ప్రధాన మంత్రి కార్యాలయం
సెప్టెంబర్ 12వ తేదీన, " గృహ ప్రవేశం" కార్యక్రమంలో పాల్గొని, పి.ఎం.ఎ.వై-జి. కింద మధ్యప్రదేశ్ లో నిర్మించిన 1.75 లక్షల ఇళ్ళను ప్రారంభించనున్న - ప్రధానమంత్రి.
Posted On:
10 SEP 2020 5:38PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, సెప్టెంబర్ 12వ తేదీన, " గృహ ప్రవేశం" కార్యక్రమంలో పాల్గొని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ్ (పి.ఎం.ఎ.వై-జి) కింద మధ్యప్రదేశ్ లో నిర్మించిన 1.75 లక్షల ఇళ్ళను వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించనున్నారు. ఈ ఇళ్ళన్నింటినీ ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి కష్ట కాలంలోనే నిర్మాణం చేపట్టి పూర్తిచేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం డి.డి-న్యూస్ ఛానెల్ లో ప్రత్యక్షంగా ప్రసారమౌతుంది.
నేపధ్యం :
“2022 నాటికి అందరికీ గృహాలు నిర్మించాలి” అని ప్రధానమంత్రి ఇచ్చిన స్పష్టమైన పిలుపు మేరకు, 2016 నవంబర్, 2016 తేదీన పి.ఎమ్.ఏ.వై-జి. అనే ఒక ప్రధానమైన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం కింద ఇంతవరకు దేశవ్యాప్తంగా 1.14 కోట్ల గృహాలను నిర్మించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 17 లక్షల మంది పేద కుటుంబాలు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందాయి. వీరంతా, స్వంత ఇళ్ళు లేని లేదా శిధిలమైన తాత్కాలిక గృహాలలో నివసించిన పేద కుటుంబాలకు చెందినవారు.
పి.ఎమ్.ఏ.వై-జి. కింద, ప్రతి లబ్ధిదారునికి, 1.20 లక్షల రూపాయల మేర 100 శాతం గ్రాంటును, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో అందజేస్తాయి. పి.ఎమ్.ఏ.వై-జి. కింద నిర్మించిన ఈ గృహాలన్నింటికీ, జియో తో అనుసంధానం చేసిన ఛాయాచిత్రాల ద్వారా నిర్మాణంలోని వివిధ దశలను ధృవీకరించిన తరువాత, నిధులను నాలుగు వాయిదాలలో, నేరుగా లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాలకు జమ చేయడం జరిగింది. 2022 నాటికి 2.95 కోట్ల ఇళ్లను నిర్మించాలని ఈ పధకం సంకల్పించింది.
ఇంటి నిర్మాణానికి సహాయంతో పాటు, లబ్ధిదారులకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్) కింద 90 నుండి 95 పనిదినాలకు నైపుణ్యం లేని కార్మిక వేతనాల రూపంలో కూడా సహాయాన్ని అందిస్తారు. దీనితో పాటు, స్వచ్ఛ భారత్ మిషన్- గ్రామీణ్ లేదా ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్. లేదా మరే ఇతర అంకితమైన పధకాల నిధుల ద్వారా మరుగుదొడ్ల నిర్మాణానికి 12,000 రూపాయల చొప్పున ఆర్ధిక సహాయాన్ని అందిస్తారు. ప్రధానమంత్రి ఉజ్జ్వల పథకం కింద ఎల్.పి.జి. కనెక్షన్, విద్యుత్ కనెక్షన్, జల్ జీవన్ మిషన్ కింద సురక్షితమైన తాగునీటి సరఫరా మొదలైన సౌకర్యాల కల్పన కోసం భారత ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు చెందిన ఇతర పథకాలను కలపడానికి, ఈ పథకంలో నిబంధనలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తన “సమృధ్ పర్యవాస్ అభియాన్” ద్వారా సామాజిక భద్రత, పెన్షన్ పథకం, రేషన్ కార్డు, ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ వంటి 17 ఇతర పథకాలకు చెందిన అదనపు ప్రయోజనాలను కూడా అందజేస్తోంది.
*****
(Release ID: 1653137)
Visitor Counter : 271
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam