ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 తాజా పరిస్థితి
భారతదేశం మొత్తం సగటు లో 14 రాష్ట్రాలు/యుటిలలో అధిక టీపీఎం, తక్కువ పాజిటివ్ కేసులు
74% కేసులు 10 రాష్ట్రాలు/యుటిలలోనే కేంద్రీకృతమై ఉన్నాయి
प्रविष्टि तिथि:
23 SEP 2020 1:20PM by PIB Hyderabad
భారతదేశ పరీక్ష సామర్థ్యం రోజువారీ 12 లక్షల పరీక్షలకు పైగా చేరుకుంది. దేశవ్యాప్తంగా మొత్తం 6.6 కోట్ల కంటే ఎక్కువ పరీక్షలు జరిగాయి. అధిక స్థాయి పరీక్షలు జరగడం వల్ల పాజిటివ్ కేసులను ముందుగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. చివరికి పాజిటివ్ రేటు తగ్గుతుందన్నది మనకున్న ఆధారాల బట్టి అర్థం వవుతుంది. భారతదేశం చాలా ఎక్కువ పరీక్షల పరంపర సాగుతుండగా, 14 రాష్ట్రాలు/యుటిలు అధిక టెస్ట్ పర్ మిలియన్ (టిపిఎం) తో మెరుగైన కోవిడ్ ప్రతిస్పందనను ప్రదర్శించాయి, జాతీయ సగటు కంటే తక్కువ పాజిటివ్ రేటును కలిగి ఉన్నాయి. సంచిత పాజిటివ్ రేటు 8.52%, టెస్ట్ పర్ మిలియన్ ఈ రోజు 48,028 వద్ద ఉంది.

దేశంలో గత 24 గంటల్లో మొత్తం 83,347 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా ధృవీకరించబడిన కేసులలో 74%, 10 రాష్ట్రాలు / యుటిలలో కేంద్రీకృతమై ఉన్నాయి. మహారాష్ట్ర మాత్రమే 18,000 కన్నా ఎక్కువ కేసులు నమోదయ్యాయి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో వరుసగా 7,000, 6,000 కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 1,085 మరణాలు నమోదయ్యాయి.
కోవిడ్ కారణంగా గత 24 గంటల్లో 83% మరణాలు 10 రాష్ట్రాలు / యుటిలలో ఉన్నాయి. మహారాష్ట్ర 392 మరణాలను నివేదించింది, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్ లో వరుసగా 83 మరియు 77 మరణాలు సంభవించాయి.

****
(रिलीज़ आईडी: 1658183)
आगंतुक पटल : 225