ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
అత్యధిక కొవిడ్ రికవరీల సరళిని కొనసాగిస్తున్న భారత్
వరుసగా ఐదో రోజూ కొత్త కేసుల సంఖ్యను దాటిన కొత్తగా కోలుకున్నవారి సంఖ్య
కోలుకుంటున్నవారి శాతంలో కొనసాగుతున్న వృద్ధి, 81 శాతం దాటిన నమోదు
Posted On:
23 SEP 2020 11:00AM by PIB Hyderabad
కేంద్రీకృత వ్యూహాలు, సమర్థవంత, సమన్వయ, చురుకైన చర్యల కారణంగా, కొవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య భారత్‌లో గణనీయంగా పెరుగుతోంది. వరుసగా ఐదోరోజు కూడా, కోలుకున్నవారి సంఖ్య రికార్డు స్థాయిలో నమోదైంది. గత 24 గంటల్లో 89,746 మంది దేశవ్యాప్తంగా కోలుకోగా, కొత్తగా వచ్చిన కేసుల సంఖ్య 83,347గా నమోదైంది. దీంతో కలిపి మొత్తం కోలుకున్నవారి సంఖ్య 45,87,613, శాతం 81.25కు చేరింది.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారత్‌లోనే ఎక్కువ రికవరీలు నమోదవుతున్నాయి. ప్రపంచ మొత్తం రికవరీల్లో ఇది 19.5 శాతం. దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య కంటే, కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా నమోదవుతున్నందున, చాలా రాష్ట్రాలు/యూటీల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. 17 రాష్ట్రాలు/యూటీల్లో కొత్త కేసుల కంటే, కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది.
కొత్తగా కోలుకున్నవారి సంఖ్యలో 75 శాతం.. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, దిల్లీ, కేరళ, పశ్చిమబెంగాల్, హర్యానా నుంచి నమోదయ్యాయి. 20 వేలకు మించిన కొత్త రికవరీలతో, మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజులో 10 వేలకు మించిన రికవరీలు కొనసాగుతున్నాయి.
***
(Release ID: 1658162)
Visitor Counter : 187