ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోలుకున్నవారి సంఖ్యలో అమెరికాను మించిపోయిన భారత్
42 లక్షలకు పైబడ్డ కోలుకున్నవారి సంఖ్య, ప్రపంచంలో 19% వాటా
ఒకేరోజు అత్యధికంగా కోలుకున్న సంఖ్య రీత్యా భారత్ సరికొత్త రికార్డు
గడిచిన 24 గంటల్లో కోలుకున్నవారు 95,000 పైగానే
Posted On:
19 SEP 2020 11:00AM by PIB Hyderabad
కోవిడ్ నుంచి కోలుకునవారి సంఖ్య దృష్ట్యా భారత్ చరిత్రాత్మకంగా అంతర్జాతీయ స్థాయిలో తన హోదా పెంచుకుంది, అమెరికాలో కంటే భారత్ లోనే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఒక అద్వితీయ సాధనగా మిగిలింది.
అత్యధికంగా భారత్ లో 42 లక్షలమందికి పైగా (42,08,431) కోవిడ్ బాధితులు కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావటమో, ఐసొలేషన్ నుంచి విముక్తి కావటమో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కోలుకున్నవారిలో భారత్ వాటా దాదాపు 19% గా నిలిచింది. దీంతో ఇప్పుడు దాదాపుగా 80% (79.28%) మంది కోలుకున్నట్టయింది.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక క్రమపద్ధతిలో చేపట్టిన సమర్థవంతమైన చర్యలఫలితంగా బాధితులను తొలిదశలోనే గుర్తించటం, దూకుడుగా పరీక్షల సంఖ్య పెంచటం, నిఘా పెంచి వ్యాధి సోకినట్టు అనుమానమున్నవారిని గుర్తించటం, ప్రామాణీకరించిన నాణ్యమైన చికిత్స అందించటం ఈ అంతర్జాతీయ స్థాయి సాధనకు దారితీశాయి.
కోవిడ్ మీద పోరులో తిరుగులేని విజయం సాధించాలన్న పట్టుదలతో సాగుతున్న భారత్ లో ఒకే రోజులో పెద్ద సంఖ్యలో కోలుకున్నవారు నమోదు కావటం మరో మైలురాయి. 24 గంటలలో 95,880 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు.
కొత్తగా కోలుకున్నవారిలో 90% మంది 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారే.
కొత్తగా కోలుకున్న కేసులలో దాదాపు 60% ఐదు రాష్ట్రాల నుంచే ( మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఉత్తరప్రదేశ్ ) నమోదు కావటం గమనార్హం.
ఒక రోజులో మహారాష్ట్ర లో 22,000 మందికి పైగా కోలుకోగా ఆంధ్రప్రదేశ్ లో11,000 కు పైగా (12.3%) కోలుకున్నారు.
మొత్తం కోలుకున్నవారిలో 90% మంది 15రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారే.
అత్యధిక సంఖ్యలో చికిత్సపొందుతున్న కోవిడ్ బాధితులు అత్యధిక సంఖ్యలో ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలే అత్యధికంగా కోలుకున్నవారి సంఖ్యాపరంగా కూడా ముందున్నాయి.
భారతదేశం స్థిరమైన బాటలో సాగుతూ అత్యధిక సంఖ్యలో కేసులు కోలుకోవటాన్ని నమోదు చేయగలిగింది. వ్యూహం మీద దృష్టి సారించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సమన్వయంతో పనిచేయటం వలన ఇది సాధ్యమైంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ మంత్రిత్వశాఖ ఎప్పటికప్పుడు ప్రామాణిక చికిత్సావిధానాలు, చికిత్సా నియమాలు జారీచేస్తూ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్న అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకుంటూ ఈ నియమాలను సవరించుకుంటూ, పటిష్టపరుస్తూ వచ్చింది. ప్రయోగాత్మకంగా చేసే చికిత్సలో వాడే రెమిడిసెవిర్ లాంటి ఔషధాలు, ప్లాస్మా వాడకానికి భారత్ అనుమతించింది. ఆక్సిజెన్ వాడకంలో, వెంటిలేషన్ లో హేతుబద్ధమైన విధానాలను ప్రోత్సహించింది. స్టెరాయిడ్స్, యాంటీ కొయాగ్యులెంట్స్ వాడకం ద్వారా కోవిడ్ బాధితులు కోలుకునే అవకాశం వాడుకోవటానికి అనుమతించింది. స్వల్ప లక్షణాలున్న బాధితులు ఇంటిలోనే ఐసొలేషన్ లో ఉండేట్టు చూసి క్రమం తప్పకుండా వాళ్ల పరిస్థితిని సమీక్షించటం, బాధితులను సకాలంలో ఆస్పత్రులకు తరలించటానికి ఆంబులెన్స్ సౌకర్యాన్ని మెరుగుపరచటం, నిరాటంకంగా వైద్య సేవలు అందించటం, సమర్థవంతంగా బాధితులకు చికిత్స అందేలాచూడటం సత్ఫలితాలనిచ్చాయి.
రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతాలలో ఐసియులలో పనిచేసే డాక్టర్ల సామర్థ్యం, నైపుణ్యం పెంచటానికి, అనుమానాల నివృత్తికి న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్ "కోవిడ్ నిర్వహణమీద జాతీయ ఈ-ఐసియు" ద్వారా, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా కృషి చేస్తూ వచ్చింది. మంగళ, శుక్ర వారాల్లో వారానికి రెండుసార్లు ఇలాంటి సెషన్లు నిర్వహించటం వల్ల దేసవ్యాప్తంగా కోలుకుంటున్నవారి సంఖ్య పెంచగలిగారు. దీనివలన క్రమంగా మరణాల శాతం కూడా బాగా తగ్గుతూ వచ్చింది. అలాంటి 19 జాతీయ ఈ-ఐసియు లతో ఇప్పటివరకు 28 రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలలోని 249 ఆస్పత్రులకు సేవలందించగలిగారు.
రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందిస్తున్న సహాయాన్ని కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంది. అనేక ఉన్నత స్థాయి కేంద్ర నిపుణుల బృందాలను రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపింది. ఈ బృందాలు అక్కడ కరోనా నియంత్రణ, నిఘా, పరీక్షలు, సమర్థవంతమైన చికిత్సానిర్వహణ లాంటి అంశాలమీద సహకారం అందిస్తూ వచ్చాయి. ఆస్పత్రులు, వైద్య కేంద్రాలలో ఆక్సిజెన్ అందుబాటి లాంటి విషయాలను కూడా కేంద్రం క్రమం తప్పకుండా సమీక్షిస్తూ ఉంది. భారతదేశంలో కోలుకుంటున్నవారు అత్యధికంగా ఉండటానికి, మరణాల శాతం ఇప్పుడున్న అత్యల్పస్థాయిలో 1.61 శాతం గా ఉండటానికి కేంద్రం తీసుకున్న ఈ చర్యలు ఎంతో కీలపాత్ర పోషించాయి
సంఖ్య
|
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం
|
చికిత్సలో ఉన్న కేసులు
|
ధ్రువపడిన కేసులు
|
మొత్తం నయమైన/
డిశ్చార్జ్ అయిన కేసులు
|
మొత్తం మరణాలు
|
19.09.2020
నాటికి
|
19.09.2020
నాటికి
|
18.09.2020
నాటికి
|
నిన్నటి నుంచి మార్పులు
|
19.09.2020
నాటికి
|
18.09.2020
నాటికి
|
నిన్నటి నుంచి మార్పులు
|
19.09.2020
నాటికి
|
18.09.2020
నాటికి
|
నిన్నటి నుంచి మార్పులు
|
మొత్తం కేసులు
|
1013964
|
5308014
|
5214677
|
93337
|
4208431
|
4112551
|
95880
|
85619
|
84372
|
1247
|
1
|
మహారాష్ట్ర
|
301273
|
1167496
|
1145840
|
21656
|
834432
|
812354
|
22078
|
31791
|
31351
|
440
|
2
|
కర్నాటక
|
101148
|
502982
|
494356
|
8626
|
394026
|
383077
|
10949
|
7808
|
7629
|
179
|
3
|
ఆంధ్ర ప్రదేశ్
|
84423
|
609558
|
601462
|
8096
|
519891
|
508088
|
11803
|
5244
|
5177
|
67
|
4
|
ఉత్తరప్రదేశ్
|
67825
|
342788
|
336294
|
6494
|
270094
|
263288
|
6806
|
4869
|
4771
|
98
|
5
|
తమిళనాడు
|
46506
|
530908
|
525420
|
5488
|
475717
|
470192
|
5525
|
8685
|
8618
|
67
|
6
|
చత్తీస్ గఢ్
|
36580
|
81617
|
77775
|
3842
|
44392
|
41111
|
3281
|
645
|
628
|
17
|
7
|
కేరళ
|
35795
|
126381
|
122214
|
4167
|
90085
|
87345
|
2740
|
501
|
489
|
12
|
8
|
ఒడిశా
|
33092
|
171341
|
167161
|
4180
|
137567
|
133466
|
4101
|
682
|
669
|
13
|
9
|
ఢిల్లీ
|
32250
|
238828
|
234701
|
4127
|
201671
|
198103
|
3568
|
4907
|
4877
|
30
|
10
|
తెలంగాణ
|
30636
|
169169
|
167046
|
2123
|
137508
|
135357
|
2151
|
1025
|
1016
|
9
|
11
|
అస్సాం
|
28631
|
152858
|
150349
|
2509
|
123687
|
121613
|
2074
|
540
|
528
|
12
|
12
|
పశ్చిమ బెంగాల్
|
24509
|
218772
|
215580
|
3192
|
190021
|
187061
|
2960
|
4242
|
4183
|
59
|
13
|
పంజాబ్
|
21662
|
92833
|
90032
|
2801
|
68463
|
65818
|
2645
|
2708
|
2646
|
62
|
14
|
మధ్యప్రదేశ్
|
21605
|
100458
|
97906
|
2552
|
76952
|
74398
|
2554
|
1901
|
1877
|
24
|
15
|
హర్యానా
|
21291
|
106261
|
103773
|
2488
|
83878
|
81690
|
2188
|
1092
|
1069
|
23
|
16
|
జమ్మూకశ్మీర్ (కేంద్రపాలిత)
|
20770
|
61041
|
59711
|
1330
|
39305
|
38521
|
784
|
966
|
951
|
15
|
17
|
రాజస్థాన్
|
17717
|
111290
|
109473
|
1817
|
92265
|
90685
|
1580
|
1308
|
1293
|
15
|
18
|
గుజరాత్
|
16076
|
120336
|
118926
|
1410
|
100974
|
99681
|
1293
|
3286
|
3270
|
16
|
19
|
జార్ఖండ్
|
13924
|
68578
|
67100
|
1478
|
54052
|
52807
|
1245
|
602
|
590
|
12
|
20
|
బీహార్
|
12609
|
165218
|
164051
|
1167
|
151750
|
150040
|
1710
|
859
|
855
|
4
|
21
|
ఉత్తరాఖండ్
|
11293
|
38007
|
37139
|
868
|
26250
|
24965
|
1285
|
464
|
460
|
4
|
22
|
త్రిపుర
|
7107
|
21484
|
20949
|
535
|
14142
|
13559
|
583
|
235
|
228
|
7
|
23
|
గోవా
|
5730
|
27379
|
26783
|
596
|
21314
|
20844
|
470
|
335
|
327
|
8
|
24
|
పుదుచ్చేరి
|
4736
|
21913
|
21428
|
485
|
16715
|
16253
|
462
|
462
|
431
|
31
|
25
|
హిమాచల్ ప్రదేశ్
|
4430
|
11622
|
11190
|
432
|
7081
|
6946
|
135
|
111
|
98
|
13
|
26
|
చండీగఢ్
|
2978
|
9506
|
9256
|
250
|
6415
|
6062
|
353
|
113
|
109
|
4
|
27
|
మేఘాలయ
|
1976
|
4445
|
4356
|
89
|
2437
|
2342
|
95
|
32
|
31
|
1
|
28
|
మణిపూర్
|
1926
|
8607
|
8430
|
177
|
6629
|
6538
|
91
|
52
|
51
|
1
|
29
|
అరుణాచల్ ప్రదేశ్
|
1886
|
7005
|
6851
|
154
|
5106
|
4967
|
139
|
13
|
13
|
0
|
30
|
నాగాలాండ్
|
1213
|
5357
|
5306
|
51
|
4129
|
4098
|
31
|
15
|
15
|
0
|
31
|
లద్దాఖ్ (కేంద్రపాలిత)
|
987
|
3635
|
3576
|
59
|
2600
|
2558
|
42
|
48
|
46
|
2
|
32
|
మిజోరం
|
575
|
1548
|
1534
|
14
|
973
|
949
|
24
|
0
|
0
|
0
|
33
|
సిక్కిం
|
422
|
2303
|
2274
|
29
|
1857
|
1789
|
68
|
24
|
22
|
2
|
34
|
దాద్రా నాగర్ హవేలీ, డయ్యూ డామన్
|
218
|
2859
|
2831
|
28
|
2639
|
2608
|
31
|
2
|
2
|
0
|
35
|
అండమాన్ నికోబార్ దీవులు
|
165
|
3631
|
3604
|
27
|
3414
|
3378
|
36
|
52
|
52
|
0
|
36
|
లక్షదీవులు
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
***
(Release ID: 1656759)
Visitor Counter : 208
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam