ఆయుష్
భారతీయ వైద్య విధానం, హోమియోపతి వైద్య విద్యలో విప్లవాత్మకమైన పునరుద్ధరణ జరగబోతోంది
Posted On:
15 SEP 2020 12:15PM by PIB Hyderabad
ఆయుష్ మంత్రిత్వ శాఖకు సంబంధించిన రెండు ముఖ్యమైన బిల్లులను పార్లమెంటు ఆమోదించడంతో, భారతీయ వైద్య విధానం, హోమియోపతి వైద్య విద్యలో విప్లవాత్మక సంస్కరణలను తీసుకురావడానికి దేశం సన్నద్ధమవుతోంది.
భారతీయ వైద్య విధానం జాతీయ కమిషన్ బిల్లు, 2020, హోమియోపతి జాతీయ కమిషన్ బిల్లు 2020 ని లోక్‌సభలో సెప్టెంబర్ 14నఆమోదించారు. ఈ జంట బిల్లులు ప్రస్తుతం ఉన్న ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ యాక్ట్, 1970, హోమియోపతి సెంట్రల్ కౌన్సిల్ యాక్ట్, 1973 స్థానంలో పొందుపరిచారు. రాజ్యసభ ఇప్పటికే రెండు బిల్లులను 18, మార్చి, 2020 న ఆమోదించింది. ఈ బిల్లులకు పార్లమెంటు ఆమోదం పొందడం ఆయుష్ చరిత్రలో ఒక మైలురాయి. ఈ బిల్లుల చట్టం ప్రస్తుతమున్న సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ (సిసిఐఎం), సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతిని పునరుద్ధరిస్తుంది.
భారతీయ వైద్య విధానం జాతీయ కమిషన్ బిల్లు, 2020, హోమియోపతి జాతీయ కమిషన్ బిల్లు 2020 ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్ మరియు హోమియోపతి వైద్య విద్యలో సంస్కరణలను తీసుకొస్తాయని భావిస్తున్నారు.
నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్ బిల్లు, 2019, నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి బిల్లు, 2019 రాజ్యసభలో జనవరి 7 న ప్రవేశపెట్టారు. ఈ రెండు బిల్లులను తరువాత ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై పార్లమెంటరీ స్థాయి సంఘానికి సూచించారు. కమిటీ బిల్లులను పరిశీలించి, జాతీయ వైద్య కమిషన్ చట్టం, 2019 కు అనుగుణంగా కొన్ని సవరణలను సూచించింది. దీని ప్రకారం, మంత్రిత్వ శాఖ కీలకమైన సూచనలను పరిగణనలోకి తీసుకుంది, ఈ బిల్లులకు అధికారిక సవరణలను ప్రవేశపెట్టింది, ఆ తరువాత వాటిని 2020 మార్చి 18 న రాజ్యసభలో ' నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, బిల్, 2020 'మరియు' నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి బిల్లు 2020 ' గా ఆమోదించారు.
*****
(Release ID: 1654416)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam