అప్పీళ్ళ వ్యవస్థలో డాక్యుమెంట్ గుర్తింపు సంఖ్య (డి.ఐ.ఎన్) ఉన్న నోటీసుల కేంద్ర జారీతో డైనమిక్ అధికార పరిధిలోని సమాచార విశ్లేషణ మరియు ఎ.ఐ ద్వారా కేసుల కేటాయింపు ఉంటుంది.  డైనమిక్ అధికార పరిధిలో భాగంగా, ముసాయిదా అప్పీలేట్ ఆర్డర్ ఒక నగరంలో తయారు చేయబడుతుంది, మరొక నగరాల్లో సమీక్షించబడుతుంది, దీని ఫలితంగా అప్పీళ్ళలో,  సరసమైన మరియు న్యాయమైన విధానం ఉంటుంది.  ఫేస్ లెస్ అప్పీల్ పన్ను చెల్లింపుదారులకు గొప్ప సౌలభ్యాన్ని అందించడంతో పాటు, న్యాయమైన మరియు సరసమైన అప్పీల్ ఆర్డర్లను కూడా నిర్ధారిస్తుంది మరియు ఏవైనా వ్యాజ్యాన్ని తగ్గించగలదు.  ఆదాయం పన్ను శాఖ పనితీరులో ఎక్కువ సామర్థ్యం, పారదర్శకత, జవాబుదారీతనం ఇవ్వడంలో కూడా కొత్త వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది.

సి.బి.డి.టి. వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ రోజు వరకు ఆదాయపన్ను శాఖ లోని కమిషనర్ (అప్పీళ్ళు) స్థాయిలో దాదాపు 4.6 లక్షల విజ్ఞప్తులు పెండింగ్‌లో ఉన్నాయి.  వీటిలో, సుమారు 4.05 లక్షల అప్పీళ్ళు, అనగా, మొత్తం అప్పీళ్ళలో 88 శాతం ఫేస్ ‌లెస్ అప్పీల్ యంత్రాంగం కింద చేపట్టడానికి అవకాశం ఉంది.  అదేవిధంగా, ఫేస్‌ లెస్ అప్పీల్ యంత్రాంగం కింద కేసులను పరిష్కరించడానికి కమిషనర్ (అప్పీళ్ళు) యొక్క ప్రస్తుత సిబ్బందిలో దాదాపు 85 శాతం మందిని ఉపయోగించుకోవచ్చు. 

*****


(Release ID: 1659189) Visitor Counter : 241